Independence Day 2023: రికార్డు కొట్టిన దేశ భక్తి మూవీలు.. తెలుగులో ఒక్కటే.. వాటి కలెక్షన్లు చూస్తే!
ఇండియా వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీల నుంచి దేశభక్తి ప్రధానంగా సాగే సినిమాలు వస్తుంటాయి. కానీ, వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల ఆదరణను అందుకుంటున్నాయి. అందులోనూ చాలా తక్కువ చిత్రాలు మాత్రమే సంచలన విజయాన్ని నమోదు చేసుకుంటున్నాయి. తద్వారా అత్యధిక కలెక్షన్లను రాబట్టి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లో స్వతంత్ర దినోత్సవం రాబోతున్న నేపథ్యంలో దేశభక్తి ప్రధానంగా వచ్చి.. 1000 కోట్ల రూపాలయలకు పైగా వసూళ్లను సాధించిన భారతీయ చిత్రాలపై లుక్కేద్దాం పదండి!
వేయి కోట్లు దాటినవి ఐదు: గతంలో కంటే ఈ మధ్య కాలంలో ఇండియాలోని చాలా ఇండస్ట్రీల నుంచి భారీ చిత్రాలు వస్తున్నాయి. అందులో కొన్ని మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లను రాబట్టి కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నాయి. ఇలా ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో కేవలం ఐదు అంటే ఐదు చిత్రాలు మాత్రమే వేయి కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ల మార్కును దాటాయి.
దేశ భక్తితో వచ్చినవే టాప్: ఇండియాలో ఇప్పటి వరకూ ఐదు సినిమాలు మాత్రమే వేయి కోట్ల రూపాయల గ్రాస్ మార్కును దాటాయని చెప్పుకున్నాం. అందులో 'దంగల్', 'బాహుబలి: ది కంక్లూజన్', 'RRR', 'కేజీఎఫ్ చాప్టర్ 2', 'పఠాన్' మూవీలు ఉన్నాయి. వీటిలో 'దంగల్', 'RRR', 'పఠాన్' చిత్రాలు మాత్రం దేశ భక్తితో కూడిన కథలతో వచ్చి ప్రేక్షకుల హృదయాలను గెలిచాయి.

దంగల్ మూవీనే టాప్‌లో: ఆమిర్ ఖాన్ హీరోగా నితేష్ తివారి తెరకెక్కించిన చిత్రమే 'దంగల్'. రెజ్లింగ్ గేమ్ నేపథ్యంతో దేశ భక్తిని తట్టిలేపే విధంగా రూపొందిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ చిత్రం ఫుల్ రన్‌లో రూ. 2024 కోట్లు వసూలు చేసింది. తద్వారా ఇండియాలో అత్యధిక గ్రాస్‌ను వసూలు చేసిన సినిమాల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

రెండో స్థానంలో మనదే: దేశ భక్తి ప్రధానంగా వచ్చిన టాప్ గ్రాస్ మూవీల లిస్టులో మన RRR రెండో స్థానంలో ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం రూ. 550 కోట్లు బడ్జెట్‌తో రూపొందింది. దీనికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించింది. ఫలితంగా ఫుల్ రన్‌లో ఏకంగా రూ. 1316 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసి ఎన్నో రికార్డులను సైతం నమోదు చేసింది.

పఠాన్ కూడా అదే మూవీ: షారూఖ్ ఖాన్ హీరోగా సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించిన చిత్రం 'పఠాన్'. దేశ భక్తిని చాటే కథాంశంతో వచ్చిన ఈ సినిమా రూ. 225 కోట్ల బడ్జెట్‌తోనే రూపొందింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ రావడంతో కలెక్షన్లు పోటెత్తాయి. ఫలితంగా ఈ మూవీ ఫుల్ రన్‌లో రూ. 1050 కోట్లు వసూలు చేసింది. తద్వారా అత్యధిక గ్రాస్ చిత్రాల లిస్టులో చోటు దక్కించుకుంది.


Click it and Unblock the Notifications











