Independence Day 2023 కమల్ హాసన్ గిఫ్ట్.. ఆస్కార్‌కు వెళ్లిన మూవీ ఫ్రీగా స్టీమింగ్.. 23 ఏళ్లకు ఇలా!

ఉలగ నాయగన్ కమల్ హాసన్ ఎన్నో వైవిద్యభరిత సినిమాల్లో నటించి, తెరకెక్కించి విశ్వ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన అనేక దేశభక్తి సినిమాలను సైతం చేశారు. వాటిలో భారతీయుడు, ద్రోహి, విశ్వరూపం వంటి సినిమాలను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు.

ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా కోసం సంసిద్ధం అవుతున్నారు. అలాంటి ఆయన కెరీర్ లో పెద్దగా ఎవరికీ తెలియని గొప్ప దేశభక్తి చిత్రం 'హే రామ్' (Hey Ram). ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ చిత్రాన్ని ఫ్రీగా స్ట్రీమింగ్ చేయనున్నారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

Independence Day 2023: Kamal Haasan Hey Ram Movie Free Streaming In Youtube

నిర్మాణం-దర్శకత్వం: లోకనాయకుడు కమల్ హాసన్ 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రేక్షకులందరికీ మంచి కానుక ఇవ్వనున్నాడు. ఆయన నటించిన ఒక దేశభక్తి సినిమాను అందరికి అందుబాటులో ఉండేలా ఫ్రీగా స్ట్రీమింగ్ చేయనున్నారు. కమల్ హాసన్ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన సినిమా 'హే రామ్' (Hey Ram). అంతేకాకుండా రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఆయనే సొంతంగా నిర్మించారు.

Independence Day 2023: Kamal Haasan Hey Ram Movie Free Streaming In Youtube

షారుక్ సంస్థలో రిలీజ్: ప్రముఖ సంగీత దర్శకుడు, మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన హే రామ్ సినిమా తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కింది. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హే రామ్ సినిమాను హిందీలో తన డ్రీమ్జ్ అన్ లిమిటెడ్ ప్రస్తుతం (రెడ్ చిల్లీస్) డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా అప్పట్లో రిలీజ్ చేశారు. 2000 సంవత్సరం ఫిబ్రవరి 18న హే రామ్ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను పలకరించింది.

Independence Day 2023: Kamal Haasan Hey Ram Movie Free Streaming In Youtube

అగ్ర నటీనటులు: హే రామ్ సినిమాలో కమల్ హాసన్ తోపాటు షారుక్ ఖాన్, హేమ మాలిని, రాణి ముఖర్జి లాంటి బాలీవుడ్ స్టార్స్ నటించారు. ఇంకా ఇందులో గిరీష్ కర్నాడ్, నజీరుద్ధిన్ షా, ఓం పురి, నాజర్, అతుల్ కులకర్ణి వంటి విలక్షణ నటులు కీలకపాత్రలు పోషించారు. పీరియాడిక్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో భారత్, పాకిస్థాన్ విభజన, మహాత్మ గాంధీని నాథూరం గాడ్సె హత్య చేయడం వంటి అంశాలను చూపించారు.

ఆస్కార్స్ కు సినిమా: ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్న హే రామ్ మూవీని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో స్క్రీనింగే చేశారు. అలాగే 25వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, 2000లో కార్నో ఫెస్టివల్ లో ప్రదర్శించారు. అంతేకాకుండా 2000లో హే రామ్ సినిమాను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆస్కార్స్ కు పంపింది. కానీ, ఆస్కార్స్ కు మాత్రం నామినేట్ కాలేకపోయింది.

Independence Day 2023: Kamal Haasan Hey Ram Movie Free Streaming In Youtube

3 అవార్డ్స్: ఇక హే రామ్ మూవీ మూడు జాతీయ చలనచిత్ర అవార్డ్స్ అందుకుంది. నేషనల్ రేంజ్ లోనూ సత్తా చాటింది. ఇలాంటి గొప్ప చిత్రాన్ని ఇప్పుడు 77వ స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day 2023) సందర్భంగా యూట్యూబ్ (Youtube) ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు కమల్ హాసన్.

23 ఏళ్ల తర్వాత: రాజ్ కమల్ ఫిలింస్ (Raaj Kamal Films) ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానెల్ లో ఆగస్ట్ 15న అంటే నేడు సాయంత్రం 6 గంటల నుంచి ఉచితంగా స్ట్రీమింగ్ చేయనున్నారు. దాదాపు ఈ సినిమా వచ్చి 23 ఏళ్లు అవుతుంది. అంటే 23 సంవత్సరాల తర్వాత ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రేక్షకులకు హే రామ్ సినిమాను కమల్ హాసన్ (Kamal Haasan) అందుబాటులోకి తీసుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X