Independence Day 2024: కోట్లు కొల్లగొట్టిన దేశభక్తి చిత్రాలు.. తెలుగులో ఆ ఒక్కటే.. వసూళ్లు చూశారంటే!

అన్ని జోనర్లతో పాటే దేశభక్తి ప్రధానంగా సాగే సినిమాలు కూడా తెరకెక్కుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఇండియా వ్యాప్తంగా ఈ తరహా సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అందులో కొన్ని చిత్రాలు అయితే భారీ స్థాయిలో ప్రేక్షకుల ఆదరణను అందుకుంటున్నాయి. అలా అదిరిపోయే రీతిలో వసూళ్లను సైతం రాబడుతున్నాయి. తద్వారా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంటున్నాయి. మరి కొద్ది రోజుల్లో స్వతంత్ర దినోత్సవం రాబోతున్న నేపథ్యంలో దేశభక్తి ప్రధానంగా వచ్చి అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాలపై లుక్కేద్దాం పదండి!

ఏడు చిత్రాలు 1000 కోట్లు
గతంలో కంటే ఇప్పుడు భారతీయ సినిమా స్థాయి పెరిగిపోయింది. అందుకే అన్ని ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ చిత్రాలు వస్తున్నాయి. అందులో కొన్ని మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లను రాబట్టి కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నాయి. ఇలా ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో కేవలం ఏడు చిత్రాలు మాత్రమే వేయి కోట్ల రూపాయల కంటే ఎక్కువ గ్రాస్ కలెక్షన్లను రాబట్టాయి.

Independence Day 2024 Indian Highest Grossing Periodic Movies List

వాటిలో ఇవే ఎక్కువగానే
ఇండియాలో ఇప్పటి వరకూ ఏడు సినిమాలు మాత్రమే వేయి కోట్ల రూపాయల గ్రాస్ మార్కును దాటాయని చెప్పుకున్నాం. అందులో 'దంగల్', 'బాహుబలి: ది కంక్లూజన్', 'RRR', 'కేజీఎఫ్ చాప్టర్ 2', 'జవాన్', 'కల్కి 2898 ఏడీ', 'పఠాన్' మూవీలు ఉన్నాయి. వీటిలో 'దంగల్', 'RRR', 'పఠాన్' చిత్రాలు మాత్రం దేశ భక్తితో కూడిన కథలతో వచ్చాయి.

టాప్‌లో కుస్తీ పోటీ మూవీ
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ హీరోగా నితేష్ తివారి తెరకెక్కించిన చిత్రమే 'దంగల్'. కుస్తీ పోటీల నేపథ్యంతో దేశ భక్తిని తట్టిలేపే విధంగా రూపొందిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా భారీ రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా ఈ చిత్రం ఫుల్ రన్‌లో రూ. 2024 కోట్లు వసూలు చేసింది. తద్వారా ఇండియాలో అత్యధిక గ్రాస్‌ను వసూలు చేసిన సినిమాల జాబితాలో టాప్‌లో కొనసాగుతోంది.

Independence Day 2024 Indian Highest Grossing Periodic Movies List

రెండో స్థానంలో RRR
దేశ భక్తిని చాటే కథాంశంతో వచ్చిన టాప్ గ్రాస్ మూవీల లిస్టులో మన RRR రెండో స్థానంలో ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా రూ. 550 కోట్లు బడ్జెట్‌తో రూపొందింది. దీనికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కింది. ఫలితంగా ఫుల్ రన్‌లో ఏకంగా రూ. 1387 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసి ఎన్నో రికార్డులను సైతం బద్దలు కొట్టేసింది.

పఠాన్ కూడా అలాగనే
షారూఖ్ ఖాన్ హీరోగా సిద్దార్థ్ ఆనంద్ రూపొందించిన చిత్రం 'పఠాన్'. పిరియాడిక్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందిన ఈ సినిమా రూ. 225 కోట్ల బడ్జెట్‌తోనే వచ్చింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ రావడంతో కలెక్షన్లు పోటెత్తాయి. ఫలితంగా ఈ మూవీ ఫుల్ రన్‌లో రూ. 1050 కోట్లు వసూలు చేసింది. తద్వారా అత్యధిక గ్రాస్ చిత్రాల లిస్టులో చోటు దక్కించుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X