Independence Day 2024: తెలుగులో దేశభక్తిని రగిలించిన స్టార్ హీరో.. ఎక్కువ సినిమాలు చేసింది ఎవరంటే!

సాధారణంగా అన్ని జోనర్లలోనూ ఎక్కువగా సినిమాలు వస్తుంటాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. అలాంటి వాటిలో దేశభక్తిని రేకెత్తించే పేట్రియాటిక్ మూవీల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంతలా ఈ తరహా సినిమాలు ప్రతి ఒక్కరిలో చైతన్యాన్ని రగులుస్తుంటాయి. అలా ఇప్పటికే ఎన్నో చిత్రాలు వచ్చి ప్రేక్షకుల మెప్పును పొందాయి. ఇక, స్వాతంత్ర్య దినోత్సవానికి సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువ దేశభక్తి సినిమాలు చేసిన హీరో గురించి తెలుసుకుందాం పదండి!

టాలీవుడ్‌లో ఎంతో మంది పేరున్న యాక్టర్లు ఉన్నారు. అందులో కొందరు మాత్రమే తమదైన చిత్రాలతో స్టార్లుగా హవాను చూపించారు. అలాంటి వారిలో నందమూరి తారక రామారావు ఒకరు. సుదీర్ఘమైన సినిమా ప్రయాణంలో ఆయన ఎన్నో దేశభక్తి సినిమాల్లో నటించారు. అందులో చాలా వరకూ ప్రేక్షకుల మెప్పును పొంది విజయాలను అందుకున్నాయి. ఆ సినిమాలు ఏంటంటే...

Independence Day 2024 Senior NTR Best Patriotic Movies List

ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో 1949లో విడుదలైన దేశభక్తి సినిమానే 'మన దేశం'. ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య ఉద్యమ నేపథ్యంలో తెరకెక్కించారు. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వీ నాగయ్య, సీహెచ్‌ నారాయణరావు, కృష్ణవేణి కీలక పాత్రల్లో నటించారు. ఘంటసాల సంగీతం సమకూర్చారు. ఎన్టీఆర్ నటించిన తొలి చిత్రం కూడా ఇదే కావడం విశేషం.

ఎన్టీఆర్ దేశభక్తిని టచ్ చేసే స్టోరీతో నటించిన చిత్రాల్లో 'సర్దార్ పాపారాయుడు' ఒకటి. ఈ చిత్రంలో ఆయన తండ్రీ కొడుకులుగా కనిపించారు. ముఖ్యంగా ఇందులో ఈ సీనియర్ స్టార్ హీరో చెప్పిన డైలాగులు ఎంతో మందిని ఆలోచింపజేశాయి. అందుకే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభించడంతో పాటు కలెక్షన్లు కూడా దక్కాయి. ఫలితంగా ఇది హిట్‌గా నిలిచింది.

ఎన్టీఆర్, జయసుధ, జమున ప్రధాన పాత్రల్లో 1982లో వచ్చిన మూవీనే 'నా దేశం'. యువ అనాథ చుట్టూ తిరిగే ఈ యాక్షన్ డ్రామాకు కే బాపయ్య దర్శకత్వం వహించారు. దేశభక్తిని ప్రస్తావించే సందేశాత్మకమైన కథతో ఈ చిత్రం రూపొందింది. దీనికి తెలుగు ప్రేక్షకులు మంచి స్పందనను అందించారు. ఫలితంగా ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది.

Independence Day 2024 Senior NTR Best Patriotic Movies List

1982లో ఎన్టీఆర్ హీరోగా చిత్రం 'బొబ్బలి పులి'. దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీదేవీ, మురళీ మోహన్, జగ్గయ్య, కైకాల సత్యనారాయణ తదితరులు కీలక పాత్రలు పోసించారు. దేశభక్తి ప్రధానంగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయింది. అంతేకాదు, భారీ వసూళ్లను సాధించి కమర్షియల్‌గానూ సక్సెస్‌ను సొంతం చేసుకుంది.

ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన కమర్షియల్ పేట్రియాట్రిక్ మూవీనే 'మేజర్ చంద్రకాంత్'. దేశభక్తికి వాణిజ్య విలువలు జోడించి తీసిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఇందులో పుణ్యభూమి నాదేశం అంటూ సాగే పాటు ఎంతటి ప్రభావాన్ని చూపించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలా ఎన్టీఆర్ తన సుదీర్ఘమైన సినిమా ప్రయాణంలో ఎన్నో దేశభక్తి సినిమాల్లో నటించి కమర్షియల్‌గానూ సక్సెస్‌లను అందుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X