What Is ISPL? నాటు నాటు పాటకు స్టెప్పులేసిన సచిన్.. రాంచరణ్‌కు ఐఎస్‌పీఎల్ సంబంధమేమిటంటే?
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) ప్రారంభ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో మెగా పవర్ స్టార్ రాంచరణ్, అక్షయ్ కుమార్, సూర్య, బోమన్ ఇరానీ, సచిన్ టెండూల్కర్ తదితరులు పాల్గొన్నారు. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా పాల్గొన్నారు. ఐఎస్‌పీఎల్ అంటే ఏమిటి? ఎన్ని జట్లు పాల్గొంటున్నాయి? జట్టు ఓనర్లు ఎవరు? ఈ ప్రారంభ వేడుక గురించిన వివరాల్లోకి వెళితే..
ISPL అంటే ఏమిటి?
దేశంలోని ప్రతిభావంతులైన క్రికెటర్లను గుర్తించే మిషన్‌గా ధి ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. టెన్నిస్ బాల్‌తో ఆడే టీ10 టోర్నమెంట్‌గా డిజైన్ చేశారు. గుర్తింపునకు నోచుకొని క్రికెట్ టాలెంట్‌కు అండగా నిలిచే ఓ మంచి ప్రయత్నంగా ఈ టోర్నమెంట్‌ను ప్రారంభించారు.

ప్రారంభ వేడుకలో నాటు నాటు
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) ప్రారంభ వేడుక కన్నుల పండువగా జరిగింది. ఈ టోర్నమెంట్ ప్రారంభ వేడుకలో మరోసారి నాటు నాటు పాట ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ పాటపై రాంచరణ్‌తో కలిసి సచిన్ టెండూల్కర్, సూర్య, అక్షయ్ కుమార్, బోమన్ ఇరానీ స్టెప్పులు వేయడం ట్రెండింగ్‌గా మారింది.
ISPL మొత్తం జట్లు ఎన్ని?
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) టోర్నమెంట్‌లో మొత్తం ఆరు టీమ్‌లు ఉన్నాయి. మాజీ ముంబై జట్టుకు అమితాబ్ బచ్చన్ యజమానిగా, శ్రీనగర్ కే వీర్ జట్టుకు ఓనర్‌గా అక్షయ్ కుమార్, బెంగళూరు స్ట్రైకర్స్ జట్టుకు హృతిక్ రోషన్, చెన్నై సింగమ్ జట్టుకు సూర్య, ఫాల్కన్ రైజర్స్ జట్టుకు రాంచరణ్, టైగర్ ఆఫ్ కోల్‌కతా జట్టుకు సైఫ్ ఆలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ యజమానులుగా ఉన్నారు.
మ్యాచ్‌లు ఎన్ని? ఫైనల్ ఎప్పుడు?
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) టోర్నమెంట్‌లో ఆరు జట్లు పాల్గొంటాయి. రౌండ్ రాబిన్ పద్దతిలో జరిగే ఈ పోటీలో మొత్తం 15 మ్యాచ్‌లు ఆడుతారు. ఈ పోటీల పట్టికలో టాప్ 4 స్థానాల్లో నిలిచిన జట్లను సెమిఫైనల్స్ ఆడిస్తారు. అనంతరం వారిలో గెలిచిన వారికి ఫైనల్ మ్యాచ్ నిర్వహించి జట్టు విజేతగా ప్రకటిస్తారు.

ISPL మ్యాచ్‌లు ఎక్కడ చూడొచ్చు
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) మ్యాచ్‌లు థానేలోని దాదోజీ కొండదేవ్ స్టేడియంలో జరుగుతాయి. మొత్తం 15 మ్యాచులు అక్కడే నిర్వహిస్తారు. గ్రాండ్ ఫినాలేను మార్చ్ 15వ తేదీన జరుగుతుంది. ఈ పోటీలను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్స్‌లో ప్రసారం చేస్తారు. సోనీ లివ్ యాప్‌లో కూడా ఈ పోటీలను చూడొచ్చు.


Click it and Unblock the Notifications











