Indra 4K Collections: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఇంద్ర.. అడ్వాన్స్ బుకింగ్ ఎన్ని కోట్లంటే?
బీ గోపాల్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇంద్రలో మెగాస్టార్ సరసన సోనాలీ బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్లుగా నటించగా.. ప్రకాష్ రాజ్, ముఖేష్ రుషి తదితరులు కీలకపాత్రలు పోషించారు. కథ, కథనం, డైలాగ్స్ , చిరంజీవి నటన, మణిశర్మ సంగీతం ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన మూవీలో చిరంజీవి నటించడం అదే తొలిసారి.
రూ. 10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఇంద్ర .. 2002 జూలై 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. రూ.55 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకుని అప్పటి వరకు దక్షిణాదిలో హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది. అప్పటి వరకు సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన పడయప్ప (తెలుగులో నరసింహ) పేరిట ఈ రికార్డు ఉండేంది. మెగాస్టార్ వసూళ్ల సునామీలో ఆ రికార్డులన్నీ కొట్టుకుపోయాయి. మహేశ్ బాబు నటించిన పోకిరి వచ్చే వరకు చిరంజీవి రికార్డు చెక్కు చెదరలేదు.

ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తుండటంతో ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని ఇంద్రను రీ రిలీజ్ చేయనున్నారు. వరల్డ్ వైడ్‌గా భారీ ఎత్తున ఇంద్రను రీ రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ సన్నాహాలు చేస్తోంది. కల్కి 2898 ఏడీతో అశ్వినీదత్ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా మరింత పాపులారిటీ పెరిగింది. అది ఇంద్ర రీ రిలీజ్‌కు కూడా ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు.. రీ రిలీజ్‌లోనూ ఇంద్ర ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల హౌస్‌ఫుల్స్ అవుతుండగా.. హైదరాబాద్‌లోని చాలా చోట్ల సోల్డ్ అవుట్స్ కనిపిస్తున్నట్లు వైజయంతీ మూవీస్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. బుకింగ్స్ ఓపెన్ అయిన క్షణాల్లోనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇక్కడ 133 షోలను స్క్రీనింగ్ చేయాలని డిసైడ్ అవ్వగా.. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 55.4 కోట్ల గ్రాస్ వసూలైందట.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఏడుకు ఏడు షోలు హౌస్‌ఫుల్ అయినట్లుగా టాక్.. ఈ 7 షోలకు గాను రూ.11,93,815 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. డిమాండ్ నేపథ్యంలో అదనంగా స్క్రీన్‌లు, షోలను యాడ్ చేసుకుంటూ వెళ్లాలని వైజయంతీ మూవీస్ భావిస్తోంది. కర్ణాటకలో రూ.17,64,160 గ్రాస్ వసూలైనట్లుగా సమాచారం. మొత్తం 37 షోలు ప్రదర్శించాలని నిర్మాతలు భావించగా.. 11 షోలకు ఫాస్ట్ ఫిల్లింగ్ అయితే, 3 షోలకు సోల్డ్ ఔట్ అని మేకర్స్ తెలిపారు.
భారతదేశంలోనే కాదు.. ఓవర్సీస్‌లోనూ ఇంద్ర ప్రభంజనం సృష్టిస్తోంది. ఇండియాలో ప్రీ బుకింగ్స్ 1.1 కోట్లు ఉండగా.. తెలుగు ఆడియన్స్ పెద్ద సంఖ్యలో ఉన్న అమెరికాలోనూ బుకింగ్స్ ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. అక్కడ దాదాపు 20 వేల వరకు ప్రీ బుకింగ్స్ జరగ్గా.. డల్లాస్, ఆస్టిన్ నగరాల్లో భారీగా టికెట్స్ బుక్ అవుతున్నాయి. మాస్ రెస్పాన్స్‌తో డల్లాస్‌లోని సినీ మార్క్ ఎక్స్‌డీలో ఎక్స్‌ట్రా షోలను యాడ్ చేశారు. అక్కడ ప్రీ బుకింగ్స్‌తోనే ఇప్పటి వరకు 8727 డాలర్లు వసూలైనట్లుగా టాక్. అటు యూకేలోనూ బాస్ మేనియా కనిపిస్తోంది. మొత్తంగా ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇంద్ర 1.75 కోట్ల కలెక్షన్స్ సాధించిందని ఫిలింనగర్ టాక్.


Click it and Unblock the Notifications











