ఆర్య 16: అల్లు అర్జున్ బిగ్గెస్ట్ హిట్.. మీకు తెలియని ఆసక్తికర విషయాలు!
టాలీవుడ్ బెస్ట్ లవ్ స్టోరీస్ లిస్ట్ తీస్తే.. అందులో ఆర్య సినిమా టాప్ లో ఉంటుందని చెప్పవచ్చు. ఇంటిలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ మొదటి సినిమా ఇదే. అలాగే కథానాయకుడు అల్లు అర్జున్ మొదటి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న చిత్రం కూడా ఇదే. ఓ విధంగా ఇద్దరికి ఈ సినిమా యూ టర్న్ ఇచ్చిందని చెప్పవచ్చు. నేటితో ఈ సినిమా వచ్చి 16ఏళ్లు గడిచింది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలపై ఒక లుక్కేస్తే..
Recommended Video

దిల్ సినిమాకు పని చేస్తూనే..
మొదట వివి.వినాయక్ దిల్ సినిమాకు దర్శకుడు సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. అయితే అదే సమయంలో ఆర్య కథను డెవలప్ చేసుకొని నిర్మాత దిల్ రాజుకు వినిపించాడు. స్టోరీ పాయింట్ కొత్తగా అనిపించడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

సైకో సినిమాలు చూసి..
ఆర్య కథ రాయడానికి ముందు సుకుమార్ కొన్ని సైకో బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీస్ లాంటి సినిమాలు చూసాడట. ఆ తరువాత హీరో పాత్రను సరదాగా పాజిటివ్ గా ప్రజెంట్ చేస్తూనే ఇలాంటి లైన్ తో ముందుకు వెళ్లాలని అనుకోని ఆర్య కథను రాసారట. కొంచెం ఎమోషనల్ టచ్ కూడా ఉండడంతో దిల్ రాజు సినిమాను చాలా ఇష్టపడ్డారట.

నో చెప్పిన ప్రభాస్, నితిన్..
ఈ కథ పూర్తవగానే నిర్మాత దిల్ రాజు, సుకుమార్ చాలా మంది హీరోలకు కథను వినిపించారట. మొదట రవితేజ, ప్రభాస్, నితిన్ వంటి వారిని సంప్రదించగా వారు నో చెప్పేశారట. హీరోలకు నచ్చే విధంగా కథలో మార్పులు చేసినా కూడా ఒప్పుకోలేదట.

గంగోత్రి హిట్టుతో..
గంగోత్రీ సినిమాతో సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ ని చూసి సుకుమార్ అతనితో చేస్తే బావుంటుందని నిర్మాతకు చెప్పగా కొన్ని రోజులు ఆలోచించి ఒప్పేసుకున్నారట. సినిమా సెట్టవ్వడంతో వెంటనే అనుకున్న షెడ్యూల్ కంటే ముందే సినిమాను ఫినిష్ చేశారట.

పవన్ కళ్యాణ్, ప్రభాస్ ముఖ్య అతిధులుగా..
2004 ఏప్రిల్ 16న సినిమా ఆడియో లాంచ్ ని హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడాలో నిర్వహించగా వేడుకకు.. ప్రభాస్, పవన్ కళ్యాణ్ లు ముఖ్య అతిధులుగా వచ్చారు. అనంతరం రాఘవేంద్రరావు రావు చేతుల మీదుగా ఆడియోను రిలీజ్ చేశారు.

మొదటిరోజే హిట్టు..
మొదటిరోజే సినిమాకు పాజిటివ్ టాక్ అందుకుంది. 2004 మే 7న విడుదలైన ఆర్య సినిమా ఊహించని విధంగా ఇండస్ట్రీని కదిలించింది. అప్పటివరకు వచ్చిన రెగ్యులర్ లవ్ స్టోరీలకు సినిమా భిన్నంగా ఉండడంతో ఆడియెన్స్ సినిమాను చూసేందుకు ఎగబడ్డారు. కొన్నిరోజుల పాటు అన్ని ఏరియాల్లో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీత కూడా సినిమాకు ప్లస్ అయ్యింది.

బాక్సాఫీస్ బద్దలు..
టాప్ బాక్సాఫీస్ ఇండస్ట్రీ హిట్ గా అప్పట్లో ఆర్య సెన్సేషన్ క్రియేట్ చేసింది. 4కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఆ సినిమా 25కోట్లకు పైగా లాభలని అందించింది. అప్పట్లో నైజం ఏరియాలోనే 4కోట్లవరకు కలెక్ట్ చేసినట్లు కథనాలు వచ్చాయి. ఓకేవేళ అదే సినిమా గనక ఈ కాలంలో వచ్చి ఉంటే కలెక్షన్స్ లెక్కల ప్రకారం 70కోట్లకు పైగా షేర్స్ వచ్చేవని బాక్సాఫీస్ నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











