మెగా నందమూరి వార్.. రేపే అసలు ఆట.. చెక్ పెట్టేదెవరు?

మెగా నందమూరి వార్ కి ఎండ్ కార్డ్ పెట్టె సమయం ఆసన్నమైంది. బాలకృష్ణ మాటలు మెగాస్టార్ చిరంజీవి తీరుతో వారిద్దరి మధ్య వ్యక్తిగత అభిప్రాయ బేధాలు ఉన్నట్లు ఇప్పటికే అభిమానులకు ఒక క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం బాలయ్య vs మెగాస్టార్ అనే రీతిలో అభిమానుల మధ్య మాటల తూటాలు కూడా గట్టిగానే పేలుతున్నాయి.

Recommended Video

Mega Nandamuri Clash
వైరల్ అవుతూనే ఉన్నాయ్..

వైరల్ అవుతూనే ఉన్నాయ్..

సోషల్ మీడియాలో ఈ వార్ కి సంబంధించిన కామెంట్స్ ప్రతి రోజు వైరల్ అవుతూనే ఉన్నాయి. సీఎం కేసీఆర్, మంత్రి తలసానితో ఇప్పటికే మెగాస్టార్ ఆధ్వర్యంలో మీటింగ్ జరిగిన విషయం తెలిసిందే. అలాగే జగన్ తో కూడా షూటింగ్ లపై చర్చలు జరపనున్నారు. ఆ విషయంపై బాలయ్య గట్టిగానే అప్సెట్ అయినట్లు ఆయన చేసిన కామెంట్స్ తో క్లారిటీ వచ్చేసింది.

 మరింత వేడెక్కింది..

మరింత వేడెక్కింది..

స్వలాభం కోసమే కొంతమంది కావాలని ఇలా చేస్తున్నారని మెగాస్టార్ పై ఇన్ డైరెక్ట్ గా విమర్శలు చేశారు బాలకృష్ణ. దీంతో మెగా నందమూరి వార్ మరింత వేడెక్కింది. ఇద్దరు స్టార్ హీరోలు ఈ విధంగా రచ్చకెక్కితే అభిమానుల పరిస్థితి ఏమిటనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. అయితే ఫైనల్ గా రేపటితో ఈ కనిపించని యుద్ధానికి ఎండ్ కార్డ్ పడుతుందా లేదా అనే విషయంలో ఒక క్లారిటీ రానుంది.

బాలకృష్ణ బర్త్ డే..

బాలకృష్ణ బర్త్ డే..

జూన్ 10న నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో ఆభిమానూలు సెలబ్రేషన్స్ చేసుకోవడానికి సిద్దమయ్యారు. అయితే బాలకృష్ణకి 60వ పుట్టినరోజు కావడం వలన కొంతమంది ప్రముఖులు ఆయన్ను ప్రత్యేకంగా కలుసుకొనున్నారు. అలాగే బాలయ్య వారికి స్పెషల్ గా విందు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ విందుకు మెగాస్టార్ ని ఇన్వైట్ చేస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది.

వెయిట్ చేయాల్సిందే..

వెయిట్ చేయాల్సిందే..

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతారా లేదా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎందుకంటే.. మెగాస్టార్ సోషల్ మిడియాలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క సినీ ప్రముఖులకు తన విషెస్ అందిస్తున్నారు. దీంతో బాలకృష్ణ బర్త్ డేకు కూడా తన విషెస్ అందిస్తారా? లేదా? అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. మెగా నందమూరి వార్ కి ఎండ్ కార్డ్ పడిందో లేదో తెలియాలి అంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X