For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీఎస్టీ కోసం వర్మ ఫస్ట్ హైదరాబాదీ నటినే అడిగాడట.. న్యూడ్‌గా చేయడానికి సిద్ధమని హ్యాండ్ ఇచ్చేసింది

|
GST కోసం వర్మ ఫస్ట్ హైదరాబాదీ నటినే అడిగాడట : కానీ || Filmibeat Telugu

భారతదేశంలోనే సంచలన దర్శకుడిగా పేరొందాడు రాంగోపాల్ వర్మ. దీనికి కారణం కొన్నేళ్లుగా ఆయన చేస్తున్న హడావిడే. గతంలో ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలు చేసిన ఈ దర్శకుడు.. కొద్దిరోజులుగా తన పంథాను మార్చుకున్నాడు. ఈ క్రమంలోనే వివాదాస్పద అంశాలపై సినిమాలు చేస్తున్నాడు. దీంతో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే సెక్సీ బ్యూటీ షెర్లిన్ చోప్రా రాంగోపాల్ వర్మపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా వీళ్ల గురించి మరో వార్త తెరపైకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

గాడ్, సెక్స్ అండ్ ట్రూత్

గాడ్, సెక్స్ అండ్ ట్రూత్

దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ హాలీవుడ్ పోర్న్ స్టార్ మియా మాల్కోవా అనుభవాలతో కూడిన ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. దీన్ని డైరెక్టుగా ఆన్‌లైన్‌లోనే రిలీజ్ చేశాడు వర్మ. ఎన్నో వివాదాలు.. మరెన్నో ఆటంకాల మధ్య ‘జీఎస్టీ' గత సంవత్సరం రిపబ్లిక్ డే రోజు విడుదల చేద్దామనుకున్నాడు. అప్పుడు వెబ్‌సైట్ క్రాష్ అవడంతో జనవరి 27న ఆన్‌లైన్‌లో విడుదలైంది. దీనికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించిన విషయం తెలిసిందే.

వెబ్‌సైట్ క్రాష్

వెబ్‌సైట్ క్రాష్

‘జీఎస్టీ' తీస్తానని రాంగోపాల్ వర్మ ప్రకటించినప్పటి నుంచే దీనిపై హైప్ క్రియేట్ అయింది. తర్వాత వివాదాలు చుట్టు ముట్టడంతో హాట్ టాపిక్ అయింది. దీంతో ఈ వీడియోకు భారీగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్ల తాకిడి వల్ల తొలి రోజు జీఎస్టీ వీడియోను ఉంచిన వెబ్ సైట్ క్రాష్ అయ్యింది. దీంతో మరుసటి రోజు మూవీని రిలీజ్ చేశారు. ఆరోజు కూడా భారీ స్పందన ఉన్నప్పటికీ యూనిట్ జాగ్రత్తలు తీసుకోవడంతో ఎటువంటి సమస్యా తలెత్తలేదు.

భారీ హైప్.. బోలెడంత ఆదాయం

భారీ హైప్.. బోలెడంత ఆదాయం

ఈ సినిమా వల్ల యూనిట్‌కు భారీగా ఆదాయం వచ్చింది. విడుదలకు ముందే ఎంతో హైప్ క్రియేట్ అయిన ఈ సినిమాకు రూ. 70 లక్షలు ఖర్చు పెట్టారట. ఇందులో మియా మాల్కోవాకు ఇచ్చిన రెమ్యూనరేషనే ఎనభై శాతం ఉందని వార్తలు వచ్చాయి. తక్కువ ఖర్చుతో రూపొందిన ఈ సినిమాకు దాదాపు రూ. 15 కోట్లు ఆదాయం వచ్చిందని అప్పట్లో ప్రచారం జరిగింది. దీంతో జీఎస్టీ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం అయింది.

ఆ హీరోయిన్‌ను అనుకున్నారట

ఆ హీరోయిన్‌ను అనుకున్నారట

తాజాగా ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఇందులో మియా మాల్కోవాను తీసుకోవడానికి ముందు రాంగోపాల్ వర్మ.. హైదరాబాదీ హీరోయిన్ షెర్లిన్ చోప్రాతో సంప్రదింపులు జరిపాడట. బాలీవుడ్‌కు చెందిన ఓ సినీ ప్రముఖుడితో మంతనాలు జరిపించాడని తాజాగా ఓ విషయం ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తోంది. దీనికి కారణం తాజాగా షెర్లిన్.. వర్మపై సంచలన వ్యాఖ్యలు చేయడమే.

 మొదట ఒప్పుకుని తర్వాత హ్యాండిచ్చిందట

మొదట ఒప్పుకుని తర్వాత హ్యాండిచ్చిందట

ఈ సినిమాలో నటించడానికి షెర్లిన్ మొదట ఒప్పుకుందని ప్రచారం జరుగుతోంది. దీంతో కొన్ని ఫొటో షూట్లు కూడా చేసిందట. అయితే, కొద్దిరోజుల తర్వాత న్యూడ్‌గా నటించడానికి సిద్ధమే కానీ, రెమ్యూనరేషన్ మాత్రం భారీగా ఇవ్వాలని డిమాండ్ చేసిందని తెలుస్తోంది. దీనికి వర్మ నో చెప్పడంతో ఆమె సినిమా నుంచి తప్పుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె తప్పుకున్న తర్వాతనే మియా మాల్కోవాను తీసుకున్నారని తెలిసింది.

ఆఫర్ కావాలంటే సెక్స్ వీడియో పంపాడు

ఆఫర్ కావాలంటే సెక్స్ వీడియో పంపాడు

తాజాగా షెర్లిన్ ఓ మీడియాతో మాట్లాడుతూ.. వర్మ సినిమాలో ఆఫర్ కావాలని అడిగితే.. ఆయన తనకు సెక్స్ వీడియో పంపించాడని సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలు చేయడానికి కారణం జీఎస్టీ విషయంలో ఇద్దరి మధ్యా తలెత్తిన వివాదమేనని సినీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే వర్మపై కేసు పెట్టడానికి కూడా షెర్లిన్ ధైర్యం చేయలేదని అంటున్నారు.

English summary
God, Sex and Truth is a 2018 film written and directed by Ram Gopal Varma and starring Mia Malkova, an American pornographic actress. The film is a short documentary about strength of women sexuality and beauty. The film music is scored by M. M. Keeravani, who was known as MM Kreem for his Hindi compositions. God, Sex and Truth is a 2018 film written and directed by Ram Gopal Varma and starring Mia Malkova, an American pornographic actress. The film is a short documentary about strength of women sexuality and beauty. The film music is scored by M. M. Keeravani, who was known as MM Kreem for his Hindi compositions.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more