IPL 2025: ఆ హీరోయిన్ వల్ల ఢిల్లీకి షాకిచ్చిన కేఎల్ రాహుల్... తొలి రెండు మ్యాచ్‌లకి డుమ్మా
క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్- సీజన్ 18 (ఐపీఎల్ 2025) సీజన్ మరికొద్దిగంటల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే దేశమంతా ఐపీఎల్ ఫీవర్ ఊపేస్తోంది. మార్చి 22న ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెర్మనీకి గ్రాండ్‌గా ఏర్పాట్లు చేశారు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. నాలుగోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలని కోల్‌కతా.. ఈసారైనా కప్ కొట్టాలని బెంగళూరు గట్టి పట్టుదలతో ఉన్నాయి.
కోల్‌కతా నైట్ రైడర్స్‌కు అజింక్య రహానె సారథ్యం వహిస్తుండగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు రజత్ పటీదార్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. పేపర్ మీద బలంగా కనిపించే బెంగళూరు ఒక్కసారి కూడా ఐపీఎల్ కప్ కొట్టలేదు. ప్రతీసారి ఆత్మవిశ్వాసం బరిలో దిగడం ఉసూరుమంటూ నిష్క్రమించడం ఆ జట్టుకు అలవాటుగా మారింది. కానీ ఈసారి మాత్రం కప్ కొట్టాలనే కృత నిశ్చయంతో ఉంది బెంగళూరు. అటు కేకేఆర్‌లో ఆల్‌రౌండర్లు, హార్డ్ హిట్టర్లు ఉండటంతో ఈ జట్టును ఎదుర్కోవడం కష్టమే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.

బెంగళూరు మాదిరిగానే ఢిల్లీ క్యాపిటల్స్‌ది ఐపీఎల్‌లో తీరని వ్యథే. ఇప్పటి వరకు ఈ జట్టు కూడా టైటిల్ విజేతగా నిలవలేకపోయింది. పలుమార్లు ప్రయోగాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే ఈ సీజన్‌లో మాత్రం ఛాన్స్ మిస్ చేసుకునేది లేదని ఢిల్లీ జట్టు బలంగా చెబుతోంది. కెప్టెన్సీ బాధ్యతల విషయంలో తొలుత ఈ జట్టులో డైలమా నెలకొంది. 2024లో లక్నో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్‌ని మెగా వేలానికి ముందు ఆ జట్టు వదులుకుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ రాహుల్‌ని దాదాపు రూ. 12 కోట్లకు దక్కించుకుంది. ఢిల్లీ నుంచి రిషబ్ పంత్ నిష్క్రమించడంతో అతని స్థానంలో కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరిస్తాడని అంతా అనుకున్నారు.
కానీ అనూహ్యంగా రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు తిరస్కరించడంతో అక్షర్ పటేల్‌కు సారథ్య బాధ్యతలు దక్కాయి. అయితే ఢిల్లీకి కేఎల్ రాహుల్ మరో షాకిచ్చాడు. తొలి రెండు మ్యాచ్‌లకు ఆయన దూరం కానున్నారు. ఐపీఎల్ 2025లో భాగంగా విశాఖపట్నంలో మార్చి 24న జరిగే తొలి మ్యాచ్‌లో లక్నోతో తలపడనుంది ఢిల్లీ. ఆ వెంటనే మార్చి 30న హైదరాబాద్‌లో సన్‌రైజర్స్‌ను ఢీకొట్టనుంది. ఈ రెండు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ దూరం కానున్నారు. దీంతో అక్షర్ పటేల్ ఢిల్లీ మేనేజ్‌మెంట్‌తో కలిసి పటిష్టమైన జట్టును తయారు చేయనున్నాడు. అలాగే రాహుల్ లేకపోవడంతో బ్యాటింగ్ ఆర్డర్‌లోనూ మార్పులు జరగనున్నాయి,
అయితే ఇంతకీ రాహుల్ ఎందుకు తొలి రెండు మ్యాచ్‌లకు డుమ్మా కొట్టాడు అనేది చర్చనీయాంశమైంది. దీనికి కారణం అతని భార్య అథియా శెట్టి. గర్భం దాల్చిన అథియా తన మొదటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా మహిళా జట్టు కెప్టెన్ అలిస్సా హిలీ తెలిపారు. బాలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు సునీల్ శెట్టి కుమార్తె అథియా శెట్టి. కొన్నాళ్లు డేటింగ్ చేసిన ఈ జంట పెద్దల అంగీకారంతో ఒక్కటైంది.
2023 జనవరి 23న మహారాష్ట్రలోని ఖండాలాలో సునీల్ శెట్టికి చెందిన ఫామ్‌హౌస్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు వీరి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ క్రమంలోనే అథియా శెట్టి గర్భం దాల్చగా.. కొంతకాలంగా రాహుల్ భార్య పక్కనే ఉంటున్నాడు. ఆమెకు నెలలు నిండటంతో త్వరలోనే డెలివరీ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌లకు రాహుల్ దూరం కానున్నారు.


Click it and Unblock the Notifications











