మన వరకు వస్తే గానీ బుద్ది రాదన్న మాట.. అనసూయ వివాదస్పద ట్వీట్.. నెటిజన్స్ ఫైర్

అనసూయకు సోషల్ మీడియాలో ఎంత పాజిటివిటీ ఎదురు అవుతుందో.. అంతకు మించి నెగెటివిటీ ఎదురవుతుంది. ఆమె బ్లాక్ చేసే లిస్టే ఓ ఛాంతాడంత ఉంటుంది. ఎందుకు మీరు అలా బ్లాక్ చేస్తారని అడిగితే.. తన చుట్టూ ఎప్పుడూ పాజిటివిటీయే ఉండాలని, నెగిటివ్ అవసరం లేదని అందుకే అలాంటి కామెంట్స్ చేసేవారిని బ్లాక్ చేస్తానని చెప్పుకొచ్చింది. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీలో తలదూర్చే అనసూయ.. తాజాగా ఓ కామెంట్ చేసింది. అయితే అది ఎవరినీ ఉద్దేశించి చేసింది? ఎందుకు చేసింది? అని మాత్రం ఎవ్వరికీ స్పష్టంగా అర్థం కావడం లేదు. అసలు ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

Recommended Video

Anchor Anasuya Bharadwaj Strong Warning || మర్యాదగా కామెంట్స్ డిలీట్ చెయ్యండి..!
కిల్ ఫేక్ న్యూస్..

కిల్ ఫేక్ న్యూస్..

విజయ్ దేవరకొండ తనపై తప్పుడు వార్తలు రాసిన వెబ్‌సైట్స్‌పై విరుచుకుపడ్డారు. కావాలని, పనిగట్టుకుని తప్పుడే ప్రచారం చేస్తున్నారని, సదరు వెబ్ సైట్ రాసిన వార్తను చదివి వినిపించాడు. ఇలాంటి ఫేక్ న్యూస్ రాసే వెబ్ సైట్స్‌ను కట్టడి చేయాలని పిలుపునిచ్చాడు. విజయ్ తీసుకున్న నిర్ణయానికి టాలీవుడ్ మొత్తం కదలింది.

అనసూయ వివాదాస్పద ట్వీట్..

అనసూయ వివాదాస్పద ట్వీట్..

కాసేట్లోనే విజయ్ షేర్ చేసిన వీడియో వైరల్ అయింది. అయితే కొద్ది సేపటి తరువాత అనసూయ ఓ ట్వీట్ చేసింది. మనవరకు వస్తే గానీ అర్థం కాదన్న మాట అంటూ ఓ వివాదాస్పద వ్యాఖ్య చేసింది. అయితే ఇది ఎవరికి ఉద్దేశించిన స్టేట్మెంట్ అన్నది ఒక్క అనసూయకే తెలియాలి.

 నెటిజన్స్ ఫైర్..

నెటిజన్స్ ఫైర్..

అయితే ఈమె ట్వీటేసిన సమయం, సందర్భం అన్ని కలిపి చూస్తే విజయ్ దేవరకొండను ఉద్దేశించే కామెంట్ చేసిందని కొంతమంది, కాదు కాదు మహేష్ బాబును టార్గెట్ చేసిందని మరికొందరు ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు కామెంట్స్ చేస్తున్నారు. ఇది చివరకు మహేష్ బాబు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్‌గా మారింది.

మధ్యలో మెగా ఫ్యాన్స్..

మధ్యలో మెగా ఫ్యాన్స్..

ఇలా ఓ వైపు ఫ్యాన్ వార్ జరుగుతుండగా.. మెగా అభిమానులు కూడా మధ్యలో వచ్చారు. పవన్ కళ్యాణ్‌‌పై తప్పుడు వార్తలు రాసినప్పుడు , ఆయన అమ్మను ధూషించినప్పుడు ఎవ్వరూ కూడా ముందుకు రాలేదని, ఖండించలేదని ఈ సందర్భంగా వాపోతోన్నారు.

అటెన్షన్ కోసమే..

అటెన్షన్ కోసమే..

అయితే ఇంకా కొందరు నెటిజన్స్.. కేవలం అటెన్షన్ కోసమే ఈ ట్వీట్ చేసిందని మండిపడుతున్నారు. ఏది ఏమైనా ఏ ఉద్దేశంతో అనసూయ ఈ ట్వీట్ చేసిందో గానీ ట్విట్టర్‌లో పెద్ద యుద్దమే జరుగుతోంది. మరి వీటిపై ఏదైనా క్లారిఫికేషన్ ఇస్తుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X