మాధవీలత పెళ్లి ఫిక్స్! .. కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను..త్వరలోనే చెబుతానంటూ పోస్ట్
మాధవీలతా సినిమాల కంటే బయటి వివాదాలతోనే ఎక్కువగా ఫేమస్ అయింది. ఆ మధ్య యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ, క్యాస్టింగ్ కౌచ్ పోరాటంలో శ్రీ రెడ్డికి వ్యతిరేకంగా, పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా నిలబడటం, నిత్యం ఏదో ఒక పోస్ట్ చేయడం లాంటి వాటితో మాధవీలత ఓ రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకుంది. రాజకీయంగానూ విమర్శలు చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మాధవీలత తాజాగా చేసిన పోస్ట్ కొత్త అనుమాలను రేకెత్తిస్తోంది.
Recommended Video

మాధవీలత వైరల్ పోస్ట్‌లు..
మాధవీలత నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఆ మధ్య చిత్రపురి కాలనీ సమస్యలపై, రాకేష్ మాస్టర్ వ్యవహారంపై, కరోనా వైరస్ వ్యాప్తి చెందడంపై, లిక్కర్ షాపులు ఓపెన్ చేయడంపైనా కామెంట్స్ చేసింది. ఇక శ్రీరెడ్డిపై చేసే పరోక్ష కామెంట్స్ తెగ వైరల్ అవుతుంది.

సెలెబ్రిటీల పెళ్లిళ్లపై..
లాక్‌డౌన్‌లో దిల్ రాజు, నిఖిల్ సిద్దార్థ్‌ల పెళ్లిళ్లు జరిగాయి. వీటిపైనా మాధవీలత సెటైర్స్ వేసింది. ముసుగులో పెళ్లిళ్లు ఏంట్రా? జనాలు చచ్చిపోతున్నార్రా.. ఆగలేకపోతున్నారా.. నిజ స్వరూపాలు బయట పడిపోతాయని త్వరగా పెళ్లిళ్ల చేసుకుంటున్నారా? అంటూ ఓ రేంజ్‌లో విరుచుకుపడింది.

నేను కూడా అలాంటిదాన్నే..
రీసెంట్‌గా సమంత చేసిన ఓ కామెంట్‌ను స్క్రీన్ షాట్ తీసుకుని మాధవీలత తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ‘ఈ పోస్ట్ నాకెంతో నచ్చింది. అవును నిజమే.. కించపరిస్తే, తక్కువగా చూస్తే నాలోని బెస్ట్ బయటకు వస్తుంది.. గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.. వాస్తవానికి అదే నేను.. ' అని మాధవీలత కామెంట్ చేసింది.

త్వరలోనే చెబుతా..
తాజాగా మాధవీలత చేసిన ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ‘ఎన్నో నెలల తరువాత ఎంతో హ్యాపీగా ఉన్నాను. కొత్త జీవితం ప్రారంభం అయింది.. అద్భుతాలు జరిగాయి.. అందుకే నేను అద్భుతాలను నమ్ముతుంటాను.. చాలా చాలా సంతోషంగా ఉన్నాను.. త్వరలోనే ప్రకటిస్తాను'అని తెలిపింది.

పెళ్లి ఫిక్స్..
అయితే ఈ పోస్ట్‌ను చూసిన నెటిజన్స్.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారా? అని సెటైర్స్ వేయగా.. లేదు ఇంకా యాక్టివ్‌గా అవుతున్నానని తెలిపింది. మెజార్టీ జనాలు మాత్రం పెళ్లి ఫిక్స్ అయిందని, వరుడు ఎవరని? పెళ్లి ఎప్పుడని అడుగుతున్నారు. మరి ఈ పోస్ట్ ఉద్దేశం ఏంటో మాధవీలతకే తెలియాలి. అయినా త్వరలోనే ప్రకటిస్తుందని చెప్పింది కదా.. ఏం చెబుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











