Klin Kaara: క్లింకారా పుట్టిన వేళా విశేషం..పవన్ కల్యాణ్ గ్రాండ్ విక్టరీతో మరోసారి నిజమైన సెంటిమెంట్

గొడ్డొచ్చిన వేళ.. బిడ్డొచ్చిన వేళ అని మన పెద్దలు అంటూ ఉంటారు. కొందరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులకు విపరీతంగా కలసొస్తుంది. అలాగే భార్య మెట్టినింటికి వచ్చిన తర్వాత ఆ కుటుంబానికి లేదా భర్త జీవితంలో మంచి స్థితికి చేరుకుంటారు. కొందరు తమ కష్టాన్నే నమ్ముకుంటే.. ఇంకొందరు మాత్రం ఇలాంటి అంశాలకు అధిక ప్రాధాన్యతనిస్తారు. ఈ సంగతి పక్కనబెడితే ప్రజంట్ మెగా ఫ్యామిలీ అభిమానులు మాత్రం రెండో కేటగిరీని విశ్వసిస్తారు.

పెళ్లయిన దాదాపు 10 ఏళ్లకు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ - ఉపాసన దంపతులయ్యారు. గతేడాది జూన్ 20న జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో మెగా అభిమానులు నాటి నుంచి సంబరాలు జరుపుకున్నారు. చిరంజీవి ఇంట్లో మహాలక్ష్మీ పుట్టిందని, ఇక తిరుగులేదని వారు ఆశీర్వదించారు కూడా. ఆ పాపకు అమ్మవారి నామాల్లో ఒకటైన '' క్లింకారా '' అని పేరు పెట్టుకున్నారు చెర్రీ - ఉపాసన.

Is Ram Charan and Upasana Konidela daughter klin kaara konidela becomes lucky charm for mega family

చిన్నారి పుట్టిన నాటి నుంచి మెగా కుటుంబంలో వరుసపెట్టి అన్నీ శుభాలే జరుగుతూ ఉండటంతో పాప లక్కీ లక్ష్మీగా మారిపోయింది. దీనికి పలు ఉదాహరణలను మెగా ఫ్యాన్స్ చెబుతున్నారు. క్లింకారా తల్లి గర్భంలోనే ఉండగా రాంచరణ్ నటించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ప్రపంచ ప్రఖ్యాత 'ఆస్కార్' అవార్డ్ లభించింది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలవగా.. రాంచరణ్ క్రేజ్ శిఖరాగ్రాన్ని చేరింది. నాటి నుంచి ఆయన గ్లోబల్ స్టార్‌గా మారిపోయారు.

Is Ram Charan and Upasana Konidela daughter klin kaara konidela becomes lucky charm for mega family

ఇది జరిగిన కొన్నాళ్లకు చిరంజీవి సోదరుడు నాగబాబు ఇంట్లో పెళ్లి భాజాలు మోగాయి. ఆయన కుమారుడు వరుణ్ తేజ్ తన సహనటి లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం 2023 నవంబర్ 1న ఇటలీలో గ్రాండ్‌గా జరిగింది. చాలా రోజుల తర్వాత మెగా - అల్లు కుటుంబాలు ఒకే వేదికపై చేరి పెళ్లి వేడుకలు ఘనంగా జరుపుకున్నాయి.

అనంతరం క్లింకారా తాతయ్య, మెగాస్టార్ చిరంజీవిని భారత రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ వరించింది. సినీ పరిశ్రమకు చేసిన కృషికి గుర్తింపుగా ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చిరంజీవిని ఈ అవార్డ్‌కు ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇటీవల రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. మనవరాలు పుట్టిన తర్వాతే చిరుకి ఈ ఘనత దక్కిందని మెగా అభిమానులు చెబుతున్నారు.

ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. ఏకంగా 164 అసెంబ్లీ స్థానాలు, 21 లోక్‌సభ సీట్లను గెలుపొంది సగర్వంగా అధికారాన్ని అందుకుంది. కూటమి అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ ఎంతో శ్రమించారు. ఆయన కృషి ఫలితంగానే ఈ అపూర్వ విజయం సొంతమైంది. అలాగే దాదాపు పదేళ్ల నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెడుతూ పవన్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Is Ram Charan and Upasana Konidela daughter klin kaara konidela becomes lucky charm for mega family

పిఠాపురం నుంచి పోటీ చేసిన జనసేనాని భారీ మెజారిటీతో విజయం సాధించి అభిమానుల కోరికను నెరవేర్చారు. ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టి తొలిసారిగా ఇంటికి వచ్చిన పవన్‌కు మెగా కుటుంబ సభ్యులు ఘనస్వాగతం పలికి ప్రస్తుతం సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. క్లింకారా పుట్టిన వేళా విశేషంతోనే మెగా ఫ్యామిలీకి ఈ శుభకార్యాలు, ఘన విజయాలు, అవార్డులు, రివార్డులు క్యూ కడుతున్నాయని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X