రేణూ దేశాయ్‌కు పెళ్లి అయిపోయిందా?.. దాని అర్థం అదేనా!
రేణూ దేశాయ్ పవన్ కళ్యాణ్ భార్యగా ఎంత ఫేమస్ అయిందో.. మాజీ భార్యగా అంతకంటే ఎక్కవగా ఫేమస్ అయింది. పవన్ కళ్యాణ్ రెండో భార్యగా వచ్చిన రేణూ దేశాయ్.. ప్రస్తుతం విడాకులు తీసుకుని వేరుగా ఉంటుంది. దీనికి కారణం పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవాతో ప్రేమాయణం నడపడం, సంతానాన్ని కనడమేమని ఎన్నో మార్లు బహిరంగంగానే చెప్పుకొచ్చింది. ఇక సోషల్ మీడియాలో రేణూ దేశాయ్‌పై నిత్యం ఏదో ఒక వార్త ప్రచారంలో ఉంటుంది.

వేరుగా ఉంటూ..
విడాకుల అనంతరం పుణెలో వేరుగా ఉంటూ వచ్చింది. పిల్లలిద్దర్నీ (అకీరా, ఆద్య) తానే పోషించుకుంటూ వస్తోంది. అయితే ఈ మధ్యలోనే హైద్రాబాద్‌కు షిఫ్ట్ అయిందని తెలుస్తోంది. ఆ సమయంలోనూ పవన్ కళ్యాణ్ ఓ బిల్డింగ్ కొనిచ్చాడని వార్తలు తెగ వైరల్ కాగా.. రేణూ దేశాయ్ వాటిని ఖండించింది.

రెండో పెళ్లి..
అయితే రేణూ దేశాయ్ రెండో పెళ్లికి సిద్దమైన సమయంలో ఎంతటి వివాదం చెలరేగిందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ ఎంతటి విధ్వంసం సృష్టించారో అందరికీ తెలిసిందే. రెండో పెళ్లి చేసుకోవద్దని అందరూ హెచ్చరించారు. అయితే పవన్ కళ్యాణ్‌ను ఎందుకు ప్రశ్నించరు.. తనను మాత్రమే ఎందుకు ప్రశ్నిస్తారని వారిపై ఫైర్ అయింది.

నిశ్శబ్దంగా నిశ్చితార్థం..
అయితే రేణూ దేశాయ్ రెండో పెళ్లికి అంతా సిద్దమైంది. కానీ తనకు కాబోయే శ్రీవారి గురించి మాత్రం ఎక్కడా నోరు విప్పడం లేదు. బయటకు చెబితే పవన్ ఫ్యాన్స్ టార్గెట్ చేస్తారనో ఏమో గానీ ఇప్పటి వరకు ఆ విషయాలేవీ ఎవ్వరికీ తెలీదు. అయితే నిశ్చితార్థం అయిందని మాత్రం క్లారిటీ ఇచ్చింది.
Recommended Video

మెడలో నల్లపూసలు..
తాజాగా రేణూ దేశాయ్ తన షూటింగ్‌లో నిమగ్నమైంది. తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో ఆమె మెడకు నల్లపూసలు కనిపించడంతో అంతా పెళ్లి జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఆమె షూటింగ్‌లో భాగంగా వాటిని ధరించిందా? లేదా నిజంగానే పెళ్లి అయిందా? అన్నది మాత్రం క్లారిటీగా తెలియడం లేదు.


Click it and Unblock the Notifications











