సమంత ఆ సింబల్ చూపించడం వెనుక రహస్యం అదే.!
తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్నేళ్లుగా తన హవా చూపిస్తోంది స్టార్ హీరోయిన్ సమంత. 'ఏమాయ చేశావే'తో టాలీవుడ్‌లోకి ఎంటర్ అయిన ఈ బ్యూటీ... తక్కువ వ్యవధిలోనే ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుంది. కెరీర్ ఆరంభంలోనే కొన్ని విజయాలను అందుకుని టాప్ హీరోయిన్‌గా మారిపోయింది. వివాహం తర్వాత సూపర్ ఫామ్‌లో ఉన్న సామ్... ఎన్నో మైలురాళ్లను అందుకుంటోంది. ఈ నేపథ్యంలో అక్కినేని వారి కోడలు తల్లి కాబోతుందని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆమె చేసిన పోస్ట్ ఆ అనుమానాలకు బలం చేకూర్చుతోంది. ఆ వివరాలు మీకోసం.!

వరుస విజయాలు.. ఫామ్‌లో సమంత
కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతోంది సమంత. తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలోనూ ఆమె సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే ‘అఆ', ‘జనతా గ్యారేజ్', ‘రంగస్థలం', ‘మహానటి', ‘యూటర్న్', ‘ఓ బేబీ', ‘సూపర్ డీలక్స్', ‘మెర్సల్', ‘ఇరుంబుతిరై' వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుని ఇక్కడా.. అక్కడా రికార్డులు క్రియేట్ చేస్తోంది.

ప్రయోగం విఫలం... విజయాలకు బ్రేక్
వరుసగా సూపర్ హిట్లు అందుకుంటోన్న సమంతకు ‘జాను' రూపంలో ఫ్లాప్ వచ్చింది. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘96' మూవీకి రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. కానీ, తెలుగులో ఈ ప్రయోగం అంతగా వర్కౌట్ కాలేదు. శర్వానంద్ హీరోగా నటించిన ఈ మూవీతో ఆమె విజయ పరంపరకు బ్రేక్ పడినట్లు అయింది.

సినిమాలకు దూరం... అందులోకి ఎంట్రీ
తెలుగులో ‘ఓ బేబీ'తో భారీ విజయాన్ని అందుకున్న సమంత... దాని తర్వాత ‘జాను' మాత్రమే చేసింది. అనంతరం ఒక్కటంటే ఒక్క సినిమాకూ సంతకం చేయలేదు. కానీ, ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ మీడియా రంగంలోకి ప్రవేశిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సిరీస్‌ను తెలుగు దర్శకులు రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే తెరకెక్కిస్తున్నారు.

తొలిసారి అవి పట్టుకోబోతున్న సామ్
‘ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌లో సమంత నెగెటివ్ రోల్ చేస్తోందని ఎన్నో రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ సిరీస్ కోసం ఆమె చాలా ప్రయోగాలు చేసిందని అంటున్నారు. ఇందులో సామ్ ఫైట్స్, ఛేజింగ్ సీన్స్ చేయబోతుందట. అంతేకాదు, ఈ మూవీలో అక్కినేని వారి కోడలు టెర్రరిస్ట్‌గా నటిస్తుందని సమాచారం. అందుకోసం వెపన్స్ కూడా డీల్ చేయబోతుందని టాక్.

తల్లి కాబోతున్న అక్కినేని వారి కోడలు
సమంత... అక్కినేని నాగ చైతన్యను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీళ్లకు పెళ్లై చాలా ఏళ్లు గడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామ్ తల్లి కాబోతుందని ఎప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య కాలంలో ఆమె మరో సినిమాకు సంతకం చేయకపోవడంతో ఈ వార్తలు జోరందుకున్నాయి. వీటిని ఆమె ఖండించినా ఏమాత్రం ఆగడం లేదు.
Recommended Video

సామ్ గర్భవతే... ఆ పోస్టుకు అర్థం ఇదే
చాలా రోజులుగా సమంత తల్లి కాబోతుందని ప్రచారం జరుగుతూనే ఉంది. ఆమె ఎంత చెప్పినా ఆ వార్తలకు బ్రేక్ పడకపోగా మరింత ఎక్కువయ్యాయి. ఇక, లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి ఈ వార్తలు ఇంకాస్తా పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో సామ్ గర్భవతి అయిందని ఓ వార్త తాజాగా తెరపైకి వచ్చింది. దీనికి కారణం తాజాగా ఆమె సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టే అని అంటున్నారు.
ఆ సింబల్ చూపించడం వెనుక కారణం
తాజాగా సమంత తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఫొటో షేర్ చేసింది. ఆ ఫొటోలో సామ్ విక్టరీ సింబల్ చూపిస్తోంది. దీనికి క్యాప్షన్ ఇవ్వకపోవడంతో ఎవరికి తోచింది వాళ్లు చెప్పుకుంటున్నారు. ఎక్కువ మంది మాత్రం ఆమె తల్లి కాబోతుందని పరోక్షంగా చెప్పిందని అంటుండగా... ఇంకొందరు మాత్రం త్రివిక్రమ్ - ఎన్టీఆర్ మూవీలో నటించబోతుందని, అందుకే అలా పెట్టిందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











