సుశాంత్ కేసులో కొత్త ట్విస్ట్: ఆ కారణంగానే తీవ్రమైన నిర్ణయమా?
సినీ రంగంలోకి ప్రవేశించిన కొద్ది రోజులకే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను దక్కించుకుని స్టార్ హీరోగా ఎదిగిపోయాడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. తక్కువ సయమంలోనే ఎన్నో విజయాలను అందుకున్న ఈ యంగ్‌స్టర్.. బాలీవుడ్‌లోని బడా హీరోల్లో ఒకడిగా వెలుగొందుతున్నాడు. కెరీర్ సాఫీగా సాగిపోతున్న సమయంలో అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని చనిపోయాడు. ఈ నేపథ్యంలో అతడి ఆత్మహత్యకు ఓ అమ్మాయి ప్రేమకథే కారణమని బాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే....
Recommended Video

టాలెంటెడ్ హీరో ఆత్మహత్య.. ప్రధాన కారణమిదే
బాలీవుడ్‌లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న సమయంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. ‘ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ' సినిమాతో భారీ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న అతడు.. తన నివాసంలో గత ఆదివారం ఉరి వేసుకున్నాడు. అతడి ఆత్మహత్యకు డిప్రెషనే ప్రధాన కారణం అని పోలీసులు ప్రథమికంగా నిర్ధారించిన విషయం తెలిసిందే.

సెలెబ్రిటీల సంతాపం.. లీకవుతున్న రహస్యాలు
సుశాంత్ ఆత్మహత్యతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సినీ ప్రముఖులే కాదు.. యావత్ భారతావణి కూడా అతడి మరణాన్ని జీర్ణించుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలోనే అందరూ అతడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు. అదే సమయంలో కొందరు బాలీవుడ్ సెలెబ్రిటీలు ఇండస్ట్రీలో జరుగుతున్న రాజకీయాలను బయటపెడుతున్నారు.

ప్రేమ వల్లే సుశాంత్ చనిపోయాడంటూ కథనాలు
కెరీర్ ఆరంభంలో పలు సీరియల్స్‌లో నటించాడు సుశాంత్. ఈ క్రమంలోనే ఓ నటితో అతడు ప్రేమాయణం సాగించాడని, ఆ తర్వాత ఆమెతో విడిపోయాడని ప్రచారం జరిగింది. తాజాగా ఆమెకు నిశ్చితార్థం జరిగిందని, ఈ కారణంగానే అతడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని వార్తలు వచ్చాయి. సదరు నటి ఎంగేజ్‌మెంట్ జరిగిన రెండు రోజులకే ఇలా అవడం గమనార్హం.

ప్రియురాలికి దూరంగా సుశాంత్.. కాల్ కూడా...
చనిపోయే ముందు వరకు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. రియా చక్రవర్తితో ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే. అయితే, కొద్ది రోజులుగా అతడు డిప్రెషన్‌లో ఉండడం వల్ల ఆమెతోనూ దూరంగా ఉన్నాడని తెలుస్తోంది. అంతేకాదు, రియాకు ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదని బీ టౌన్‌లో ప్రచారం జరుగుతోంది. దీంతో అసలు ఏమై ఉంటుందా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్
బాలీవుడ్‌లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న సమయంలో సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. దీంతో అతడి మరణానికి అసలు కారణం ఏమై ఉంటుందా అన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఎవరికి తోచింది వాళ్లు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది.

ఆ అమ్మాయి లవ్ స్టోరీలో వేలు పెట్టడం వల్లే
సుశాంత్ ఆత్మహత్య గురించి తాజాగా ఓ న్యూస్ బీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. దిశ సలియాకు ఆమె కాబోయే భర్తకు మధ్య గొడవలు జరుగుతున్న సమయంలో.. సుశాంత్ కలుగజేసుకున్నాడని తెలిసింది. వాళ్లకు సాయం చేద్దామనుకున్న సమయంలో దిశ ఆత్మహత్య చేసుకోవడం సుశాంత్‌ను తీవ్రంగా కలిచి వేసిందట. ఇది కూడా అతడి ఆత్మహత్యకు ఒక కారణమనే టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications