For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దిల్ రాజు పార్టీలో కనిపించని నందమూరి హీరోలు: ఆ హీరోను పిలవకపోవడం వల్లే వీళ్లు కూడా?

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. తారక రామారావు చిత్ర సీమను ఎన్నో ఏళ్ల పాటు ఏళగా.. ఆయన వారసత్వాన్ని నిలబెడుతున్నాడు నందమూరి బాలకృష్ణ. దాదాపు నలభై ఏళ్లుగా ఆయన ఇండస్ట్రీలో తన మార్క్ చూపిస్తున్నారు. ఈయన తర్వాత మూడో తరం హీరోలుగా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతున్నారు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్. పరిశ్రమలో ప్రాముఖ్యం ఉన్న ఈ ముగ్గురు హీరోలు దిల్ రాజు ఏర్పాటు చేసిన పార్టీలో కనిపించలేదు. దీంతో దీనిపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా వీళ్లు రాకపోడానికి కారణం ఇదేనంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదేంటో మీరూ చూడండి!

  ఘనంగా దిల్ రాజు పుట్టినరోజు వేడుక

  ఘనంగా దిల్ రాజు పుట్టినరోజు వేడుక

  దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నారు దిల్ రాజు. డిసెంబర్ 18 శుక్రవారం 50వ పడిలోకి అడుగు పెట్టారు. దీన్ని పురస్కరించుకుని ఒకరోజు ముందే అంటే గురువారం రాత్రి ఆయన పుట్టినరోజు పార్టీని నిర్వహించారు. ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు సినీ పరిశ్రమలోని తారలు మొత్తం తరలి వచ్చారు.

  భార్యను పరిచయం చేసిన ప్రొడ్యూసర్

  భార్యను పరిచయం చేసిన ప్రొడ్యూసర్

  దిల్ రాజు భార్య అనిత కొన్నేళ్ల క్రితం గుండెపోటుతో మరణించగా, 2020 మే 10న హైదరాబాద్‌కు చెందిన తేజస్వినీని ఆయన రెండో వివాహం చేసుకున్నారు. లాక్‌డౌన్ కారణంగా దీన్ని నిరాడంభరంగా ఒక దేవాలయంలో జరిపారు. దీంతో గత రాత్రి జరిగిన పుట్టినరోజు పార్టీలో తన భార్య తేజస్వినీని టాలీవుడ్‌కు పరిచయం చేశారాయన. ఈ జంటకు ప్రముఖులంతా విసెష్ చెప్పారు.

  టాలీవుడ్ ప్రముఖులు మొత్తం హాజరు

  టాలీవుడ్ ప్రముఖులు మొత్తం హాజరు

  ఎంతో ఘనంగా జరిగిన దిల్ రాజు పుట్టినరోజు వేడుకకు టాలీవుడ్‌కు చెందిన హీరోలు, హీరోయిన్లు హాజరయ్యారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, ప్రభాస్, విజయ్ దేవరకొండ, రామ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అఖిల్, నాగ చైతన్య, నితిన్ విశ్వక్ సేన్ సహా పలువురు హీరోలు వచ్చారు. అలాగే, పూజా హెగ్డే, రాశీ ఖన్నా, సమంత నివేదా పేతురాజ్, అనుపమలు హాజరయ్యారు.

  పార్టీలో కనిపించని నందమూరి హీరోలు

  పార్టీలో కనిపించని నందమూరి హీరోలు

  దిల్ రాజు ఏర్పాటు చేసిన పార్టీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిలో టాలీవుడ్‌లోని దాదాపు అందరు హీరోలు, హీరోయిన్లు కనిపిస్తున్నారు. అయితే, ఈ పార్టీకి నందమూరి ఫ్యామిలీకి చెందిన హీరోలెవరూ హాజరు కాకపోవడం చర్చనీయాంశం అవుతోంది. దీనిపై ఎన్నో ఊహాగానాలు తెరపైకి వస్తుండడంతో ఈ ఇష్యూ ట్రెండింగ్ అవుతోంది.

  దీని వెనుక అసలు రహస్యం ఇదేనా?

  దీని వెనుక అసలు రహస్యం ఇదేనా?

  ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోన్న అంశం ప్రకారం.. దిల్ రాజు తన పుట్టినరోజు వేడుకకు నందమూరి బాలకృష్ణను ఆహ్వానించలేదట. ఈ కారణంగానే తమను పిలిచినా కూడా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కూడా దీనికి హాజరు కాలేదని అంటున్నారు. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ.. ఈ న్యూస్ పలు అనుమానాలకు కేంద్ర బిందువుగా మారింది.

  దిల్ రాజు నిర్మాణంలో సినిమాలు కూడా

  దిల్ రాజు నిర్మాణంలో సినిమాలు కూడా

  వాస్తవానికి దిల్ రాజు నందమూరి హీరోలతో చనువుగా ఉంటారు. గతంలో ఎన్టీఆర్‌తో ఆయన పలు చిత్రాలు చేశాడు. అలాగే, బాలయ్య, కల్యాణ్ సినిమాలను పంపిణీ చేశారు. అంతేకాదు, ‘వకీల్ సాబ్' పవన్ కంటే ముందు నటసింహాంతోనే తీద్దామని అనుకున్నారు. ఇక తాజాగా ఎన్టీఆర్‌ - శైలేష్ కొలను కాంబో సెట్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అంతా బాగానే ఉన్నా వాళ్లు పార్టీకి రాకపోవడం హాట్ టాపిక్ అవుతోంది.

  English summary
  Dil Raju got married in the presence of only close family members amid lockdown. He changed his second wife's name to Tejaswini. After Dil Raju's wedding, his fans started pouring love for the producer on social media. Meanwhile, Dil Raju's first selfie with wife Tejaswini went viral on social media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X