జబర్దస్త్ కమెడియన్‌కు డాక్టరేట్.. అరుదైన గౌరవం అందుకే!
జబర్దస్త్ కమెడియన్ గా గాలిపటాల సుధాకర్ రాణిస్తున్నాడు. జబర్దస్త్ షోలో సుధాకర్ హావభావాలు, కామెడీ నటన ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తాయి. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన సుధాకర్ అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. త్వరలో సుధాకర్ గౌరవ డాక్టరేట్ అందుకోబోతున్నాడు.
సుధాకర్ జబర్దస్త్ తో బాగా పాపులర్ అయ్యాడు. కానీ అంతకు ముందు నుంచి సుధాకర్ స్టేజి షోల ద్వారా కళారంగానికి సేవలు చేస్తున్నాడు. ఇప్పటివరకు 5 వేలకు పైగా స్టేజి షోలలో సుధాకర్ పాల్గొన్నాడు. కళారంగానికి అతడు చేస్తున్న సేవలని కోయంబత్తూర్ రాయల్ అకాడమీ ఆర్ట్స్ యూనివర్సిటీ గుర్తించింది. ఈ మేరకు సుధాకర్ కు డాక్టరేట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

సెప్టెంబర్ 8 న దుబాయ్ లో జరిగే ఓ కార్యక్రమంలో సుధాకర్ డాక్టరేట్ అందుకోనున్నాడు. సుధాకర్ పాలమూరుకు చెందిన కళాకారుడు. సుధాకర్ కు డాక్టరేట్ వస్తుండడంతో పాలమూరు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











