హాట్ షో‌తో సెగలు రేపుతోన్న జబర్ధస్త్ వర్ష: అలా అందాలను చూపిస్తూ.. కసిగా కవ్విస్తోన్న బ్యూటీ!

తెలుగు బుల్లితెరపై ఇప్పటి వరకూ ప్రసారం అయిన కామెడీ షోలలోనే నెంబర్ వన్ స్థానంలో వెలుగొందుతోంది జబర్ధస్త్‌. దీనికి కారణం ఎనిమిదేళ్లుగా ఇది టాప్ రేటింగ్‌తో దూసుకుపోతుండడమే. అదే సమయంలో ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేయడం.. వాళ్లంతా సెలెబ్రిటీలుగా ఎదిగిపోవడం కూడా మరో కారణం. ఈ షో ద్వారా పరిచయమై భారీ స్థాయిలో పాపులర్ అయిన వారిలో వర్ష ఒకరు. కొద్ది రోజులుగా జబర్ధస్త్‌లో తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతోందామె. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో హాట్ షోతో సెగలు రేపుతోంది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

సీరియల్ యాక్టర్‌గా పరిచయం.. కెరీర్ అలా

సీరియల్ యాక్టర్‌గా పరిచయం.. కెరీర్ అలా

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది జబర్ధస్త్ బ్యూటీ వర్ష. ఆ తర్వాత నటన మీద ఉన్న ఆసక్తితో ప్రముఖ చానెళ్లలో ప్రసారం అవుతోన్న ‘అభిషేకం', ‘తూర్పు పడమర', ‘ప్రేమ ఎంత మధురం' వంటి సీరియళ్లలో నటించి మెప్పించింది. తద్వారా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. యాక్టింగ్‌తో పాటు అందంలోనూ ఆకట్టుకునే ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం వేచి చూస్తోంది.

అతడి వల్ల జబర్ధస్త్‌లోకి... షోలో భాగమైంది

అతడి వల్ల జబర్ధస్త్‌లోకి... షోలో భాగమైంది


జబర్థస్త్‌లోని టాప్ కమెడియన్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు హైపర్ ఆది. తన ప్రతి స్కిట్‌లో ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చే అతడు.. ఒకానొక సందర్భంలో వర్షతో ఎంట్రీ ఇప్పించాడు. మొదటి స్కిట్‌లోనే ఆమెకు మంచి గుర్తింపు దక్కడంతో వరుసగా అవకాశాలు ఇస్తున్నాడు. అతడితో పాటు రాకింగ్ రాకేష్, కెవ్వు కార్తీక్ టీమ్‌లో సైతం చేస్తూ అలరిస్తోందీ ముద్దుగుమ్మ.

ఆ కమెడియన్‌తో ప్రేమాయణంతో పాపులర్

ఆ కమెడియన్‌తో ప్రేమాయణంతో పాపులర్

ఇక, జబర్ధస్త్‌లో ఇప్పుడిప్పుడే ఎదుగుతూ మంచి పేరును సంపాదించుకుంటోన్న ఇమాన్యూయేల్‌తో వర్ష లవ్ ట్రాక్ నడుపుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. వీళ్లిద్దరి మధ్య తరచూ ఏదో ఒక యాక్ట్‌ను పెడుతుండడంతో రెచ్చిపోయి రొమాన్స్ చేస్తున్నారు. తరచూ ముద్దులు, హగ్గులతో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ కారణంగానే ఈ జంట విపరీతమైన స్థాయిలో పాపులర్ అయిపోతోంది.

అక్కడ యమ యాక్టివ్.. ఎప్పుడూ వార్తల్లోనే

అక్కడ యమ యాక్టివ్.. ఎప్పుడూ వార్తల్లోనే

జబర్ధస్త్ షో వల్ల వచ్చిన పాపులారిటీతో సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవాలని వర్ష గట్టి పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటోంది. దీంతో తరచూ వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్ అవుతోందీ తెలుగు బ్యూటీ.

అలాంటి ఫొటోలు, వీడియోలతో రచ్చ చేస్తోంది

అలాంటి ఫొటోలు, వీడియోలతో రచ్చ చేస్తోంది


తెలుగు అమ్మాయిలు గ్లామర్ షోలు చేయలేరు అన్న నానుడి ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంది. దాన్ని బ్రేక్ చేస్తూ జబర్ధస్త్ వర్ష రెచ్చిపోతోంది. సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలను ఒక్కొక్కటిగా వదులుతూ కుర్రకారు గుండెల్లో గాయాలు చేస్తోంది. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా రోజురోజుకూ భారీగా పెరిగిపోతోంది. ఫలితంగా ఆమె పోస్టులు వైరల్ అవుతున్నాయి.

హాట్ షో‌తో సెగలు రేపుతోన్న జబర్ధస్త్ వర్ష

హాట్ షో‌తో సెగలు రేపుతోన్న జబర్ధస్త్ వర్ష

నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక ఫొటోను వదులుతూనే ఉంటోంది వర్ష. ఇందులో భాగంగానే తాజాగా ఓ హాట్ పిక్‌ను షేర్ చేసింది. ఇందులో బుల్లి గౌను వేసుకుని ఆమె తన తొడలు కనిపించేలా కింద కూర్చుని ఉంది. అంతేకాదు, కసిగా చూస్తూ కుర్రకారును కవ్విస్తోంది. దీంతో ఈ ఫొటోకు విపరీతమైన స్పందన వస్తోంది. తద్వారా ఈ పిక్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X