twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ సినిమా కోసం మందేసిన జగపతిబాబు.. దర్శకుడే పెగ్గులు కలిపి ఇచ్చాడట!

    |

    సినిమా ఇండస్ట్రీలో కొంత మంది నటించే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కథలో మ్యాటర్ ఉన్నా లేకపోయినా ఆర్టిస్ట్ తన పాత్రకు న్యాయం చేయకపోతే సినిమాలో లోపాలు ఎక్కువవుతాయి. అయితే కొన్ని సందర్భాల్లో నటన కోసం కొంతమంది ఎంత కష్టమైనా అనుభవిస్తారు. మరికొందరు మద్యపానం సేవించి మరి కెమెరా ముందుకు వస్తారు. అదే తరహాలో ఒకసారి జగపతిబాబు కూడా నటించాడు.

    ఆల్ రౌండర్..

    ఆల్ రౌండర్..

    హీరోగా ఎన్ని సినిమాలు చేసినా కూడా జగపతిబాబు సపోర్టింగ్ రోల్స్ తో మాత్రం మంచి గుర్తింపే అందుకున్నాడు. హీరోగా చాలా అపజయాలు చూసినప్పటికి ఆయన చేసిన క్యారెక్టర్లు మాత్రం ఆడియెన్స్ మర్చిపోలేరు. డీసెంట్, లవర్ బాయ్, విలన్.. ఇలా కెరీర్ లో అన్ని రకాల పాత్రలు చేసి తన స్థాయిని పెంచుకున్నాడు. ఆయన నెగిటివ్ షెడ్ లో ఉన్న పాత్రలకు ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

    ఆ పాత్ర కోసం..

    ఆ పాత్ర కోసం..

    సాధారణంగా మద్యం అలవాటు ఉన్నప్పటికీ జగపతిబాబు చాలా లిమిట్ లో ఉంటారు. ఒక ఇంటర్వ్యూలో మద్యపానం అలవాటు గురించి చాలా ఓపెన్ గానే చెప్పేశారు. అయితే మొదటి సారి జగపతిబాబు ఒక సినిమా కోసం మద్యం సేవించాల్సి వచ్చిందట. దర్శకుడే ఆ పాత్ర బాగా రావాలని జగపతిబాబుకు స్వయంగా పెగ్గులు కలిపి ఇచ్చాడట.

    అంతఃపురం..

    అంతఃపురం..

    ఆ సినిమా మరేదో కాదు. కృష్ణవంశీ దర్శకత్వంలో 1998లో వచ్చిన అంతఃపురం సినిమా. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే.. ఆ సినిమాలో జగపతిబాబు నటించిన తీరుకు ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. అసలైతే ఆ పాత్రకు మొదటగా రవితేజను అనుకున్నారట. కానీ అందుకు రవితేజ ఒప్పుకోలేదట. ఇకపోతే దర్శకుడు కృష్ణవంశీ జగపతిబాబును ఆ పాత్ర కోసం మందు తాగాలని కోరాడట. ఒక ఇంటర్వ్యూలో కృష్ణవంశీ ఆ విషయంపై క్లారిటీ కూడా ఇచ్చాడు.

    Recommended Video

    Kiara Advani Walked Out From The Mahesh Babu's Movie
    కావాలనే ఇచ్చాను..

    కావాలనే ఇచ్చాను..

    కంట్రోల్ లో ఉండి మద్యం సేవించి పాత్రలో నటిస్తే తప్పేమీ లేదని అన్నారు. అయితే ఆ పాత్రలో ఒక డిఫరెంట్ షెడ్స్ రావాలని నేనే మద్యం పెగ్ లు కలిపి ఇచ్చే వాడిని అంటూ కృష్ణవంశీ వివరణ ఇచ్చాడు. ఆ సినిమాలో జగపతిబాబు చనిపోయే సీన్ ఇప్పటికి ఆల్ టైమ్ బెస్ట్ సీన్స్ లో ఒకటిగా నిలుస్తుంది. ఇక ఆ సినిమాను హిందీలో రీమేక్ చేయగా షారుక్ ఖాన్ జగపతిబాబు చేసిన పాత్రలో కనిపించాడు. అయితే ఆ సినిమా ప్రశంసలు అందుకున్నప్పటికి కమర్షియల్ గా హిట్ కాలేకపోయింది.

    English summary
    The role of some people in the film industry is very different. No matter the story or if the artist does not do justice to his character, there are more errors in the film. But some people may find it difficult to act in certain situations. Others get drunk and the camera comes forward. Jagapatibabu once acted in the same style
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X