జగపతి బాబుకు షాకిచ్చిన దున్నపోతు.. చూడగానే వెంటనే!
సినీ ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలుగా రాణిస్తూ వస్తున్నారు సీనియర్ నటుడు జగపతిబాబు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, స్పెషల్ రోల్ ఇలా ఎలాంటి వేషంలోనైనా ఇట్టే ఇమిడిపోయి నటించే జగపతిబాబుకు ఓ దున్నపోతు షాకించ్చిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. విషయంలోకి పోతే..
ఇటీవల అమెరికాలో జరిగిన అయోవా స్టేట్ ఫెయిర్‌లో ఓ భారీ దున్నపోతును చూశారట జగపతిబాబు. అది దాదాపుగా రెండు టన్నుల బరువుంటుంది. దీన్ని చూసిన జగ్గూ బాయ్.. తాను షాకయ్యానని ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయోవా స్టేట్ ఫెయిర్‌ను సందర్శించడం అబ్బురపరిచే అనుభవమంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు. సదరు దున్నపోతు పిక్ కూడా షేర్ చేశాడు. ఈ స్టేట్ ఫెయిర్ ఆగస్ట్ 13 నుంచి 23 వరకు అమెరికాలో జరిగింది. సుమారు పది లక్షల మంది హాజరైన ఈ ఫెయిర్‌లో అబ్బురపరిచే రకరకాల జంతువులను ప్రదర్శించారు. ఇక్కడ కేవలం ప్రదర్శించమేగాక, వేలం వేసి అమ్ముతుంటారు కూడా.

ప్రస్తుతం జగపతిబాబు టాలీవుడ్ లో స్పెషల్ రోల్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. హీరోగా ఆయనకున్న పాపులారిటీని రెట్టింపు చేసుకుంటూ వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. సినిమాలో స్కోప్ ఉన్న పాత్రల్లో ఈయన్నే ఎంపిక చేసేందుకు ప్రాధాన్యత చూపుతున్నారు దర్శకనిర్మాతలు.


Click it and Unblock the Notifications











