సమంతపై సద్గురు వ్యాఖ్యలు.. రాబోయే తరాలకు ఇచ్చే గిఫ్ట్ అదే అంటూ!
Recommended Video
ఈ మధ్యకాలంలో సామాజిక కార్యక్రమాల్లో సినీ సెలెబ్రిటీలు పెద్దఎత్తున భాగమవుతున్నారు. వారి పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని తమ వంతుగా సామాజిక బాధ్యతలను భుజాలపై వేసుకుంటున్నారు. నిజంగా ఇది అభినందించదగిన విషయం. ఈ నేపథ్యంలోనే కావేరీ కాలింగ్ పేరిట జరుగుతున్న సామాజిక కార్యక్రమంలో భాగమైనందుకు గాను సమంతను ఆశీర్వదించారు సద్గురు జగ్గీ వాసుదేవ్. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ పెట్టారు.

కావేరీ కాలింగ్ పేరిట మొక్కలు నాటే కార్యక్రమం
కావేరీ పిలుస్తోంది పేరిట దేశవ్యాప్తంగా మొక్కలు నాటే ఉద్యమానికి పిలుపునిచ్చారు సద్గురు జగ్గీ వాసుదేవ్. ఈ ఉద్యమంలో టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లు భాగమై తమ వంతు సహకారం అందిస్తున్నారు. కావేరీ కాలింగ్ పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు.

లక్ష మొక్కలు నాటేందుకు సిద్దమైన సమంత
ఈ నేపథ్యంలో కావేరీ కాలింగ్ ఉద్యమంలో పాలుపంచుకున్న హీరోయిన్ అక్కినేని సమంత లక్ష మొక్కలు నాటేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే సామాజిక మాధ్యమాల ద్వారా తన అభిమానులను కూడా కావేరీ పిలుస్తోందిలో భాగం కావాలని పిలుపునిచ్చింది సమంత. దీంతో ఆమె అభిమానులు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు.

సమంతపై సద్గురు కామెంట్
అయితే ఈ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న సమంతపై ఇటీవలే సద్గురు జగ్గీ వాసుదేవ్ ఓ కామెంట్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. ప్రియమైన సమంత, కావేరి పిలుస్తోంది కోసం నువ్విచ్చిన పిలుపుతో ఎంతోమంది యువతీయువకులు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇది సంతోషించదగిన విషయం అని పేర్కొన్నారు.
రాబోయే తరాలకు ఇచ్చే గిఫ్ట్ అదే
కావేరీ కాలింగ్ క్రతువులో సమంత పాలుపంచుకోవడం సంతోషంగా వుందని, లక్ష్యాన్ని మించి ఇంకా రాణించాలని కోరుకుంటున్నట్లు సద్గురు తెలిపారు. ఆ దిశగా సమంత సఫలం కావాలని ఆయన ఆశీర్వాదం ఇచ్చారు. భవిష్యత్ తరాలకు మనం అందించే అత్యుత్తమ బహుమతి ఇదే అని ఈ సందర్బంగా సద్గురు పేర్కొన్నారు.

సమంత జర్నీ.. బిజీ బిజీ
ఇటీవలే 'ఓ బేబీ' రూపంలో భారీ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న సమంత.. ప్రస్తుతం '96' రీమేక్ లో నటిస్తోంది. తమిళ్‌లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో అదే పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. దీంతో పాటు సమంత ఓ వెబ్ సిరీస్ చేస్తోందని సమాచారం.


Click it and Unblock the Notifications











