Don't Miss!
- News వైసీపీ షాకయ్యే పవన్ కళ్యాణ్ నామినేషన్ ర్యాలీ.. ఈసీకి ఫిర్యాదు.. ఎందుకంటే..
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
13 ఏళ్లలోనే నన్ను రేప్ చేశాడు.. మీడియా అధినేత చేతిలో ఆ నాలుగు గోడల మధ్య..
సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు పురుషుల లైంగిక వేధింపులపై మహిళలు మీటూ పేరుతో ఉద్యమం చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. హాలీవుడ్లో హార్వే వెయిన్‌స్టెయిన్, బాలీవుడ్లో నానాపాటేకర్, తమిళంలో పలువురు సినీ ప్రముఖుల పేర్లు బయటపడ్డాయి. అయితే ఇందుకు విరుద్ధంగా ఓ పురుష సినీ ప్రముఖుడు తనను రేప్ చేశారంటూ సోషల్ మీడియాలో వెల్లడించడంతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. తాజాగా ఆరోపణలు చేసిన ప్రముఖుడి ఎవరంటే..
పాకిస్థాన్‌కు చెందిన సినీ ప్రముఖుడు
పాకిస్థాన్‌కు చెందిన జమ్షెడ్ మహమూద్ గొప్ప సినీ ప్రముఖుడు. అవార్డులు ఎన్నో గెలుచుకొన్నారు. కాగా ఆదివారం సాయంత్రం ట్విట్టర్లో దారుణంగా ట్వీట్ చేయడంతో ప్రపంచం ఆయన ఆరోపణపై దృష్టి సారించింది. తనను ఓ మీడియా కంపెనీ అధినేత 13 ఏళ్ల వయసులో రేప్ చేశారు అని జమ్షెడ్ మహమూద్ ట్వీట్ చేయడం గమనార్హం.
అందుకే మీటూ ఉద్యమానికి మద్దతు
జమ్షెడ్ మహమూద్ గత కొద్దికాలంగా మీటూ ఉద్యమానికి బలంగా మద్దతు తెలుపుతున్నారు. ఆసియాలో మహిళలపై లైంగిక దాడులపై తీవ్రంగా ఖండిస్తున్నారు. నేను ఎందుకు మీటూ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నానంటే.... నాలుగు గోడల మధ్య ఆ బాధ నాకు తెలుసు. ప్రపంచ మీడియాలో శక్తిమంతమైన దిగ్గజం చేతిలో దారుణంగా రేప్‌కు గురయ్యాను అని జమ్షెడ్ తెలిపారు.
నేను బలవంతుడినైనా
నాపై దారుణంగా లైంగిక దాడి జరిగినప్పుడు శారీరకంగా నేను బలవంతుడినే. అతడి కంటే పొడవుగా ఉన్నప్పటికీ నేను ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. అయినా అలాంటి మోసగాడితో రిలేషన్ కొనసాగించాల్సి వచ్చింది. ఆ బాధను నాలో నేనే దిగమింగుకొన్నాను అని జెమ్‌షెడ్ ఆవేదన వ్యక్తం చేసింది.
నాపై రేప్ అంటే నమ్మలేదు
నాపై జరిగిన రేప్ గురించి నా స్నేహితులకు చెప్పుకొన్నాను. కానీ వాళ్లు కూడా నా మాటలను నమ్మలేదు. నాకు జరిగిన అన్యాయాన్ని వారు లైట్‌గా తీసుకొన్నారు. ఆ మీడియా టైకూన్ (అధినేత) పేరు చెప్పినా నన్ను ఓ జోకర్‌గా చూశారు. నేను అనుభవించిన మానసిక క్షోభను తట్టుకోలేక థెరపిస్టు వద్దకు వెళ్లాను. మందులు వాడాను అని జెమ్‌షెడ్ అన్నారు. ఇలా వరుస ట్వీట్లతో జెమ్‌షెడ్ తన బాధను చెప్పుకొన్నారు.