సీరియల్ యాక్టర్ల రెమ్యునరేషన్‌ నోరు విప్పిన అమర్‌దీప్.. రోజుకు పారితోషికం ఎంతంటే?

వినోద రంగంలో సెలబ్రిటీలు ఎంత సంపాదిస్తున్నారనే విషయం తెలుసుకోవడానికి సగటు ప్రేక్షకులకు ఎక్కడలేని ఉత్సాహం ఉంటుంది. ఎంత సంపాదిస్తున్నారు.. ఎక్కడి నుంచి ఎంత వస్తోంది.. ఎవరెవరు ఎంతెంత ఇస్తున్నారు.. అనే విషయాలను సాధారణ జనాలే బయటకు చెప్పరు. ఇక సెలెబ్రిటీలు అయితే అస్సలు నోరు విప్పరు. ఎంతో కొంత ఇస్తున్నారు.. కావాల్సినంత ఇస్తున్నారు.. సరిపడ ఇస్తున్నారు.. బతికేందుకు సరిపడ ఇస్తున్నారు అంటూ ఇలాంటి సమాధానాలు చెబుతూ తప్పించుకుంటూ ఉంటారు. రెమ్యూనరేషన్ విషయంలో ఎంతో సీక్రసీ మెయింటైన్ చేస్తుంటారు ఇండస్ట్రీ జనాలు.

ఎంతో తేడా..

ఎంతో తేడా..

రెమ్యూనరేషన్ విషయంలో ఎన్నో తేడాలుంటాయి. సీరియల్స్‌కి ఒకలా, సినిమాలకు ఒకలా, షోలకు ఒకలా, స్పెషల్ ఈవెంట్లకు ఒకలా.. సాంగ్స్‌కు ఒకలా, ప్రత్యేక పాత్రలకు ఒకలా ఉంటాయి. ఇలా రెమ్యూనరేషన్ విషయాలను ఎవ్వరూ అంత ఈజీగా బయటకు చెప్పరు. కానీ అమర్ దీప్ మాత్రం ఈ విషయాలన్నీ పూస గుచ్చినట్టు చెప్పేశాడు.

బుల్లితెరపై ఫేమస్..

బుల్లితెరపై ఫేమస్..

అమర్ దీప్ ప్రస్తుతం బుల్లితెరపై స్టార్‌గా మారిపోయాడు. ఇంతకు ముందు ఎన్ని సీరియల్స్ చేసినా కూడా రాని గుర్తింపు జానకి కలగనలేదు అనే సీరియల్‌తో వచ్చింది. రామచంద్ర, రామగా అమర్ దీప్ అద్బుతంగా నటించేస్తున్నాడు. ఇక నిజంగా సుగుణాల రాముడే అన్నట్టుగా అమర్ దీప్ కనిపిస్తాడు. జానకి కలగనలేదు సీరియల్ ద్వారా విశేషమైన పాపులారిటీని సంపాదించుకొన్నాడు.

నటితో ప్రేమ, పెళ్లి..

నటితో ప్రేమ, పెళ్లి..

కోయిలమ్మ, కేరాఫ్ అనసూయ సీరియళ్లతో తెలుగులో ఫేమస్ అయిన కన్నడ నటి తేజస్విన గౌడ. ఆమెతో అమర్ దీప్ ప్రేమలో పడిపోయాడు. ఈ టాప్ యాంకర్ పెళ్లి కూడా చేసుకోబోతోన్నాడు. ఈ క్రమంలోనే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఈ విషయాన్నీ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా తమ తమ అభిమానులతో పంచుకున్నారు.

జంటగా లైవ్..

జంటగా లైవ్..

ఎంగేజ్మెంట్ తరువాత తేజస్విని, అమర్ దీప్ ఇన్ స్టాగ్రాం లైవ్‌లోకి వచ్చారు. తమ మీద ఎవరో కావాలని నెగెటివ్ ట్రోలింగ్ చేస్తున్నారని, తాము మంచిగా బతుకుతుంటే చూడలేకపోతోన్నారంటూ అమర్ దీప్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఊగిపోయాడు.అయితే అమర్ దీప్ అన్నది ఎవరినో మాత్రం తెలియడం లేదు.

రెమ్యూనరేషన్ గురించి

రెమ్యూనరేషన్ గురించి

అమర్ దీప్ ఇటీవల ఓ ఇంటర్వ్యూల్లో తాను తీసుకున్న రెమ్యూనరేషన్ల గురించి చెప్పుకొచ్చాడు. మొదట్లో తనకు సీరియల్ కోసం పని చేసినప్పుడు నెలకు రూ. 25 వేలు ఇచ్చారట. అయితే మొదటి చెక్ మాత్రం శైలజా రెడ్డి అల్లుడు అనే సినిమా కోసం అందుకున్నాడట. రెండ్రోజులు షూటింగ్ చేశాడట. ఒక్కో రోజుకు రూ. 7500 ఇచ్చారట. కానీ ఆ సీన్లు ఎడిటింగ్‌లో పోయాయట. సిరి సిరి మువ్వ సీరియల్‌కు నెలకు రూ. 80 వేలు తీసుకున్నాడట. ఇక ఇప్పుడు చేస్తోన్న అభిలాష సినిమాకు మాత్రం చాలా పెద్ద మొత్తంలో తీసుకుంటున్నాడట.

బిగ్‌బాస్ తెలుగు 6లోకి అమర్ దీప్

బిగ్‌బాస్ తెలుగు 6లోకి అమర్ దీప్


ఇదిలా ఉండగా, అమర్ దీప్ చౌదరీ బిగ్‌బాస్ తెలుగు 6 షోలోకి వెళ్తున్నట్టు మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతున్నది. సెప్టెంబర్ నెలలో ప్రారంభమయ్యే ఈ షో కోసం ఏర్పాట్లు చేసుకొంటున్నట్టు సమాచారం. అయితే టెలివిజన్ సీరియల్ షూటింగులతో బిజీగా ఉండే అమర్ దీప్ బిగ్‌బాస్‌లోకి వెళ్తాడా లేదా అనేది వేచి చూడాల్సిందే. గత సీజన్‌లో అందర్నీ ఆకట్టుకొన్న మానస్‌కు అమర్ దీప్ బెస్ట్ ఫ్రెండ్ అనే విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X