Top 10 Politician పవన్ కళ్యాణ్ టాప్ 10 పొలిటిషియన్.. ప్రధానిని వెనక్కినెట్టిన పవర్‌స్టార్.. బిగ్గర్ దెన్ మోడీ
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ తన ప్రతిభతో అగ్ర కథానాయకుడిగా ఎదిగారు. నటన, డైలాగ్స్, ఫైట్స్.. ఇలా అన్నింట్లోనూ తన మార్క్ చూపించారు. అన్నింటికి మించి తన వ్యక్తిత్వంతోనే ఆయన కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. సహజంగా సక్సెస్ వెంట సినీ పరిశ్రమ నడుస్తుందంటారు... అంటే విజయం సాధించిన వారి వెంట పరుగులు తీయడం. కానీ పవన్ కళ్యాణ్ తాను ఇందుకు అతీతమని నిరూపించుకున్నారు.
ఫ్లాప్స్ వస్తే ఇండస్ట్రీలో ఫేడవుల్ కావడమే.. కానీ పవన్ మాత్రం హిట్టు, ఫ్లాపులకు అతీమైన హీరోగా నిలిచారు. ఫ్లాప్స్ వెక్కిరించినా ఆయన మార్కెట్ కొంచెం కూడా తగ్గలేదు. నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. ట్రెండ్ సెట్ చేస్తా అన్న డైలాగ్ పవన్ కళ్యాణ్‌కు ఖచ్చితంగా సరిపోతుంది. అయితే దేశవ్యాప్తంగా అత్యంత పాపులారిటీ ఉన్న లిస్టులో పవన్ కల్యాణ్ చేరారు. ఆ వివరాల్లోకి వెళితే..

సినీనటుడిగా అగ్రస్థానంలో ఉన్నా.. ఒక్కరోజుకు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నా.. ఆయనతో ఏదో వెలితి. తనను ఇంతటివాడిని చేసిన సమాజానికి ఎంతోకొంత తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో పవర్‌స్టార్ రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన సమయంలో జనసేన పార్టీని స్థాపించి.. నాటి నుంచి నేటి వరకు ప్రజల కోసం పోరాటాలు చేస్తున్నారు.
పదేళ్లుగా అధికారంలో లేకపోయినా , ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి జనసేనను నడుపుతున్నారు. తన సొంత డబ్బును ప్రజల కోసం ఖర్చు పెడుతూ దేశంలోని మిగిలిన రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచారు పవన్ . అయితే ఈసారి మాత్రం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని జనసేనాని గట్టిగా ఫిక్స్ అయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ టీడీపీ, బీజేపీలను కలుపుకుని కూటమిగా ఏర్పడ్డారు. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి కూటమి అభ్యర్ధుల తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. తాను పిఠాపురం నుంచి బరిలోకి దిగారు.
పవన్ ప్రసంగాలు, ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో మే తొలి వారానికి గాను (మే 1 నుంచి మే 7 వరకు ) పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ఖాతా భారత్‌లో మోస్ట్ పాపులర్ పొలిటికల్ అకౌంట్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలను సైతం పవన్ కళ్యాణ్ వెనక్కు నెట్టారు. ఈ మేరకు జాతీయ వార్తాసంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.
ఈ జాబితాలో మోడీ రెండో స్థానంలో నిలవగా.. రాహుల్ మూడవ స్థానంలో నిలిచారు. తర్వాత వరుసగా ఏపీ సీఎం వైఎస్ జగన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇళయదళపతి విజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీజేపీ , కాంగ్రెస్‌ల అధికారిక ట్విట్టర్ హ్యాండిల్స్ నిలిచాయి. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. పవన్ కళ్యాణ్ బిగ్గర్ దెన్ మోడీ , సోదరులైన పవన్ - మోడీ పక్కపక్కనే నిలిచారంటూ కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications










