అభిమాని కూతురుపై పవన్ కల్యాణ్ కొండంత ప్రేమ.. పవర్ స్టార్ చేతుల మీదుగా...

Recommended Video

Janasena Chief Pawan Kalyan Names A New Born Baby Of His Fan || Filmibeat Telugu

అభిమానులకు దగ్గరవడంలో మెగా హీరోలు ఎప్పుడూ ముందే ఉంటారు. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ సోదరులు తమ తమ అభిమాన వర్గాలకు బాగా ప్రియారిటీ ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో అభిమానులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తూ అవసరమైతే ఆర్ధికంగా కూడా తోడవుతుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ విషయమై అచ్చం చిరంజీవి రియాక్ట్ అయినట్లుగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ కావడం చర్చనీయాంశం అయింది.

పవన్ కల్యాణ్ అంటే ప్రాణం

పవన్ కల్యాణ్ అంటే ప్రాణం

గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ఎర్రం అంకమ్మరావు దంపతులకు జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం. అయితే ఆ దంపతులకు పాప జన్మించడంతో పవన్ చేత నామకరణం చేయించాలని అనుకొన్నారు. ఆ క్రమంలో భార్య ఇందిర, పాపతో పాటు జనసేనానిని కలిశాడు. అతని అభ్యర్థన విన్న పవన్.. ఆ పాపను ఆప్యాయంగా చేతిలోకి తీసుకొన్నాడు. ప్రేమగా, ఆప్యాయతంగా ముద్దు చేశాడు.

 పవర్ స్టార్ చేతుల మీదుగా నామకరణం

పవర్ స్టార్ చేతుల మీదుగా నామకరణం

తల్లిదండ్రుల కోరిక మేరకు చిన్నారికి వేద వినీషా అని పేరు పెట్టారు. దీంతో సదరు అభిమాని ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా వైరల్ అయ్యాయి. తమ నాయకుడు, హీరో చూపించిన ప్రేమకు మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవికి ఉన్న పెద్ద మనసే పవన్‌కీ ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

గతంలో చిరంజీవి కూడా

గతంలో చిరంజీవి కూడా

గతంలో చిరంజీవి.. తన అభిమాని కుమారుడికి నామకరణం చేసి అతని చిరకాల కోరిక తీర్చిన సంగతి తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం మందపల్లికి చెందిన నక్కా వెంకటేశ్వర రావు చిరంజీవి వీరాభిమాని. అయితే ఆయనకు బాబు జన్మించడంతో తన కొడుకుకు స్వయంగా చిరంజీవే పేరు పెట్టాలని ఆశ పడ్డాడు. ఆ విషయం తెలుసుకొని చిరు స్వయంగా సదరు అభిమాని ఇంటికి వెళ్లి నామకరణం చేసి వచ్చారు. తాజాగా పవన్ కళ్యాణ్ విషయంలోనూ సరిగ్గా అలాంటి సంఘటనే జరిగింది.

 ఏపీ రాజకీయాలపై సీరియస్‌గా

ఏపీ రాజకీయాలపై సీరియస్‌గా

ఇక పవన్ రాజకీయ వ్యవహారాల విషయానికి వస్తే, గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత జనసేన ఓటమిపై ఆంధ్రప్రదేశ్‌లో సమీక్ష నిర్వహిస్తున్నారు. భవిష్యత్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టిపెట్టారు. అంతేకాకుండా కార్యకర్తల్లో మనో ధైర్యాన్ని నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా, పవన్ మళ్లీ సినిమాల్లోకి వస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై పవన్ గుంభనంగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X