twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రౌడీ బేబీని మించేలా.. ధనుష్‌తో జానీ మాస్టర్ మరోసారి మ్యాజిక్.. పిక్ వైరల్!!

    |

    ధనుష్ సాయి పల్లవి కాంబోలో వచ్చిన రౌడీ బేబీ సాంగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బిలియన్ (వంద కోట్లు) వ్యస్ సాధించిన మొదటి దక్షిణాది పాటకు రికార్డులు క్రియేట్ చేసింది. నేటికి కూడా రౌడీ బేబీ కొత్త కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూనే ఉంటుంది. ఆ సాంగ్‌లో ధనుష్ సాయి పల్లవిల కెమిస్ట్రీ ఎంత బాగా కుదిరిందో.. ప్రభుదేవా, జానీ మాస్టర్‌ల కూల్ స్టెప్స్ కూడా అంతే కుదిరాయి. మొత్తంగా రౌడీ బేబీ అనేది ఓ బ్రాండ్‌గా మారింది.

    Recommended Video

    Choreographer Jani Master Sentenced To 6 Months In Jail | Filmibeat Telugu
     సౌత్ సెన్సేషన్..

    సౌత్ సెన్సేషన్..

    రౌడీ బేబీ పాటతో మారి 2 సినిమా రేంజ్ మారిపోయింది. మారి 2 యావరేజ్ అయినా కూడా రౌడీ బేబీ పాటతో మంచి కలెక్షన్లు వచ్చాయి. ఈ ఒక్క పాటతో మారి 2 చిత్రం సౌత్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌గా మారిపోయింది. ధనుష్ సాయి పల్లవిల కెమిస్ట్రీ, రౌడీ బేబీ పాట కోసమే సినిమాను చూశారంతా.

    యూట్యూబ్ రికార్డ్స్..

    యూట్యూబ్ రికార్డ్స్..

    రౌడీ బేబీ పాట యూట్యూబ్‌లో సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. మామూలుగా అయితే 500 మిలియన్లు, వంద మిలియన్ల వ్యూస్ సాధించడమనేది కేవలం హిందీ పాటల వల్లే సాధ్యమయ్యేది. కానీ రౌడీ బేబీ మాత్రం ఆ ఫీట్‌లను ఈజీగా అందుకుంది. ఏకంగా బిలియన్ల వ్యూస్‌ను కొల్లగొట్టేసింది.

    జానీ మాస్టర్ హవా..

    జానీ మాస్టర్ హవా..

    ఇక రౌడీ బేబీ కంపోజిషన్‌లో జానీ మాస్టర్ పాత్ర కూడా ఉంది. పైగా బుట్టబొమ్మతో ఇంటర్నేషనల్ వైడ్‌గా క్రేజ్ సంపాదించుకున్నాడు. అలాంటి జానీ మాస్టర్‌కు ఇప్పుడు కోలీవుడ్‌లో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఈ మధ్యే శివ కార్తికేయన్ సినిమాకు కొరియోగ్రఫీ చేశాడు.

    ధనుష్‌తో మళ్లీ మ్యాజిక్..

    ధనుష్‌తో మళ్లీ మ్యాజిక్..

    జానీ మాస్టర్ ప్రస్తుతం ధనుష్‌కు కొత్త రకం స్టెప్పులను నేర్పిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఇద్దరూ రిహార్సల్స్ చేస్తున్నారు.వీటికి సంబంధించిన జానీ మాస్టర్ చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. మళ్లీ ధనుష్ నుంచి అదిరిపోయే సాంగ్ రాబోతోంది.. D43 సినిమా కోసం మళ్లీ పని చేస్తున్నా అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి మళ్లీ ఇది రౌడీ బేబీని మించేలా ఉండబోతోన్నట్టు తెలుస్తోంది.

    వరుసగా చిత్రాలు..

    వరుసగా చిత్రాలు..

    ధనుష్ ప్రస్తుతం క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్నాడు. బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో పని చేస్తున్నాడు. ధనుష్ తాజాగా తన అన్న సెల్వ రాఘవన్ దర్శకత్వంలో యుగానికొక్కడు సీక్వెల్‌ చేస్తోన్నట్టు ప్రకటించాడు. కార్తీక్ సుబ్బరాజ్‌తో జగమే తంత్రం చిత్రాన్ని చేస్తోన్నాడు. D43 సినిమాకు కార్తీక్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

    English summary
    Jani Master Doing Choreography For Dhanush d43 Project,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X