twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనుపమ పరమేశ్వరన్‌కు ప్రియుడు షాక్.. మిస్ ఇండియా భామతో పెళ్లికి సిద్ధమైన టాప్ క్రికెటర్

    |

    దక్షిణాది హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌కు సంబంధించిన డేటింగ్ వ్యవహారం తరచుగా మీడియాలో హైలెట్ అవుతున్నది. ప్రముఖ యువ క్రికెటర్ జస్ప్రీత్ బూమ్రాతో ఆఫర్ కొనసాగిస్తుందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలకు భిన్నంగా అనుపమకు బూమ్రా షాకిచ్చినట్టు కనిపిస్తున్నది. ఆ వివరాల్లోకి వెళితే..

    ఓ వైవు ట్రెడిషినల్ మరోవైపు గ్లామర్.. ఉప్పెన బ్యూటీ డిఫరెంట్ లుక్స్

    అనుపమతో బూమ్రా సన్నిహిత సంబంధాలు

    అనుపమతో బూమ్రా సన్నిహిత సంబంధాలు

    క్రికెటర్ జస్ప్రీత్ బూమ్రా, అనుపమ పరమేశ్వరన్ మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నట్టు ఇటీవల వార్తలు రావడం తెలిసిందే. అయితే అనుపమ కూడా ఎలాంటి ఖండన ఇవ్వలేదు. ఓ ఇంటర్వ్యూలో బూమ్రాతో ఉన్న రిలేషన్ కేవలం ఫ్రెండ్‌షిప్ మాత్రమే ఉందని స్పష్టం చేశారు. అయితే వారి మధ్య ఉన్న రిలేషన్ ప్రత్యేకమైనదని విషయాన్ని మిడియా రిపోర్టుల స్పష్టం చేశాయి.

    అనుపమకు బూమ్రా స్నేహితుడు మాత్రమే

    అనుపమకు బూమ్రా స్నేహితుడు మాత్రమే

    బూమ్రాతో ఉన్న రిలేషన్‌షిప్ గురించి అనుపమ పరమేశ్వరన్ తల్లి క్లారిటీ ఇచ్చారు. వారి మధ్య ఉన్న సంబంధం స్నేహం మాత్రమే. అంతకు మించి వారి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. వారిద్దరూ బెంగళూరులో ఓ హోటల్‌లో కలవడం యాదృచ్చికం. అంతేగానీ అందరూ ఊహించినట్టు అఫైర్ లేదు అని ఆమె వెల్లడించారు.

    బీసీసీఐని కోరిన బూమ్రా

    బీసీసీఐని కోరిన బూమ్రా

    అయితే ఇటీవల భారత్, ఇంగ్లాండ్ సిరీస్ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడంతో బూమ్రా పెళ్లి విషయం మీడియాలో మరోసారి హైలెట్ అయింది. పెళ్లి కోసం సెలవు కావాలని బీసీసీఐని రిక్వెస్ట్ చేయడంతో బూమ్రా వివాహం గురించి అసలు విషయం బయటకు వచ్చింది. దాంతో అనుపమతో పెళ్లి అని ప్రచారం జరిగింది.

    మిస్ ఇండియా ఫైనలిస్టుతో పెళ్లి

    మిస్ ఇండియా ఫైనలిస్టుతో పెళ్లి

    అయితే బూమ్రా వివాహం చేసుకొనే అమ్మాయి 2014లో మిస్ ఇండియా ఫైనలిస్టు సంజనా గణేషన్ అనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. సంజనా స్టార్ స్పోర్ట్స్‌లో ఐపీఎల్ టోర్నీల సందర్భంగా ప్రజెంటర్‌గా పనిచేశారు.

    మార్చి 14, 15 తేదీలలో వివాహం

    మార్చి 14, 15 తేదీలలో వివాహం

    ఇక జస్ప్రీత్ బూమ్రా వివాహం సంజనా గణేషన్‌తో జరిపించడానికి కుటుంబ సభ్యులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 14 లేదా 15 తేదీలలో బూమ్రా వివాహం గోవాలో జరిగే అవకాశం ఉంది. ఈ పెళ్లికి కేవలం 20 మంది స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరువుతారని తెలుస్తున్నది.

    English summary
    Cricketer Jasprit Bumrah marriage is on cards, He is going to marry Miss india finalist Sanjana Ganesan not Anupama Parameshwaran. As per reports, Jasprit Bumrah will be happend on March 14-15 in an intimate ceremony in Goa
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X