నవ్వులు పూయిస్తోన్న ‘జాతి రత్నాలు’.. క్రేజీ వీడియో
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో జాతి రత్నాలు సినిమా దుమ్ములేపుతోంది. కలెక్షన్ల పరంగానూ జాతి రత్నాలు అదరగొడుతోంది. గత వారం రిలీజ్ అయిన అన్ని సినిమాల్లోకెల్లా జాతి రత్నాలు కలెక్షన్ల పరంగా ముందు వరుసలో ఉంది. రోజురోజుకూ కలెక్షన్లు పెరుగుతూనే ఉన్నాయి. పబ్లిక్ మౌత్ టాక్ మూలాన జాతి రత్నాలు మరింతగా దూసుకుపోతోంది. ఇక సోషల్ మీడియాలో యూత్ మాత్రం జాతిరత్నాలు సినిమాకే ఓట్లు వేస్తున్నారు.
జాతిరత్నాలు క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో చెప్పేందుకు ఉదాహరణగా వైజయంతీ మూవీస్ ఓ వీడియోను షేర్ చేసింది. జాతిరత్నాలు సినిమాలో ప్రీ క్లైమాక్స్ సీన్ అయిన చాణక్య పాత్ర చెప్పే నూడుల్స్, హాంకాంగ్ స్కాం ఎంతగా నవ్వులు పూయించిందో అందరికీ తెలిసిందే. అయితే అదే థీమ్‌ను తీసుకుని ఇతర సినిమాల్లోని సీన్స్‌తో ఎవరో ఫన్నీగా ఎడిట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఛత్రపతి, అపరిచితుడు, బొమ్మరిల్లు ఇలా అనేక సినిమాల్లోని సీన్స్‌తో మురళీ శర్మను ఎడిట్ చేసి పెట్టారు. నూడుల్స్, హాంకాంగ్ సీన్స్ అంటూ జాతి రత్నాలులో నవ్వులు పూయించిన డైలాగ్‌లతో ఎడిట్ చేసిన ఈ వీడియోను తాజాగా వైజయంతీ మూవీ తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనుదీప్‌కు ప్రస్తుతం మంచి డిమాండ్ ఏర్పడింది.


Click it and Unblock the Notifications











