జయప్రకాష్ రెడ్డి మృతి.. కరోనాతో తనయుడు అంత్యక్రియలకు దూరం!

టాలీవుడ్ విలక్షణ నటులు జయప్రకాష్ రెడ్డి గుండెపోటుతో నేటి (సెప్టెంబర్ 8) ఉదయం మరణించిన సంగతి తెలిసిందే. విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వెండితెరపై ఎన్నో భిన్న పాత్రలు ధరించి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. ఆయన అకాల మృతిపై తెలుగు సినీ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. టాలీవుడ్ సెలెబ్రిటీలందరూ జయ ప్రకాష్ మృతి పట్ల ఆందోళన చెందుతున్నారు.

గొప్ప నటులు, నాటక రంగాన్ని అమితంగా ప్రేమించేవారు అంటూ జయప్రకాష్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. రవితేజ, సాయి ధరమ్ తేజ్, రామ్, ఎన్టీఆర్, అనిల్ రావిపూడి, గోపిచంద్ మలినేని, వెన్నెల కిషోర్, బండ్ల గణేష్, మహేష్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, ప్రకాష్ రా, వెంకటేష్, కోన వెంకట్, గోపీ మోహన్, వివి వినాయక్, నాగబాబు, పవన్ కళ్యాణ్, దర్శక నిర్మాతలు, నిర్మాణ సంస్థలు, హీరోయిన్లు ఇలా ప్రతీ ఒక్కరూ జయప్రకాష్ రెడ్డిని తలుచుకున్నారు.

Jaya Prakash Reddy Son Not Participating In Last Rituals Due To Corona

అయితే జయప్రకాష్ రెడ్డి అంత్యక్రియలకు మాత్రం ఆయన కుమారుడు హాజరు కాలేకపోతున్నాడట. వారి కుటుంబానికి కరోనా సోకడంలో అందరూ చికిత్స తీసుకుంటున్నారట. జయ ప్రకాష్ రెడ్డి కూడా పరీక్షలు చేయించుకుంటే ఆయనకు కరోనా నెగెటివ్ వచ్చిందట. కానీ కొడుకు, కోడలికి మాత్రం పాజిటివ్ వచ్చిందట. వారు ఇప్పుడు హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటోన్న నేపథ్యంలో దగ్గరి బంధువులు, మిత్రుల సమక్షంలో అంత్య క్రియలు నిర్వహించబోతోన్నారని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X