ఆ ముద్దు తర్వాత భర్త కావాలని కోరిక కలిగింది: లిప్‌లాక్‌పై ఝాన్సీ బోల్డ్ కామెంట్స్

By Manoj

నటిగాగా కెరీర్‌ను ఆరంభించి యాంకర్‌గా భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న వారిలో ఝాన్సీ ఒకరు. చాలా కాలం వెండి బుల్లితెరలపై తన ప్రభావాన్ని చూపించిందామె. ఈ క్రమంలోనే ఎన్నో సినిమాల్లో నటించింది. వరుస షోలు, సినిమాలతో బిజీ బిజీగా గడుపుతూ స్టార్‌డమ్‌ను సంపాదించుకుంది. కెరీర్ పరంగా సక్సెస్ అయిన ఆమె.. వ్యక్తిగత జీవితంలో మాత్రం చిక్కులే ఎదురయ్యాయి. ఇదిలాఉండగా... తాజాగా జరిగిన ఓ షోలో ఝాన్సీ 'మన్మథుడు 2' మూవీలో తన లిప్‌లాక్ సీన్‌ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ వివరాలు మీకోసం.!

‘ఎగిరే పావురమా’తో సినీ కెరీర్ ప్రాంరంభం

‘ఎగిరే పావురమా’తో సినీ కెరీర్ ప్రాంరంభం

1994లో వచ్చిన ‘ఎగిరే పావురమా' సినిమాతో యాక్టర్‌గా ఎంట్రీ ఇచ్చింది ఝాన్సీ. ఈ సినిమాలో ఆమెకు చక్కని పాత్ర పడడంతో పలు ఆఫర్లు అందుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. ఈ క్రమంలోనే సపోర్టింగ్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా, నెగెటివ్ షేడ్స్ ఉన్న మహిళగా ఇలా ఎన్నో రకాల క్యారెక్టర్లు చేసి మెప్పించింది. ఫలితంగా బిజీ ఆర్టిస్టు అయిపోయింది.

చెరిగిపోని పాత్రలు... బోలెడు అవార్డులు

చెరిగిపోని పాత్రలు... బోలెడు అవార్డులు

వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన ఝాన్సీకి... కొన్ని పాత్రలు మంచి గుర్తింపును తెచ్చి పెట్టాయి. వాటిలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘జయం మనదేరా', కుటుంబరావు తీసిన ‘తోడు' సినిమాలకు ఉత్తమ సహాయ నటిగా అవార్డు అందుకుంది. అలాగే, నందమూరి బాలకృష్ణ ‘సింహా', వెంకటేష్ ‘తులసి' సినిమాలకు ఉత్తమ హాస్య నటిగా నంది అవార్డులను గెలుచుకుంది.

టాక్ ఆఫ్ ది టౌన్‌ కెరీర్‌కు బూస్ట్ ఇచ్చింది

టాక్ ఆఫ్ ది టౌన్‌ కెరీర్‌కు బూస్ట్ ఇచ్చింది

జెమినీ టీవీలో ప్రసారం అయిన ‘టాక్ ఆఫ్ ది టౌన్' అనే షోతో ఝాన్సీ యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ వారం విడుదలైన సినిమాలకు సంబంధించిన బిట్లు వేస్తూ సెటైరికల్ జోక్స్‌తో దీన్ని నడిపించారు. లాంగ్ రన్ అయిన ఈ షోతో ఝాన్సీ కెరీర్ మారిపోయింది. దీని తర్వాత ఆమె యాంకర్‌గా ఎన్నో ఎన్నెన్నో షోలు చేసింది. అలాగే, సినిమా ఫంక్షన్లనూ హోస్ట్ చేసింది.

ప్రేమ వివాహం.. మనస్ఫర్థలతో విడాకులు

ప్రేమ వివాహం.. మనస్ఫర్థలతో విడాకులు

కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలో ఝాన్సీ... ప్రముఖ నటుడు జోగీ నాయుడును ప్రేమ వివాహం చేసుకుంది. వీళ్లకు ఒక పాప కూడా జన్మించింది. ఆ తర్వాత ఈ ఇరువురి మధ్య మనస్ఫర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఝాన్సీ ఒంటరిగానే ఉంటోంది. అయితే, జోగీ నాయుడు మాత్రం మరో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

ఝాన్సీ పర్సనల్ లైఫ్‌పై యాంటి రూమర్లు

ఝాన్సీ పర్సనల్ లైఫ్‌పై యాంటి రూమర్లు


అడపాదడపా సినిమాలు చేయడంతో పాటు టీవీ షోలను హోస్ట్ చేస్తోంది ఝాన్సీ. ఇలాంటి సమయంలో ఆమె వ్యక్తిగత జీవితంపై ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆమె మరో పెళ్లి చేసుకోబోతుందన్న వార్త ప్రముఖంగా వినిపించింది. అంతేకాదు, ఇటీవల ఆమెకు కరోనా వ్యాధి సోకిందని కూడా ప్రచారం జరిగింది. అయినప్పటికీ వీటన్నింటిపై ఆమె స్పందించలేదు.

లిప్‌లాక్ సీన్‌పై యాంకర్ ఝాన్సీ కామెంట్స్

లిప్‌లాక్ సీన్‌పై యాంకర్ ఝాన్సీ కామెంట్స్

తాజాగా ఝాన్సీ.. సింగర్ సునీతతో కలిసి ‘అలీతో సరదాగా' అనే షోలో పాల్గొంది. ప్రముఖ కమెడియన్ అలీ హోస్ట్ చేస్తున్న ఈ షోలో వీరిద్దరూ ఎన్నో విషయాలను పంచుకున్నారు. అదే సమయంలో ప్రతి విషయానికీ స్పందించాల్సి అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ‘మన్మథుడు 2'లో తన లిప్‌లాక్ సీన్‌పై ఝాన్సీ తొలిసారి కామెంట్స్ చేశారు.

Recommended Video

Jabardasth Comedian నా పెళ్లి జరగకపోతే అందుకు కారణం Sreemukhi, Jhansi నే
ఆ ముద్దు తర్వాత భర్త కావాలని కోరిక కలిగింది

ఆ ముద్దు తర్వాత భర్త కావాలని కోరిక కలిగింది

ఆ సీన్ గురించి మాట్లాడుతూ... ‘సినిమాలో అది అవసరం కాబట్టే రాహుల్ ఆ సీన్‌ను మాతో చేయించాడు. హీరోయిన్ కిస్ చేయడం వల్లే... భర్త మీద కోరిక కలిగి నా పాత్ర అతడితో వెళ్లిపోతుంది. ఎంత బోల్డుగా తీశాడో కదా. ఆడవాళ్ల కోరికల గురించి రాహుల్ ఎంతో ధైర్యంగా చూపించాడు. దాన్ని అందరూ మెచ్చుకోవాలి. అంతేకానీ తప్పుగా చూడకూడదు' అని ఆమె వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X