twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భర్త ఘాడమైన ముద్దు.. పరవశించిపోయిన బిగ్ బాస్ బ్యూటీ.. వైరల్ పిక్

    |

    బిగ్ బాస్ బ్యూటీ పూజా రామచంద్రన్ తన భర్త జాన్ కొక్కెన్‌తో చేసే సందడి గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ రెండో సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన పూజా రామచంద్రన్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తమిళం అయినా కూడా తెలుగులో మాట్లాడుతూ ఇక్కడి ప్రేక్షకులను మెప్పించింది. తెలుగు చిత్రాల్లోనూ పూజా రామచంద్రన్ మెరిసింది. కానీ బిగ్ బాస్ షో ద్వారానే జనాలకు దగ్గరైంది.

    బిగ్ బాస్ షోతో అలా..

    బిగ్ బాస్ షోతో అలా..

    బిగ్ బాస్ షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన పూజా రామచంద్రన్ ఆటను మలుపుతిప్పింది. రెండో సీజన్‌లో పూజా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఫిట్‌నెస్‌పై ఆమెకున్న శ్రద్ద, టాస్కులు ఆడటంలో ఆమెకున్న ఫైర్ అన్నీ కూడా జనాలకు బాగానే నచ్చాయి. కానీ బిగ్ బాస్ ఇంటి నుంచి త్వరగానే ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది.

    అవకాశాలు మాత్రం...

    అవకాశాలు మాత్రం...

    బిగ్ బాస్ షో ద్వారా క్రేజ్ అయితే వచ్చింది గానీ ఆఫర్లు మాత్రం అంతగా రాలేదు. ఆమె కెరీర్‌లో బిగ్ బాస్‌కు ముందు లవ్ ఫెయిల్యూర్, స్వామిరారా వంటి సూపర్ హిట్ చిత్రాలున్నాయి. అయితే బిగ్ బాస్ తరువాత ఒక్కటంటే ఒక్క హిట్ కూడా ఆమె ఖాతాలో పడలేదు.

    సోషల్ మీడియాలో ఇలా..

    సోషల్ మీడియాలో ఇలా..

    పూజా రామచంద్రన్ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు నెట్టింట్లో అందరూ షాక్ అవుతుంటారు. యోగాలు, వర్కవుట్లు భర్తతో కలిసి చేస్తూ పూజా రామచంద్రన్ నెట్టింట్లో హల్చల్ చేస్తుంటుంది. భర్తతో రొమాంటిక్ పోజులు పెడుతూ నెటిజన్లను ఊరిస్తుంటుంది.

    భర్త ముద్దుతో పరవశం..

    భర్త ముద్దుతో పరవశం..

    తాజాగా పూజా రామచంద్రన్ తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో భర్త కౌగిలిలో ఉన్న పూజా పరవశించిపోయింది. భర్త పెట్టిన ముద్దుతో పూజా గాల్లో తేలిపోయినట్టుంది. ఇద్దరు వ్యక్తులు ఒకేచోట ఉంటే అది గొప్ప బంధమవుతుంది. భార్యభర్తల్లో ఎవరు బాధల్లో ఉన్నా కూడా ఒకరినొకరు అండగా నిలబడటమే వివాహా బంధం అన్నట్టుగా పూజా చెబుతూ అదిరిపోయే పిక్ షేర్ చేసింది.

    English summary
    John Kokken kisses Pooja Ramachandran..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X