Jr ఎన్టీఆర్ 20: లేత వయసులోనే బాక్సాఫీస్ బ్లాస్ట్.. దూరం పెట్టిన వాళ్లే ఇప్పుడు దండం పెట్టేలా..

సినిమా ప్రపంచంలో సక్సెస్ అవ్వాలి అంటే కొండంత టాలెంట్ తో పాటు రవ్వంత అదృష్టం కూడా ఉండాలి అంటారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ లైఫ్ లో ఆ డైలాగ్ కాస్త భిన్నంగా ఉంటుంది. నిజానికి తారక్ ఈ రేంజ్ లో బాక్సాఫీస్ హీరో అవుతాడని ఎవరు ఊహించి ఉండరు. తల్లి సపోర్ట్ తోనే క్రమశిక్షణతో నటనపై డ్యాన్స్ పై ఎంతో అవగాహన తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు. ఇక ఈ నందమూరి వారసుడు హీరోగా ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్ళవుతోంది.

అప్పుడే అందరి దృష్టిని ఆకర్షించాడు

అప్పుడే అందరి దృష్టిని ఆకర్షించాడు

మొదట బాలనటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తరువాత 16 ఏళ్ళ వయసులోనే నిన్ను చూడాలని ఉంది సినిమాతో లవర్ బాయ్ గా ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేశాడు. ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో కాస్త డీలా పడ్డ తారక్ వెంటనే రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మొదటి హిట్టు అనుకున్నాడు. అప్పుడే ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించాడు.

చిన్నవయసులోనే రికార్డ్ బ్రేక్

చిన్నవయసులోనే రికార్డ్ బ్రేక్

ఇక 18 ఏళ్ళ వయసులోకి రాకముందే ఆది సినిమా స్టార్ట్ చేసిన యంగ్ టైగర్ బాక్సాఫీస్ బ్లాస్ట్ అయ్యేలా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఆ సినిమాలో తారక్ నటన డైలాగ్ డెలివరీ థియేటర్స్ లో విజిల్స్ పడేలా చేశాయి. అతి చిన్న వయసులో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ అందుకున్న హీరోగా కూడా జూనియర్ ఎన్టీఆర్ అప్పట్లో ఒక రికార్డ్ క్రియేట్ చేశాడు.

దూరం పెట్టినవాళ్ళే దండం పెట్టేలా

దూరం పెట్టినవాళ్ళే దండం పెట్టేలా

ఇక ఆ తరువాత కొన్ని డిజాస్టర్స్ ఎదురైనప్పటికి సింహాద్రి సినిమాతో తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. తనను దూరం పెట్టినవాళ్ళు కూడా ఇప్పుడు దండం పెట్టేలా కెరీర్ ని సెట్ చేసుకున్నాడు ఎన్టీఆర్. వీలైనంత వరకు తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని చాలా చక్కగా సద్వినియోగపరుచుకున్నాడు.

అపజయాలు వచ్చినా.. తగ్గలేదు

అపజయాలు వచ్చినా.. తగ్గలేదు

యమదొంగ సినిమాతో మళ్ళీ తన అసలైన టాలెంట్ ని చూపించాడు. డ్యాన్స్, డైలాగ్స్, కామెడీ, సెంటిమెంట్.. ఇలా అన్ని అంశాల్లో తారక్ ఆల్ రౌండర్ అనిపించుకున్నాడు. ఇక ఓ వైపు అపజయాలు వస్తున్నా కూడా వెంటనే జాగ్రత్తలు తీసుకొని సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేలా చేసుకున్నాడు. అదుర్స్, బృందావనం సినిమాలు కూడా తారక్ కెరీర్ కి బాగానే ఉపయోగపడ్డాయి.

RRR సినిమాతో పాన్ ఇండియా హీరోగా..

RRR సినిమాతో పాన్ ఇండియా హీరోగా..

ఇక ఫైనల్ గా టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వంటి విభిన్నమైన సినిమాలతో మార్కెట్ ని కూడా పెంచుకున్నాడు. ఇక ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమాలో కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. మొదటి పాన్ ఇండియా ప్రాజెక్టు కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. సినిమా తప్పకుండా తారక్ స్థాయిని మరో రేంజ్ కి తీసుకువెళుతుందని చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X