నందమూరి ఫ్యామిలీలో పండుగ: ఒకే వేదికపై బాలయ్య, ఎన్టీఆర్, చంద్రబాబు

By Manoj Kumar P

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కుటుంబాల్లో నందమూరి ఫ్యామిలీది టాప్ ప్లేస్ అని చెప్పవచ్చు. దీనికి కారణం దివంగత నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అన్న విషయం తెలిసిందే. ఎంతో కాలం పాటు రెండు రంగాల్లో విశేష సేవలు అందించిన ఆయన తెలుగు వారి హృదయాల్లో లెజెండ్‌గా నిలిచిపోయారు.

ఎన్టీఆర్ తర్వాత చాలా మంది సినిమాలతో పాటు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే, కొన్నేళ్లుగా ఆ ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయని ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నందమూరి కుటుంబంలో ఓ పండుగ జరగనుంది. దానికి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, చంద్రబాబు సహా ఎంతో మంది హాజరు కానున్నారు. ఆ వివరాలు మీకోసం.!

రెండింటిలోకి ఎన్టీఆర్ వారసులుగా ఎంట్రీ

రెండింటిలోకి ఎన్టీఆర్ వారసులుగా ఎంట్రీ

నందమూరి తారక రామారావు తెలుగు వారిపై ఎంతటి ప్రభావం చూపించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఆయనను ఇక్కడి వారందరూ దేవుడిలా కొలిచేవారు. ఆయన తర్వాత బాలకృష్ణ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అలాగే, హరికృష్ణ కూడా కొన్ని చిత్రాల్లో నటించాడు. వీరి తర్వాతి తరం కూడా సినిమాల్లో ఉంది. అంతేకాదు, చాలా మంది పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చారు.

40 ఏళ్లుగా ఆయన నిలబెడుతున్నాడు

40 ఏళ్లుగా ఆయన నిలబెడుతున్నాడు

ఎన్టీఆర్ సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే నందమూరి బాలకృష్ణను సైతం చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు. తండ్రి చాటు బిడ్డలా కాకుండా అద్భుతమైన టాలెంట్‌తో అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడాయన. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు నలభై ఏళ్లుగా ఎన్టీఆర్ వారసత్వాన్ని నిలబెడుతున్నాడు ఈ నందమూరి హీరో బాలయ్య.

అందులో మాత్రం ఎవరికి వారే దిగారు

అందులో మాత్రం ఎవరికి వారే దిగారు

సినిమాల పరంగా ఇప్పటి వరకు నందమూరి ఫ్యామిలీ నుంచి మూడు తరలా నటులు తెలుగు వాళ్లకు పరిచయం అయ్యారు. రాజకీయాల్లోనూ కొందరు సత్తా చాటుతూనే ఉన్నారు. అయితే, ఈ కుటుంబానికి చెందిన పార్టీని కాదని కొందరు తమ దారి చూసుకున్నారు. ఇప్పటికీ వేరే పార్టీల్లో కొనసాగుతున్నారు. తమదైన రాజకీయంతో సత్తా చాటుతున్నారు.

అన్న గారి కుటుంబంలో విభేదాలు

అన్న గారి కుటుంబంలో విభేదాలు

సినిమాల్లో, రాజకీయాల్లో దూసుకుపోతున్నారు ఎన్టీఆర్ వారసులు. అయితే, కొన్నేళ్లుగా ఈ ఫ్యామిలీలో విభేదాలు తలెత్తుతున్నాయని జోరుగా ప్రచారం జరుగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా ఇప్పటి స్టార్ హీరోలు.. బాబాయ్ అబ్బాయ్ నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

ఇద్దరూ కలిశారు.. అయినా ఆగలేదు

ఇద్దరూ కలిశారు.. అయినా ఆగలేదు

చాలా కాలంగా నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారన్న టాక్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ‘అరవింద సమేత' సక్సెస్‌ మీట్‌కు బాలయ్య ముఖ్య అతిథిగా విచ్చేయగా, ‘యన్.టి.ఆర్' బయోపిక్ ఫంక్షన్‌ను తారక్ వచ్చాడు. అయినప్పటికీ... విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయని ప్రచారం జరుగుతూనే ఉంది.

Recommended Video

పీకే తో కడుపు చేయించుకుని కోట్లు భరణం గా పుచ్చుకున్నావ్, పూనమ్ కౌర్‌కు శ్రీరెడ్డి కౌంటర్!!
ఒకే వేదికపై బాలయ్య, ఎన్టీఆర్, చంద్రబాబు

ఒకే వేదికపై బాలయ్య, ఎన్టీఆర్, చంద్రబాబు

తాజా సమాచారం ప్రకారం నందమూరి ఫ్యామిలీలో ఓ పండుగ జరగబోతుందట. అదే.. బాలకృష్ణ షష్టిపూర్తి వేడుక. జూన్ 10న ఆయన అరవైవ పడిలోకి అడుగు పెడుతున్నారు. దీనిని పురస్కరించుకుని భారీ ఫంక్షన్ చేస్తున్నారని తెలుస్తోంది. దీనికి జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, చంద్రబాబు నాయుడు, పురందేశ్వరి సహా కుటుంబ సభ్యులు హాజరవుతారని తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X