ఎన్టీఆర్‌తో ఆప్యాయంగా మోక్షజ్ఞ: బయటకు వచ్చిన మరో రేర్ పిక్.. ఫ్యాన్స్ కళ్లలో నీళ్లు రావడం ఖాయం!
టాలీవుడ్‌లో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీనికి కారణం నందమూరి తారక రామారావు అన్న విషయం తెలిసిందే. ఆయన తర్వాత తరంలో బాలకృష్ణ, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్టార్లుగా హవాను చూపిస్తున్నారు. కెరీర్ పరంగా ఎలా ఉన్నా.. పర్సనల్ లైఫ్‌లో మాత్రం వీళ్ల వ్యవహార శైలిపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఇద్దరు హీరోలు, వాళ్ల కుటుంబాల మధ్య మనస్పర్థలు వచ్చాయని చాలా కాలం వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బయటకు వచ్చిన ఓ ఫొటో వాటన్నింటినీ పటాపంచలు చేసింది. వివరాల్లోకి వెళ్తే...
సుహాసిని కుమారుడి పెళ్లిలో:నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని కొడుకు వెంకట శ్రీహర్ష వివాహం నాలుగు రోజుల క్రితమే ఘనంగా జరిగింది. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో నిర్వహించిన ఈ వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు దీనికి హాజరయ్యారు. అలాగే, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలు కూడా వచ్చారు. దీంతో ఈ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.

సోదరులతో కలిసి పనులు:సుహాసిని కొడుకు పెళ్లి కావడంతో ఆమె సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఈ వేడుకకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నారు. మేనల్లుడి వివాహం కలకాలం గుర్తుండిపోయేలా సందడి చేశారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తన సోదరులు కల్యాణ్ రామ్, మోక్షజ్ఞ, చైతన్య కృష్ణ సహా పలువురితో కలిసి పెళ్లి పనులను స్వయంగా చూసుకున్నాడు.

బాలయ్య షేక్ హ్యాండ్ ఇచ్చి:తారకరత్న మరణం తర్వాత ఎన్టీఆర్‌ను నందమూరి బాలకృష్ణ అవమానించారంటూ ఓ వీడియో తెగ చక్కర్లు కొట్టింది. దీంతో బాబాయ్ అబ్బాయి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని అంతా అనుకున్నారు. ఈ పరిస్థితుల్లో సుహాసిని కొడుకు పెళ్లికి వచ్చిన బాలయ్యను ఎన్టీఆర్ ఆప్యాయంగా పలకరించి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఈ వీడియో ఓ రేంజ్‌లో వైరల్ అయిపోయింది.

ఫొటోలు.. మోక్షూ హైలైట్‌గా:నందమూరి సుహాసిని కొడుకు పెళ్లిలో ఆ ఫ్యామిలీకి చెందిన హీరోలు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కలిసి తమ సోదరులతో ఫొటోలు దిగారు. ముఖ్యంగా మోక్షజ్ఞతో ఇద్దరూ ఓ పిక్‌కు ఫోజులిచ్చారు. ఇది ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారింది. ఇక, ఈ ఫొటోలో హీరోలిద్దరూ తమదైన స్టైల్‌లో కనిపించగా.. మోక్షజ్ఞ క్లీన్ షేవ్‌తో పాటు స్లిమ్ లుక్‌తో దర్శనమిచ్చి.. అందరి కంటే హైలైట్‌గా నిలిచాడు.

ఎన్టీఆర్‌కు హగ్ ఇచ్చాడుగా:శ్రీహర్ష వివాహం తర్వాత అక్కడ నందమూరి బ్రదర్స్ తీసుకున్న ఫొటోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తమ్ముడు మోక్షజ్ఞను జూనియర్ ఎన్టీఆర్ ఆప్యాయంగా హత్తుకున్న ఫొటో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయింది. ఇందులో అన్నాదమ్ములు ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. దీంతో ఈ పిక్ ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది.

అభిమానులంతా ఆనందం:బాలకృష్ణ ఫ్యామిలీకి, జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య విభేదాలు ఉన్నాయంటూ చాలా కాలంగా వస్తున్న వార్తలతో నందమూరి ఫ్యాన్స్ బాధగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సుహాసిని కొడుకు పెళ్లిలో బాబాయ్ - అబ్బాయి, అన్నా తమ్ముడు కలిసి ఆప్యాయంగా కనిపించడం అభిమానులను ఖుషీ చేసింది. అందుకే ఈ పిక్ చూసిన ఫ్యాన్స్ కళ్లన్నీ ఆనంద భాష్ఫాలతో నిండిపోతున్నాయి.


Click it and Unblock the Notifications











