ఆ చరిత్రకు పదిహేడేళ్లు.. ట్విట్టర్‌లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ.. NTRకి కొత్త అర్థమిదే!!
ప్రతీ సినిమా ఓ చరిత్రను సృష్టించలేదు. ఓ సినిమాయే చరిత్రగా మారితే ఎలా ఉంటుందో ఇరవై యేళ్ల ప్రాయంలోనే చూపించాడు ఎన్టీఆర్. సరిగ్గా మీసాలు కూడా రాలేదు గానీ బాక్సాఫీస్‌ను చీల్చి చెండాడాడు. పదిహేడేళ్లకు ఇండస్ట్రీకి పరిచయమై.. టీనేజ్‌లోనే రికార్డులను బద్దలు కొట్టి.. టాలీవుడ్ టాప్ స్టార్‌గా ఎదిగాడు. ఆ వయసులో కాలేజ్‌కు వెళ్తూ సరదాగా గడపాల్సిన వాడు తెలుగు సినిమా సింహాసనంపై కూర్చున్నాడు. తొలినాళ్లలోనే ఆది, సింహాద్రి వంటి ఇండస్ట్రీ హిట్లను కొట్టి తిరుగులేని హీరోగా నిలబడ్డాడు. సింహాద్రికి రేపటి (జూలై 9)తో పదిహేడేళ్లు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నారు.

నాడు ఆ రికార్డులు..
సింహాద్రి రికార్డుల లెక్కలు ఓ చరిత్రే. ఇండస్ట్రీలో మొదటి రోజు, మొదటి వారం, ఫుల్ రన్‌లో సింహాద్రి ఇప్పటికీ టాప్ ప్లేస్‌లొనే ఉంది. ఇక 50, 100, 150, 175, 200 డేస్‌లో అయితే కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఇండస్ట్రీ హిట్‌కు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్‌గా నిలిచిందని కామెంట్స్ చేస్తున్నారు.

నేడు సోషల్ మీడియా రికార్డులు..
నేడు సోషల్ మీడియా మొత్తం సంహాద్రి జపం చేస్తోంది. నేటి ఉదయం నుంచి సింహాద్రి హాట్ టాపిక్‌గా నిలిచింది. చరిత్రకు పదిహేడేళ్లని సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు. ట్విట్టర్ ప్రపంచంలో కొంగొత్త రికార్డులకు నాంది పలుకుతున్నారు.

ఫాస్టెస్ట్ మిలియన్ ట్వీట్స్..
కేవలం 53 నిమిషాల్లోనే మిలియన్ల ట్వీట్లను సంపాదించుకుంది. 17YearsForIHSimhadri అనే హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. ఇక జెట్ స్పీడ్‌లో ట్వీట్లు చేయడంతో వెంటనే 1.5 మిలియన్ల ట్వీట్లకు చేరుకుంది. NTR అంటే New Twitter Record అంటూ సింహాద్రి పదిహేడు వసంతాలను ఘనంగా సెలెబ్రేట్ చేస్తున్నారు.
Recommended Video

జక్కన్న మార్క్ మాసిజం..
రాజమౌళి మాస్‌ను పీక్స్‌లో చూపిస్తే ఎలా ఉంటుందో ఓ చిన్న ఉదహరణే సింహాద్రి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కనకవర్షాన్ని కురిపించింది. దాదాపు 8 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా.. టోటల్ రన్‌లో 26 కోట్లకు పైగా షేర్ అందుకుని సంచలనం సృష్టించింది.


Click it and Unblock the Notifications











