Jr NTR: సలార్, కాంతార డైరెక్టర్లతో ఎన్టీఆర్.. వాళ్ల భార్యలను ఇలా ఎప్పుడైనా చూశారా?
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా అన్ని విభాగాల్లోనూ రాణిస్తూ.. సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోగా హవాను చూపిస్తున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. దీనికితోడు ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతోన్న అతడు.. RRR తర్వాత అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఎన్టీఆర్.. కన్నడ పరిశ్రమలో ఇద్దరు స్టార్లను కలిశాడు. దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూసేయండి!
వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు 'దేవర' అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దీన్ని ఈ ఏడాది అక్టోబర్ 10న విడుదల చేయబోతున్నారు. దీని తర్వాత తారక్ నేరుగా బాలీవుడ్‌లోకి వెళ్లి హృతిక్ రోషన్‌తో కలిసి 'వార్ 2' మూవీని చేయనున్నాడు.

హై రేంజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'దేవర' మూవీకి సంబంధించిన షూటింగ్‌కు ఇప్పుడు బ్రేక్ రావడంతో జూనియర్ ఎన్టీఆర్ తన పర్సనల్ ట్రిప్‌లతో బిజీగా గడుపుతున్నాడు. ఇటీవలే ఓ టూర్ వెళ్లొచ్చిన ఈ టాలీవుడ్ స్టార్ హీరో.. ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి బెంగళూరు నగరంలో ప్రత్యక్షం అయ్యాడు. అక్కడ ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ పాల్గొనబోతున్నట్లు తెలిసింది.

బెంగళూరు వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ అక్కడ ఇద్దరు బడా డైరెక్టర్లను కలిశాడు. వాళ్లే 'సలార్' దర్శకుడు ప్రశాంత్ నీల్, 'కాంతార' డైరెక్టర్ కమ్ హీరో రిషబ్ శెట్టి. వీళ్లిద్దరితో మొదటి నుంచీ మంచి సన్నిహిత్యం ఏర్పరచుకున్న ఎన్టీఆర్.. గత రాత్రి ఓ ఈవెంట్‌లో ఇద్దరిని కలిశాడు. ఈ మీటింగ్‌కు సంబంధించిన ఫొటోలను యంగ్ టైగర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు.

బెంగళూరులో జరిగిన ఈ మీటింగ్‌లో ఎన్టీఆర్ వెంట అతడి భార్య లక్ష్మి ప్రణతి కూడా ఉన్నారు. అలాగే, ప్రశాంత్ నీల్, అతడి భార్య లిఖితా రెడ్డి.. రిషబ్ శెట్టి అతడి భార్య ప్రగతి శెట్టి కూడా ఉన్నారు. వీళ్లందరితో యంగ్ టైగర్ దిగిన ఫొటోలు అదిరిపోయేలా ఉన్నాయి. ముఖ్యంగా ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టితో తారక్ దిగిన ఫొటో మాత్రం ఓ రేంజ్‌లో వైరల్ అయిపోతోంది.
తాజాగా బెంగళూరులో జరిగిన ఈ స్టార్స్ మీటింగ్‌లో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టిలతో పాటు మైత్రీ మూవీ మేకర్స్, హొంబళే ఫిల్స్ సంస్థ నిర్మాతలు కూడా ఉన్నారు. దీంతో ఈ మీటింగ్ సాధారణంగా జరిగిందా? లేదా వాళ్ల ప్రాజెక్టు కోసం జరిగిందా? అన్నది సస్పెన్స్‌గా మారిపోయింది.

ఇదిలా ఉండగా.. జూనియర్ ఎన్టీఆర్ తన 31వ సినిమాను 'సలార్' దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో చేయబోతున్న విషయం తెలిసిందే. దీనిపై ఎప్పుడో అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. కానీ, ప్రభాస్‌తో సినిమాను రెండు పార్టులుగా చేయబోతుండడంతో ఇది ఆలస్యం అవుతోంది. దీనికితోడు ఎన్టీఆర్ కూడా బిజీగా ఉండడంతో ఈ సినిమాను మరింత లేటుగా మొదలు పెట్టబోతున్నారు.


Click it and Unblock the Notifications











