twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్లాష్ బ్యాక్: గుండమ్మ కథ చేయలనుకొని వెనుకడుగు వేసిన తారక్, చైతూ.. ఆ ఒక్క కారణం వల్లే..

    |

    తెలుగు సినిమాల్లో బెస్ట్ క్లాసిక్ గుండమ్మ కథ అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సినిమా వచ్చి 60ఏళ్ళు దాటింది. ఇక సినిమా ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టని విధంగా ఉంటుంది. సరదాగా సాగిపోయే ఆ క్లాసిక్ సినిమాను మరోసారి కొత్తగా చేస్తే అద్భుతంగా ఉంటుందని అక్కినేని, నందమూరి వారసులు ఎన్నోసార్లు అనుకున్నారు. కానీ ఒకే ఒక్క కారణం వలన ఆ ఆలోచన అంతవరకే ఆగిపోయింది. ఆ విషయాన్ని నాగార్జున కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

    భారీ తారాగణంతో..

    భారీ తారాగణంతో..

    విజయ వాహిని ప్రొడక్షన్ లో నాగిరెడ్డి, చక్రపాణి నిర్మాతలుగా కమలాకర కామేశ్వర రావు దర్శకత్వంలో వచ్చిన గుండమ్మ కథ1962లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అగ్ర హీరోలుగా చక్రం తిప్పుతున్న ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి నటించడంతో అప్పట్లో విడుదలకు ముందే సినిమా భారీ హైప్ క్రియేట్ చేసింది. దానికి తోడు సావిత్రి, జమున కూడా నటించడంతో మంచి హైప్ క్రియేట్ అయ్యింది.

    కలెక్షన్స్ ఎంతంటే..

    కలెక్షన్స్ ఎంతంటే..

    గుండమ్మ కథ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు, వారితో సమానంగా నటించిన స్టార్ హీరోయిన్స్ ఉన్నప్పటికీ ఎక్కువగా సూర్యకాంతం హైలెట్ అయ్యారు. టైటిల్ రోల్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసిన గుండమ్మ కథ అప్పట్లో అత్యదిక షేర్ అందుకున్న సినిమాల్లో టాప్ ప్లేస్ ను అందుకుంది. దాదాపు 90లక్షల షేర్ వచ్చినట్లు టాక్.

    బాలకృష్ణ, నాగార్జునతలతో అనుకున్నప్పటికీ..

    బాలకృష్ణ, నాగార్జునతలతో అనుకున్నప్పటికీ..

    ఇక అలాంటి గోల్డెన్ క్లాసిక్ సినిమాను మరోసారి సరికొత్తగా అక్కినేని, నందమూరి వారసులు తెరపైకి తీసుకు వస్తే అద్భుతంగా ఉంటుందని చాలామంది ఆలోచించారు. ముఖ్యంగా బాలకృష్ణ, నాగార్జున కూడా అందుకు సిద్ధమన్నారు. కొంతమంది నిర్మాతలు దర్శకులు కూడా ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశారు. కానీ ఎందుకో అది వర్కౌట్ కాలేదు.

    ఆ ఒక్క కారణం వల్ల ఎన్టీఆర్ వెనుకడుగు..

    ఆ ఒక్క కారణం వల్ల ఎన్టీఆర్ వెనుకడుగు..

    ఇక ఒకనొక టైమ్ లో జూనియర్ ఎన్టీఆర్ ఆ కథను చేయాలని చాలా బలంగా అనుకున్నాడు. నాగార్జునతో మాట్లాడి నాగచైతన్య అయితే బావుంటుందని ఒప్పించాడు కూడా. కానీ చర్చల దశలోనే ఆ సినిమా ఆగిపోయింది. ఎందుకంటే ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి, జామున పాత్రలకు ఎవరినైనా సెట్ చేయవచ్చు గాని గుండమ్మ పాత్ర చేసిన సూర్యకాంతంను పట్టడం అసాధ్యం. ఆమె కోపం, గయ్యాలితనం టైమింగ్ ను అందుకోవడం ఇప్పటి వారికి అసాధ్యం. అలాంటి క్యారెక్టర్ దొరక్కపోవడం వల్లనే జూనియర్ ఎన్టీఆర్, చైతన్య ముందడుగు వేయలేకపోయారు.

    English summary
    Gundamma Katha is the best classic in Telugu cinema. 60 years have passed since that movie came out. No matter how many times you watch the movie, it will not get bored. The descendants of Akkineni and Nandamuri have often thought that it would be wonderful to make a new classic film that goes on for fun. But for one reason or another, the idea came to a halt. Nagarjuna also said that in an interview.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X