మేమంతా నాన్న పిచ్చోళ్లం.... వైరల్ అవుతున్న జూ ఎన్టీఆర్ ఓల్డ్ కామెంట్స్!

By Bojja Kumar

నందమూరి హరికృష్ణ మరణంతో ఆయన తనయుడు జూ ఎన్టీఆర్ గతంలో తన తండ్రి గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2016లో విడుదలైన జూ ఎన్టీఆర్ 25వ మూవీ 'నాన్నకు ప్రేమతో' సినిమా ఆడియో వేడుకలో తండ్రి హరికృష్ణతో కలిసి జూనియర్ హాజరయ్యారు. ఆ సందర్భంలో యంగ్ టైగర్ తండ్రి గొప్పదనం, ఆయన్ను ఎంతగా ప్రేమిస్తానో వివరించిన తీరు అప్పట్లో హైలెట్ అయింది. దాదాపు రెండున్నరేళ్ల క్రితం చేసిన ఆ కామెంట్స్ హరికృష్ణ హఠాన్మరణం నేపథ్యంలో ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి.

మాలో ధైర్యం నింపింది నాన్నే

మాలో ధైర్యం నింపింది నాన్నే

‘నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు నాకు ధైర్యం చెప్పి, వెన్ను తట్టి పంపి, నా మీద నాకు నమ్మకం కలిగేలా చేసింది మా నాన్నగారు నందమూరి హరికృష్ణగారు. నాన్న ఎప్పుడూ మా ముగ్గురు సోదరులకు ఒకటే చెప్పేవారు. ‘కింద పడండి.. చావుదాకా వెళ్లిపోండి. కానీ, మిమ్మల్ని మీరు నమ్ముకుని పైకి రండి' అని చెప్పారు.

పిరికి పందల్లా బ్రతకడం నేర్పించలేదు

పిరికి పందల్లా బ్రతకడం నేర్పించలేదు

ఆయన ఏ రోజూ పిరికి పందల్లా బతకడం మాకు నేర్పించలేదు. ఆయన పేరు, తాతగారి పేరు చెప్పుకొని బతకడం నేర్పలేదు. ‘మీకు మీరుగా బతకండి. మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి' అని చెప్పేవారు అని ‘నాన్నకు ప్రేమతో' ఆడియో వేడుకలో రెండేళ్ల క్రితం ఎన్టీఆర్ అన్నారు.

నాన్నకు ఏదైనా అయిపోతుందంటే ఊహించుకోలేను

నాన్నకు ఏదైనా అయిపోతుందంటే ఊహించుకోలేను

సినిమాటిక్‌గా తీయాలి కాబట్టి ‘నాన్నకు ప్రేమతో' కతను రకరకాలుగా మార్చి ఉండవచ్చు. కానీ, ఇది దర్శకుడు సుకుమార్‌గారి నాన్నగారి కథ. ఈ కథ చెప్పినప్పుడు భయపడ్డా. మా నాన్నకు ఏదైనా అయిపోతుందంటే నేనైతే ఊహించుకోలేను. మనిషిని మామూలుగా ఉండలేను. అలాంటిది ఆయనకున్న బాధను దిగమింగుకొని సుకుమార్ వాళ్ల నాన్నకు నివాళిగా ఈ కథ రాశారు. ఇలాంటి దర్శకుడు ఎప్పుడూ పుట్టడు. ఆయన రాసే ప్రతి కథలో జీవితం ఉంటుంది.'' అని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు.

మేమంతా నాన్న పిచ్చోళ్లం

మేమంతా నాన్న పిచ్చోళ్లం

‘‘నేను స్పెయిన్‌లో ఉండగా, దేవిశ్రీ ప్రసాద్‌ నాన్నగారు చనిపోయారు. అప్పుడు ఫోన్ చేస్తే హైదరాబాద్ నుండి బయల్దేరుతున్నాడు. అపుడు ఒక మెసేజ్ పెట్టాను. మీకు ఫోన్ చేయడానికి ట్రై చేశాను. మీరు బాధలో ఉన్నారు. నేను అర్థం చేసుకోగలను. ఫోన్ చేసి ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేదు అని మెసేజ్ పెట్టాను. నేను మెసేజ్ పెట్టిన రెండో రోజు నాకు రిప్లై వచ్చింది. ‘థాంక్యూ ఫర్ యువర్ వర్డ్స్. నాన్నగారి అంత్యక్రియలు పూర్తయ్యాయి. అమ్మను జాగ్రత్తగా చూసుకుంటున్నా. మా నాన్నే నాకు గొప్ప స్ఫూర్తి. నేను అత్యంత ఎక్కువగా ప్రేమించే వ్యక్తి కూడా ఆయనే. ఈజు డోంట్ స్టాప్ అనే పాట రఘు దీక్షిత్ తో పాడించాను. ఏదో ఒక కారణంతో పని ఆపడం నాన్నగారికి ఇష్టం ఉండదు.' అని మెసేజ్ పెట్టాడు అని ఎన్టీఆర్ ఆ సమయంలో సభాముఖంగా వెల్లడించారు.

ఎన్టీఆర్ వ్యాఖ్యలతో దేవిశ్రీ ప్రసాద్ స్టేజీ మీదనే కన్నీటి పర్యంతం అయ్యారు. దేవిశ్రీ కన్నీరు పెట్టడంపై ఎన్టీఆర్ స్పందిస్తూ.... నిన్ను మరోసారి ఏడిపించినందుకు సారీ. సత్యమూర్తి గారి ఆశీస్సులు మా అందరిపై ఉంటాయని భావిస్తున్నాను. నేను ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే... ‘మేమంతా నాన్న పిచ్చోళ్లం' అని తారక్ వ్యాఖ్యానించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X