For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నందమూరి అభిమానులకు సర్‌ప్రైజ్.. స్వాతంత్య్ర సమరయోధుడి గెటప్‌ను షేర్ చేసిన తారక్

|

వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఒకానొక సమయంలో ఎన్నో ఫ్లాపులు పలకరించినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా ముందుకు నడిచాడు. ఈ క్రమంలోనే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'టెంపర్' నుంచి అతడు సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ సినిమాతో మొదలు పెట్టి వరుసగా 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత'తో సక్సెస్‌ఫుల్ హీరోగా కొనసాగుతున్నాడు.

మార్కెట్ పెరిగిపోయింది

మార్కెట్ పెరిగిపోయింది

వరుస విజయాలతో దూసుకుపోతున్న తారక్.. టాప్ పొజిషన్‌పై కన్నేశాడు. ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అదే సమయంలో తన మార్కెట్‌ను కూడా భారీ స్థాయిలో పెంచుకున్నాడు. అదే సమయంలో వ్యాపార ప్రకటనలు కూడా చేస్తూ బిజీ అయిపోయాడు. కొన్ని చానెళ్లకు బ్రాండ్ అంబాసీడర్‌గానూ వ్యవహరిస్తున్నాడు.

‘RRR' కోసం ప్రత్యేకంగా...

‘RRR' కోసం ప్రత్యేకంగా...

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘RRR'లో నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. ఇందులో తారక్.. కొమరం భీం పాత్రలో కనిపించనున్నాడు. ఇందుకోసం ఆయన ప్రత్యేక కసరత్తులు చేస్తున్నాడు. ఎక్కువ సమయం జిమ్‌లోనే గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో తారక్ గెటప్‌కు సంబంధించిన పిక్ గురువారం వదులుతారని ప్రచారం జరిగింది.

సర్‌ప్రైజ్ పిక్ షేర్

కానీ, అంతకు మించిన సర్‌ఫ్రైజ్ గిప్టును తారక్ తన అభిమానులకు ఇచ్చాడు. అదే.. ఆయన పెద్ద కుమారుడు అభయ్ రామ్ ఫొటో. స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో అభయ్‌ను ఫ్రీడం ఫైటర్ సుభాష్ చంద్రబోస్‌లా రెడీ చేశారు. దీనికి సంబంధించిన పిక్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. దీంతో నందమూరి అభిమానులు తెగ ఖుషీ అయిపోతున్నారు. దీనిపై సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అందరూ చిన్న రాముడిని ఆశీర్వదిస్తున్నారు. దీంతో ఈ పిక్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

ఇలా సంతోష పడుతున్నారు

ఇలా సంతోష పడుతున్నారు

జూనియర్ ఎన్టీఆర్ గెటప్‌కు సంబంధించిన ఫొటో వస్తుందనుకున్న వారు అభయ్ పిక్ చూసి సంతోష పడిపోతున్నారు. బుల్లి రాముడు ఎంతో అందంగా ఉన్నాడంటూ కితాబిస్తున్నారు. అంతేకాదు, హ్యాపీ ఇండిపెండెన్స్ డే.. జైహింద్.. భారత్ మాతాకీ జై అంటూ పలు నినాదాలు చేస్తున్నారు. చిరు నవ్వులు చిందిస్తున్న అభయ్ ఫొటోను మీరు కూడా చూసేయండి.

త్రివిక్రమ్‌తో సినిమా

త్రివిక్రమ్‌తో సినిమా

జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్‌తో సినిమా చేసే విషయంపై క్లారిటీ రాలేదు. కానీ, అతడి తర్వాతి చిత్రంపై తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. అదే.. తారక్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మరోసారి సినిమా చేయబోతున్నాడట. ఈ సినిమా సమ్మర్ నుంచి స్టార్ట్ కాబోతుందని కూడా ఓ వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది.

English summary
Junior NTR has shared two pictures of Abhay Ram and Bhargava Ram on his Instagram page on the day of his second son celebrates his first birthday. The cute and adorable photos have gone viral on the internet.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more