ఎన్టీఆర్ చేతికి రేర్ బ్రాండ్ వాచీ..ఎన్ని కోట్ల ధరనో తెలుసా?
సినీ పరిశ్రమకి చెందిన స్టార్ హీరోల లైఫ్ లు చాలా వరకు మంచి లగ్జరీగానే ఉంటాయని అందరికీ తెలుసు. సామాన్య ప్రేక్షకుల్లా ఉండాల్సిన సమయంలో అలా కూడా ఏవన్నా అకేషన్స్ ఉన్నపుడు తమలోని ధనవంతుల్ని కూడా చూపిస్తారు. అయితే కొందరు హీరోస్ కాలికి వేసుకునే చెప్పులు నుంచి తలకి చేయించే హెయిర్ స్టైలింగ్ వరకు కూడా లక్షల్లో ఖర్చు పెడుతూ ఉంటారు.
ఇలా తెలుగులో కూడా చాలా మంది స్టార్ హీరోస్ తమదైన లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తూ సినిమాలు చేస్తున్నారు. కాగా తాజాగా తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి బిగ్గెస్ట్ మాస్ హీరోస్ లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నడుమ వైరల్ గా మారాడు. ఒక పక్క తన భారీ చిత్రం "దేవర" నుంచి ప్రమోషనల్ కంటెంట్ తో పాన్ ఇండియా లెవెల్లో వైరల్ అవుతుండగా ఇంకో పక్క తన కెరీర్ 31వ సినిమాని క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో తాను మొదలు పెట్టేసాడు.

కాగా నిన్ననే ముహూర్త కార్యక్రమాలతో స్టార్ట్ అయ్యిన ఈ సినిమాకి ఎన్టీఆర్ చాలా సింపుల్ లుక్స్ వచ్చి మొదలు పెట్టేసాడు కానీ ఇదే ఈవెంట్ లో తన చేతికి ధరించిన వాచ్ ఒకటి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఇది చూసేందుకు నీలి రంగులో మంచి ప్రీమియం గా కనిపిస్తుంది కానీ దీని ధర వింటే మాత్రం అంతా షాక్ అవ్వాల్సిందే అని అంటున్నారు ఫ్యాన్స్.
ఈ వాచ్ ధర ఎంతంటే అక్షరాల మూడు కోట్లు అట. అంతే కాకుండా అన్ని చార్జెస్ కలిపి దీని కాస్ట్ ఇంకా ఎక్కువే ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఇంత ప్రత్యేకత ఇందులో ఏముంది అంటే.. జెనరల్ గా వరల్డ్ పాపులర్ వాచ్ బ్రాండ్ అంటే రోలెక్స్ అనే చాలా మంది అంటారు. ఇది నిజమే ఇది వరల్డ్ లోనే నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ ధరించిన వాచ్ బ్రాండ్ కి కూడా మంచి హిస్టరీ ఉందట.

పీట్ ఫిలిప్ అనే ఈ బ్రాండ్ స్విట్జర్లాండ్ కి చెందిన సంస్థ కాగా ఎప్పుడో 1809 నుంచి కూడా వీరు వాచ్ లను తయారు చేస్తున్నారట. ఇది వరల్డ్ లోనే టాప్ 3 బ్రాండ్స్ లో ఒకటి కాగా వీరిలో కొన్ని ప్రీమియం కలెక్షన్ లో ఒకదాన్ని ఎన్టీఆర్ ప్రత్యేకంగా చేయించుకున్నాడట. అందుకే దీని ధర ఇంత మొత్తంలో ఉందని తెలుస్తుంది. ఇలా నిన్న తన భారీ సినిమా లాంచ్ ఈవెంట్ లో తన వాచ్ కోసం ఆరా తీస్తే అందరికీ షాకిచ్చే ధర బయటకి వచ్చింది.
ఇక ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ల భారీ చిత్రం అనౌన్సమెంట్ తో ఫ్యాన్స్ బాగా ఎగ్జైటెడ్ గా ఉండగా ఈ సినిమాని కూడా నీల్ తన మార్క్ లో పీరియాడిక్ జానర్ లో ప్లాన్ చేస్తున్నాడు. అలాగే 2026 లో జనవరి 9న థియేటర్స్ లోకి వస్తున్నట్టుగా ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమా కోసం పక్కన పెడితే ఈ ఏడాదిలోనే దర్శకుడు కొరటాల శివతో చేస్తున్న చిత్రం దేవర సెప్టెంబర్ 27న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ రాబోతుంది


Click it and Unblock the Notifications











