రేణు దేశాయ్ ముందు ఎన్టీఆర్‌తో రచ్చ రచ్చ చేసిన సుధీర్.. ట్రెండ్ అవుతున్న వీడియో

Recommended Video

Jr NTR Look-Alike With Renu Desai And Sudigali Sudheer In A TV Show

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది టాలెంట్ ఉన్న వాళ్లు వెలుగులోకి వస్తున్నారు. పాటలు పాడుతూనో.. డ్యాన్సులు చేస్తూనో.. సెలెబ్రిటీలను ఇమిటేట్ చేసుకుంటూనో తమ తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇదే సమయంలో చాలా మంది మన సెలెబ్రిటీలను పోలిన వాళ్లు కూడా బయటకు వస్తున్నారు. ఇలా వచ్చిన వారిలో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ డూప్ షమీందర్ సింగ్ ఒకరు. తాజాగా ఆయన ఓ షో కోసం హైదరాబాద్ వచ్చాడు. అతడితో కలిసి ప్రముఖ యాంకర్ సుడిగాలి సుధీర్ రచ్చ రచ్చ చేశాడు.

 ఎన్టీఆర్ డూప్‌గా పాపులర్

ఎన్టీఆర్ డూప్‌గా పాపులర్

పంజాబ్‌కు చెందిన షమీందర్ సింగ్ అచ్చం జూనియర్ ఎన్టీఆర్‌లా కనిపిస్తాడు. సోషల్ మీడియా ద్వారా ఈయన తెలుగు వాళ్లకు పరిచయం అయ్యాడు. దీంతో అప్పటి నుంచి ఇతనికి మరింత పాపులారిటీ పెరిగిపోయింది. అదే సమయంలో సోషల్ మీడియాలో అతడిని ఫాలో అయ్యే వాళ్లు కూడా భారీ స్థాయిలో పెరిగిపోయారు.

తారక్‌ను ఇమిటేడ్ చేస్తూ...

తారక్‌ను ఇమిటేడ్ చేస్తూ...

షమీందర్ సింగ్ తారక్‌ను ఇమిటేట్ చేస్తూ వీడియోలు పెడుతుంటాడు. ఎన్టీఆర్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను టిక్‌టాక్ ద్వారా వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో ఎన్టీఆరే ఇవన్నీ పోస్ట్ చేస్తున్నాడని అనుకున్నారు. తర్వాత అసలు విషయం తెలియడంతో అవాక్కయ్యారు చాలా మంది నెటిజన్లు.

నందమూరి హీరో ఫ్యాన్

నందమూరి హీరో ఫ్యాన్

అచ్చు తారక్‌ను పోలి ఉన్న ఈ వ్యక్తికి తెలుగు రాకపోయినా షమీందర్ సింగ్ ఎన్టీఆర్‌కు వీరాభిమానట. ఈ విషయాన్ని ఆయనే ఓ వీడియో ద్వారా వెల్లడించాడు. ఎప్పటికైనా ఎన్టీఆర్‌ను కలవాలన్నదే తన కోరిక అని కూడా ఈ సోషల్ మీడియా సెన్సేషన్ చెబుతుంటాడు.

టీవీ షో కోసం వచ్చాడు

టీవీ షో కోసం వచ్చాడు

పంజాబ్‌లో ఉండే షమీందర్ సింగ్.. ప్రముఖ చానెల్‌లో ప్రసారమయ్యే ఓ ప్రోగ్రాం కోసం హైదరాబాద్ వచ్చాడు. ఈ షోలో కాసేపు కనిపించి కనువిందు చేశాడు. ఇది చూసిన తారక్ అభిమానులు అతడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలోని తమ గ్రూపుల్లో షేర్ చేసుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సుధీర్ రచ్చ


షమీందర్ తమ షోకు రావడంతో యాంకర్ సుధీర్ రచ్చ రచ్చ చేశాడు. నిజంగా ఎన్టీఆరే వచ్చాడు అన్నట్లు అతడు ప్రవర్తించాడు. ఈ షోకు ప్రముఖ నటి రేణు దేశాయ్, సింగర్ మనో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. షమీందర్‌కు తెలుగు రాకపోవడంతో రేణూనే అతడితో హిందీలో మాట్లాడడం విశేషం. తర్వాత ఈ షోకు సంబంధించిన ఫొటోలను అతడు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసుకున్నాడు.

యూట్యూబ్‌లో ట్రెండ్

యూట్యూబ్‌లో ట్రెండ్

షమీందర్ తెలుగు షోలో పాల్గొనడంతో ఈ వీడియోను యూట్యూబ్‌లో ఉంచారు. దీంతో ఇది ట్రెండ్ అవుతోంది. అంతేకాదు, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో షమీందర్ మరోసారి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X