వర్మకు బిగ్ షాకిచ్చిన జూనియర్ పవన్.. తొలిసారి వెనకడుగేసిన సంచలన దర్శకుడు.!

By Manoj

రాంగోపాల్ వర్మ... తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు ఒక సంచలనం. మామూలు సినిమా డైరెక్టర్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఆయన... తక్కువ వ్యవధిలోనే ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. అన్ని రకాలు జోనర్లలో సినిమాలు తీసి ఔరా అనిపించుకున్నాడు. తెలుగులోనే కాకుండా ఏకంగా హిందీలో అమితాబ్‌తోనే సినిమా చేసి ఆశ్చర్యపరిచాడు. అంతటి పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న ఆర్జీవీ... కొన్నేళ్లుగా వివాదాలలో తలదూరుస్తూ సంచలనం అవుతున్నాడు. ఎన్ని అడ్డంకులు ఏర్పడినా సినిమాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడికి భారీ షాక్ ఇచ్చాడు జూనియర్ పవన్ కల్యాణ్. అసలేం జరిగింది.? వివరాల్లోకి వెళ్తే....

వివాదాలతో సహవాసం.. వర్మకే సాధ్యం

వివాదాలతో సహవాసం.. వర్మకే సాధ్యం

ఒకప్పుడు విభిన్నమైన చిత్రాలు తీసి గొప్ప పేరు సంపాదించుకున్నాడు రాంగోపాల్ వర్మ. అయితే, కొన్నేళ్లుగా ఆయన సున్నితమైన అంశాలను ఎంచుకుని మరీ సినిమాలు రూపొందిస్తున్నాడు. దీంతో తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. అయినప్పటికీ ఎటువంటి అడ్డంకులు లేకుండా సినిమాలు విడుదల చేస్తున్నాడు. ఇలా చేయడం ఇండస్ట్రీల ఆర్జీవీకే చెల్లింది.

ఆర్జీవీకి అస్త్రాలుగా మారిన ఏపీ పాలిటిక్స్

ఆర్జీవీకి అస్త్రాలుగా మారిన ఏపీ పాలిటిక్స్

వరుసగా వివాదాస్పద చిత్రాలనే తీస్తున్న రాంగోపాల్ వర్మ... ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఫుల్‌గా ఫోకస్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘రక్త చరిత్ర', ‘వంగవీటి', ‘లక్ష్మీస్ ఎన్టీఆర్', ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' వంటి చిత్రాలను తెరకెక్కించాడు. దీంతో ఎంతో మంది నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ.. ఆర్జీవీ వెనకడుగు వేసిన దాఖలాలు లేవనే చెప్పాలి.

సొంత ఫ్లాట్‌ఫాం.. ఆర్జీవీ ప్లాన్ అదిరిందిగా

సొంత ఫ్లాట్‌ఫాం.. ఆర్జీవీ ప్లాన్ అదిరిందిగా

లాక్‌డౌన్ వల్ల సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే సరికొత్తగా ఆలోచించిన రాంగోపాల్ వర్మ... ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్' పేరిట సరికొత్త ఫ్లాట్‌ఫాంను రూపొందించాడు. ఇందులో భాగంగానే తన సినిమాలను అందులోనే విడుదల చేస్తున్నాడు. ఇప్పటికే తాను తెరకెక్కించిన కొన్ని చిత్రాలను కూడా రిలీజ్ చేసి బాగా డబ్బులు సంపాదించుకున్నాడు.

వర్మ డేరింగ్ స్టెప్.. ఆదిలోనే ఎదురుదెబ్బ

వర్మ డేరింగ్ స్టెప్.. ఆదిలోనే ఎదురుదెబ్బ

ఈ మధ్య వరుసగా ‘క్లైమాక్స్', ‘నగ్నం', ‘కరోనా', ‘12 O క్లాక్' సహా ఎన్నో చిత్రాలను తెరకెక్కించాడు వర్మ. అదే సమయంలో యాదార్ధ సంఘటన ప్రణయ్ కథ ఆధారంగా మరో సినిమాను తీస్తున్నట్లు ప్రకటించాడు. కానీ, ఈ సినిమా పట్టాలెక్కే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి కారణం ప్రణయ్ తండ్రి రాంగోపాల్ వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేయడమే.

పవర్ స్టార్‌తో సంచలనం.. పక్కా ప్లాన్‌తో..

పవర్ స్టార్‌తో సంచలనం.. పక్కా ప్లాన్‌తో..

ఇప్పటికే ఎన్నో వివాదాస్పద చిత్రాలను తెరకెక్కించిన రాంగోపాల్ వర్మ.. ‘పవర్ స్టార్' అనే సినిమాను ప్రకటించి సంచలనం రేకెత్తించాడు. ఇది పవన్ కల్యాణ్ గురించి తీసే సినిమా అని పరోక్షంగా హింట్ ఇచ్చాడు. దీనికి కారణం ఇందులో నటించే హీరో అచ్చం పవన్ కల్యాణ్‌లా ఉండడమే. ఆదివారం కూడా ఈ సినిమా గురించి ట్వీట్ చేశాడు ఈ సెన్సేషనల్ డైరెక్టర్.

వర్మకు బిగ్ షాకిచ్చిన జూనియర్ పవన్

వర్మకు బిగ్ షాకిచ్చిన జూనియర్ పవన్


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ టిక్‌టాక్ స్టార్‌ను ‘పవర్ స్టార్' కోసం ఎంపిక చేసుకున్నాడు వర్మ. ఇందుకోసం అతడితో చర్చలు కూడా జరిపాడంతో త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతుందని అంతా అనుకున్నారు. ఇలాంటి సమయంలో సదరు నటుడు ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడట. దీంతో ఈ సినిమా ఆగిపోయినట్లేనన్న టాక్ వినిపిస్తోంది.

Recommended Video

Amrutha Pranay కామెంట్స్ పై స్పందించిన Ram Gopal Varma
జూనియర్ పవన్ కల్యాణ్ వివరాలు ఇవే

జూనియర్ పవన్ కల్యాణ్ వివరాలు ఇవే

‘పవర్ స్టార్' మూవీ కోసం ఆర్జీవీ ఎంపిక చేసుకున్న వ్యక్తి పేరు చల్లకోటి నరేష్. భద్రాచలం పట్టణానికి చెందిన అతడు పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని. చూడ్డానికి పవర్ స్టార్‌లా ఉంటాడు. దీంతో తన అభిమాన హీరోను అనుకరిస్తుంటాడు. ఈ క్రమంలోనే ఎన్నో వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అప్పటి నుంచి అతడు బాగా ఫేమస్ అయిపోయాడు. ఇలానే వర్మ దృష్టిలో పడ్డాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X