ప్రియుడితో జ్వాలా గుత్తా కెమిస్ట్రీతో కేక.. బికినీలో ఆమె.. సిక్స్‌ప్యాక్‌తో అతను.. హాట్ హాట్‌గా
తమిళ నటుడు విష్ణు విశాల్, బాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా మధ్య రొమాన్స్ జోరుగా సాగుతున్నది. గత కొద్దికాలంగా వీరిద్దరి రిలేషన్ హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ఈ ఇద్దరు ప్రేమ పక్షులు పోస్టు చేస్తున్న ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో విష్ణు విశాల్, జ్వాలా గుత్తా మాల్దీవుల రొమాంటిక్ వెకేషన్ జాతీయ మీడియాను కూడా ఆకర్షించింది.

జ్వాలా గుత్తాతో విష్ణు విశాల్ లివింగ్ రిలేషన్
విష్ణు విశాల్ తన భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత జ్వాలా గుత్తాతో లివింగ్ రిలేషన్‌ను కొనసాగిస్తున్నారు. లాక్‌డౌన్‌లో వారిద్దరి విరహా వేదన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక హాట్ హాట్ ఫోజులతో ఈ జంట ఇంటర్నెట్‌ను హీటెక్కించారు.
ఎద అందాలతో కవ్విస్తున్న హీనా ఖాన్.. బాలీవుడ్ ముద్దుగమ్మ ఫోటోలు వైరల్

జ్వాలా ఫోటోలు వైరల్
గత ఏడాది లవర్స్ డే, వారి బర్త్ డే సందర్భంగా పోస్టు చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అలాగే వారిద్దరూ రింగులు మార్చుకొని నిశ్చితార్థం కూడా చేసుకొన్నారు. అర్జెంట్‌గా ఉన్నపళంగా జరిగిన వారిద్దరి ఎంగేజ్‌మెంట్ ఫోటోలపై దక్షిణాది పరిశ్రమలో చర్చనీయాంశమైంది.

విష్ణు విశాల్ షూటింగు ముగించుకొని
ఇక తాజాగా విష్ణువిశాల్ తన తాజా చిత్రం ఎఫ్ఐఆర్ సినిమా షూటింగును పూర్తి చేసుకొన్నారు. ఆ తర్వాత తన ప్రియురాలు జ్వాలాగుత్తాతో కలిసి మాల్దీవుల్లో వాలిపోయారు. వారిద్దరి రొమాంటిక్ ఫోటోలను తమ ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేసుకొన్నారు.

మాల్దీవుల్లో కేక పెట్టించిన కెమిస్ట్రీ
మాల్దీవుల్లో వీరిద్దరి కెమిస్ట్రీ అభిమానులకు, నెటిజన్లకు కన్నుల పండువగా మారింది. బీచ్‌లో బికినీతో జ్వాలా గుత్తా ఫోజిస్తే.. సముద్రంలో సిక్స్‌ప్యాక్‌తో విష్ణు విశాల్ అర్ధనగ్నంగా తన ప్రతాపం చూపారు.

రొమాంటిక్ మూడ్‌లో జ్వాలా గుత్తా, విష్ణు విశాల్
మాల్దీవుల్లో తమ రొమాంటిక్ మూమెంట్స్‌ను అభిమానులతో షేర్ చేసుకొన్నారు. ఇది మాకు షార్ట్ వెకేషన్స్, ఎంజాయ్ వెకేషన్స్. బ్రేక్ తీసుకొని మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నాం. ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు అంటూ జ్వాలా గుత్తా మెసేజ్‌ను పోస్టు చేసింది.


Click it and Unblock the Notifications











