twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కె.రాఘవేంద్రరావు మొదటి పండు విసిరింది ఏవరి నడుముపై అంటే.. ఫస్ట్ నైట్ సాంగ్ తో రచ్చ రచ్చ

    |

    టాలీవుడ్ సీనియర్ మోస్ట్ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు ఎనిమిది పదుల వయసు దగ్గరపడుతున్నా కూడా ఇంకా అదే ఉత్సాహంతో కనిపిస్తున్నారు. టాలీవుడ్ లో 100కు పైగా సినిమాలను డైరెక్ట్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ అయిన దర్శకేంద్రుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నాడు. ముఖ్యంగా హీరోయిన్స్ పై పూల బాణాలు, పండ్లతో సరసాలు చేయించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇక ఆయన మొదటి పండు విసిరింది ఏవరిపైనో తెలిస్తే షాక్ అవుతారు.

    త్వరలో మరో సినిమా

    త్వరలో మరో సినిమా

    దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు రావు కమర్షియల్ ఎలిమెంట్స్ ద్వారానే అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించగలరని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో వీలైనంత వరకు అన్ని నవరసాలు ఎమోషన్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. 108 సినిమాలను డైరెక్ట్ చేసిన ఆయన త్వరలో మరో పెళ్లి సందD సినిమా ద్వారా కూడా ఆడియెన్స్ ఆకట్టుకోవాలని అనుకుంటున్నారు.

    ఆ విషయంలో నెంబర్ వన్

    ఆ విషయంలో నెంబర్ వన్

    రాఘవేంద్రరావు అనగానే మొదట అందరికి గుర్తుకు వచ్చేది రొమాంటిక్ సాంగ్స్ అనే చెప్పాలి. ముఖ్యంగా హీరోయిన్స్ ను అందంగా చూపించే అతికొద్ది మంది దర్శకుల్లో ఆయన నెంబర్ వన్. అప్పట్లో జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క హీరోయిన్ కె.రాఘవేంద్రరావు గారితో ఒక సినిమా చేయాలని అనుకునేవారు.

    మెగాస్టార్ సినిమాలో..

    మెగాస్టార్ సినిమాలో..

    ఇక ఇన్నేళ్ల కెరీర్ లో ఆయన మొదటి పండు ఎవరిపైన విసిరారు అనేది అందరిలో ఒక ప్రత్యేకమైన ఆసక్తిని కలిగిస్తోంది. అయితే మొదట ఈ ట్రెండ్ స్టార్ట్ చేసింది 1988లో. మెగాస్టార్ చిరంజీవి నటించిన మంచి దొంగ అనే ఆ సినిమాలో హీరోయిన్ నడుముపై వివిధ రకాల పండ్లను వేశారు. ఆ షాట్ అప్పట్లో హైలెట్ గా నిలిచింది.

    ఆ హీరోయిన్ ఎవరంటే..

    ఆ హీరోయిన్ ఎవరంటే..

    మంచి దొంగ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించారు. విజయశాంతి, సుహాసిని ఇద్దరు మెగాస్టార్ కు జోడిగా కనిపించగా అందులో విజయశాంతి నడుము పైనే పండ్లు, పూలతో ప్రయోగాలు చేసి కొత్త స్టైల్ రొమాంటిక్ టచ్ ఇచ్చారు. 'బెడ్‌ లైటు తగ్గించనా' అనే ఆ ఫస్ట్ నైట్ సాంగ్ ఇప్పటికి కూడా బెస్ట్ రొమాంటిక్ సాంగ్ లలో ఒకటని చెప్పవచ్చు. ఆ తరువాత రాఘవేంద్రరావు పండ్ల ట్రెండ్ అన్ని రకాల సినిమాల్లో కొనసాగుతూ వచ్చింది.

    English summary
    Most senior director of Tollywood k.raghavendra rao still feel the same age appears to have tens of eight. The director, who is a talented director who has directed over 100 films in Tollywood, has received a unique craze of his own. Flirting with flower arrows and fruits, especially on heroines, was his buttered education. No longer would he be shocked to know anyone who poses with the first fruit.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X