K. Viswanath: విశ్వనాథ్‌ అంటే చిరంజీవికి ఎందుకు ఇష్టమో తెలుసా? పెరుగన్నమే మార్చేసిందంటే నమ్ముతారా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదకర సంఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది ప్రముఖులు మరణించారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్‌కు చెందిన లెజెండరీ యాక్టర్, డైరెక్టర్ కే విశ్వనాథ్ గురువారం రాత్రి తుది శ్వాసను విడిచారు. ఈ నేపథ్యంలో ఆయన గురించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు కే విశ్వనాథ్‌తో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న అనుబంధం గురించి అంతా మాట్లాడుకుంటోన్నారు. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరి బంధం ఎలా మొదలైందో తెలుసుకుందాం పదండి!

 కే విశ్వనాథ్ కన్నుమూత

కే విశ్వనాథ్ కన్నుమూత

టాలీవుడ్‌లో యాభై సంవత్సరాలకు పైగానే తనదైన చిత్రాలను తెరకెక్కించడంతో నటుడిగానూ ప్రేక్షకులను అలరించిన కే విశ్వనాథ్.. కొంత కాలంగా అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి మరోసారి అస్వస్థతకు గురైన ఆయన.. ఓ ఆస్పత్రిలో తుదిశ్వాసను విడిచారు. దీంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి.

విశ్వనాథ్‌కు సంతాపంగా

విశ్వనాథ్‌కు సంతాపంగా

లెజెండరీ డైరెక్టర్ కమ్ యాక్టర్ కే విశ్వనాథ్ మరణంతో సినీ పరిశ్రమలో విషాద పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఆయన మరణంపై అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అలాగే, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు కూడా సంతాపం తెలుపుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కే విశ్వనాథ్ మరణంపై ఎమోషనల్‌గా పోస్టులు పెడుతున్నారు.

మెగాస్టార్‌తో అనుబంధం

మెగాస్టార్‌తో అనుబంధం

కే విశ్వనాథ్ మరణంతో ఆయన గురించి ఎన్నో వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ఈ దిగ్గజ దర్శకుడి అనుబంధం గురించే అంతా మాట్లాడుకుంటోన్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో 'ఆపద్భాందవుడు', 'శుభలేఖ', 'స్వయంకృషి' చిత్రాలు వచ్చాయి. వీటన్నింటితో చిరంజీవికి అవార్డులు దక్కడంతో పాటు విశ్వనాథ్‌పై ప్రేమను పెంచాయి.

అలా గౌరవం పెరిగింది

అలా గౌరవం పెరిగింది

విశ్వనాథ్‌తో బంధం గురించి ఓ సందర్భంలో చిరంజీవి మాట్లాడారు. 'స్వయంకృషి సినిమా చేస్తున్నప్పుడు ఒక గుడిలో వర్క్ చేస్తున్నాను. అప్పుడు కొంచెం లావుగా ఉన్నానని ఫీలింగ్‌తో మధ్యాహ్నం అన్నం తినేవాడిని కాదు. విశ్వనాథ్ గారికి ఈ విషయం తెలిసి ఆకలితో ఉన్నవాడి చేత నేనెలా చేయించుకుంటాను అన్నారు. అప్పుడే ఆయనపై గౌరవం పెరిగింది' అన్నారు.

తండ్రే పంపించారా అని

తండ్రే పంపించారా అని

తర్వాత చిరంజీవి 'చిరంజీవిని నిద్ర లేపకండి అని ఆయన.. స్వయంగా పెరుగన్నం కలిపి పంపారు. దాంట్లో పెరుగన్నం కాదు నా ప్రేమని కలబోశానని చెప్పండి. ఎందుకు తినడో చూస్తాను అన్నారట. అది కంచి గుడి. ఆ అన్నం నా దగ్గరకు రాగానే మా నాన్నే స్వయంగా పంపారని అనిపించింది. దాన్ని ప్రసాదంలా భావించి మొత్తం తినేశాను' అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

ముద్దు పెట్టుకుంటారు

ముద్దు పెట్టుకుంటారు

ఇదే వేదికపై చిరంజీవి మాట్లాడుతూ.. 'నేను ఎంతో మంది దర్శకులతో పని చేశాను. కానీ నటీనటులను ఇంత ప్రేమగా చూసుకునే ఒకే ఒక్క దర్శకుడు నాకు తెలిసి విశ్వనాథ్ గారు మాత్రమే. నేను ఆయనకు ఎప్పుడు కనిపించినా ఆప్యాయంగా రెండు బుగ్గలూ నిమురుతూ నన్ను ముద్దాడతారు. అప్పుడు మా నాన్న గుర్తొస్తారు. అందుకే ఆయనంటే మరింత ఇష్టం' అని పేర్కొన్నారు.

చిరంజీవి ఎమోషనల్

చిరంజీవి ఎమోషనల్

కే విశ్వనాథ్ మరణ వార్తపై మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ చేశారు. 'ఇది అత్యంత విషాదకరమైన రోజు. పితృ సమానులు కళాతపస్వి కే విశ్వనాథ్ గారు ఇక లేరు అనే వార్త దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆయన గొప్పదనం గురించి చెప్పడానికి మాటలు చాలవు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మహా దర్శకుడు ఆయన' అంటూ తన బాధనంతా వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X