Kaikala Satyanarayana: 223 సెంచరీలు.. తెలుగులో ఎవరికీ లేని రికార్డు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇబ్బంది!
టాలీవుడ్‌లో విషాదకర సంఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది ప్రముఖులు మరణించారు. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన లెజెండరీ యాక్టర్, నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ శుక్రవారం ఉదయం తుది శ్వాసను విడిచారు. ఈ నేపథ్యంలో ఆయన గురించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు కైకాల సత్యనారాయణ సాధించిన రికార్డులు వైరల్ అవుతోన్నాయి. అలాగే, ఆయన గురించి మరికొన్ని విషయాలను గురించి తెలుసుకుందాం పదండి!

అనారోగ్యంతో కైకాల కన్నుమూత
టాలీవుడ్‌లో అరవై ఏళ్లు తనదైన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరించిన నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ.. కొంత కాలంగా అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున మరోసారి అస్వస్థతకు గురైన ఆయన.. ఫిల్మ్ నగర్‌లోని నివాసంలో తుదిశ్వాసను విడిచారు. దీన్ని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు.

సత్యనారాయణకు సంతాపంగా
లెజెండరీ యాక్టర్ కైకాల సత్యనారాయణ మరణంతో సినీ పరిశ్రమలో విషాద పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఆయన మరణంపై అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అలాగే, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు కూడా సంతాపం తెలుపుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కైకాల సత్యనారాయణ మరణంపై పోస్టులు పెడుతున్నారు.

అంత్యక్రియలు ఆలస్యంగానే
కైకాల సత్యనారాయణ మరణ వార్త సినీ పరిశ్రమలోనూ, రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర విషాదాన్నే నింపింది. ఇక, ఆయన భౌతికకాయాన్ని ఇంటి దగ్గరే ఉంచుతారని తెలిసింది. ఆ తర్వాత అభిమానుల సందర్శనార్థం ఫిలిం చాంబర్‌కు తీసుకొచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. ఇక, కైకాల అంత్యక్రియలు శనివారం మహాప్రస్థానంలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

సత్యనారాయణ సినీ ఘనతలు
1959లో వచ్చిన 'సిపాయి కూతురు' అనే చిత్రం ద్వారా కైకాల సత్యనారాయణ నటుడిగా మారారు. అప్పటి నుంచి 60 ఏళ్ల సినీ జీవితంలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా, హీరోగా చాలా పాత్రల్లో దాదాపు 770కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయన దాదాపు 200 మంది దర్శకులతో పని చేశారు. అలాగే, 28 పౌరాణిక, 51 జానపద, 9 చారిత్రక చిత్రాల్లో భాగమై సత్తా చాటారు.

కైకాల కనీవినీ ఎరుగని రికార్డు
కైకాల సత్యనారాయణ సినీ ప్రయాణంలో ఎన్నో రికార్డులు కొట్టారు. ఈ క్రమంలోనే ఆయన ఏకంగా 223 వంద రోజులు ఆడిన చిత్రాల్లో భాగమైన నటుడిగా రికార్డును నమోదు చేశారు. అలాగే, ఆయన నటించిన మరో 60 చిత్రాలు 50 రోజులకు పైగా ఆడాయి. అంతేకాదు, కైకాల నటించిన పది చిత్రాలు ఏడాదికి పైగా ప్రదర్శితం అయ్యాయి. టాలీవుడ్ మరే నటుడికీ ఈ రికార్డు లేదు.

ఎన్టీఆర్ అభిమానులు షాక్
కైకాల సత్యనారాయణకు ఎన్టీఆర్‌తో చాలా సన్నిహిత సంబంధం ఉంది. అందుకే వీళ్లిద్దరూ దాదాపు యాభైకి పైగ చిత్రాల్లో కలిసి నటించారు. అంతేకాదు, సుమారు 20కి పైగా చిత్రాల్లో ఎన్టీఆర్‌కు కైకాల డూప్‌గా నటించారు. ఆ సమయంలో ఎవరు ఎవరో తెలియక ఫ్యాన్స్ ఇబ్బంది పడేవాళ్లు. అంతలా ఎన్టీఆర్ హావభావాలు, బాడీ లాంగ్వేజ్‌ను కైకాల వంటబట్టించుకుని మెప్పించారు.


Click it and Unblock the Notifications











