అక్కినేని ఇంట్లో వంట మనిషి.. ఆమె రేంజ్ మామూలుగా లేదు!!

సెలెబ్రిటీల ఇంట్లో ప్రతీ పనికి ఓ మనిషి ఉంటారు. తెల్లారి లేచిన దగ్గరి నుంచి రాత్రి నిద్ర పోయే వరకు అంతా పని మనుషులే చూసుకుంటారు. అయితే ఒక్క తిండి వద్ద మాత్రం వాళ్లే దగ్గరుండి మరీ చూసుకుంటారు. మెగా, మంచు, ఘట్టమనేని ఫ్యామిలీలో ఇంటి సభ్యులే వంటలు చేసి ప్రేమగా వడ్డిస్తుంటారు. అయితే అక్కినేని ఇంట మాత్రం వ్యవహారం వేరేలా ఉంటుంది. నాగార్జున ఇంట్లో ఓ స్పెషల్ వంట మనిషి ఉంటుంది.

కుకింగ్‌లో అమల వీక్..

కుకింగ్‌లో అమల వీక్..

వంట విషయం వచ్చే సరికి అమల వీక్ అన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో అమల మాట్లాడుతూ వంట విషయాన్ని ప్రస్థావించింది. తనకు వండటం రాదని, తనకంటే నాగార్జునే బాగా వండుతాని సీక్రెట్స్ బయట పెట్టేసింది. తాను ఇంత వరకు వంట వండలేదని తెలిపింది. అలాగే చైతన్య కూడా బాగా వండుతాడని పేర్కొంది.

స్పెషల్ చెఫ్

స్పెషల్ చెఫ్

అందుకే అమల, నాగార్జున, అఖిల్‌కు వండి పెట్టేందుకు ఓ స్పెషల్ చెఫ్‌ను పెట్టుకున్నారు. ఆమె వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా.. ఈ ఏడాదిలో అద్భుతంగా వండి పెట్టినందుకు అఖిల్ ఆమపై ప్రశంసలు కురిపించాడు. కైరావి మాకు మంచి ఆరోగ్యం, చక్కటి ఆహారాన్ని అందిస్తోంది. నేటికి ఏడాది అయింది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం నాకు ఓ లక్ష్యంగా ఉండేది అంటూ అఖిల్ పేర్కొన్నాడు.

మొత్తం మార్చేసింది..

మొత్తం మార్చేసింది..

అందుకోసం పోషకాహారాలు, వాటిపై అవగాహన ఉన్న వారికి కోసం చూశాం, అంతే కాకుండా అద్భుతమైన డైట్ ప్లాన్ చేయాలని ఆశించాను. కైరావీ మమ్మల్ని మొత్తం మార్చేసింది. మాకు ఇంత బాగా వండిపెట్టినందుకు థ్యాంక్స్. ఇంకా నువ్ బాగా వండి పెట్టాలని, నువ్ చేసే ప్రతీ పనిలో విజయం చేకూరాలని కోరుకుంటున్నాను. మనం కలిసి ఏడాది అవుతున్నందుకు కంగ్రాట్స్ అంటూ చెఫ్ ఫోటోను అఖిల్ షేర్ చేశాడు.

Recommended Video

Malli Malli Chusa Movie Trailer Launch
ప్రతీ రోజూ ఎంజాయ్ చేశాను..

ప్రతీ రోజూ ఎంజాయ్ చేశాను..

ఇదో అద్భుతమైన సవాళ్లతో కూడుకున్న ఏడాది.. ప్రతీ రోజూ ఎంతో ఎంజాయ్ చేశాను. నాగార్జున, అమల గారికి వండిపెట్టడం సంతోషంగా ఉంది. అంటూ అఖల్ చేసిన పోస్ట్‌కు కైరావి ఇలా రియాక్ట్ అయింది. మొత్తానికి అక్కినేని ఇంట్లో వంట మనిషి కూడా ఈ రేంజ్‌లో ఉంటుందని ఎవ్వరూ ఊహించరు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X