భర్త కౌగిలిలో కాజల్ బంధీ.. అక్కడ హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తోన్న కొత్త జంట.. పిక్స్ వైరల్

కాజల్ అగర్వాల్ పెళ్లి మీడియాలో, సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. పెళ్లి జరిగి వారం దాటుతున్నా కూడా ఈ జంట ఇంకా ట్రెండింగ్‌లోనే ఉంది. కాజల్ తన పెళ్లి తరువాత చేస్తోన్న పోస్ట్‌లు, షేర్ చేస్తోన్న ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. పెళ్లి సంప్రదాయాల గురించి చెబుతూ చేసిన పోస్ట్‌లు, పెళ్లి చీర డిజైనింగ్ గురించి చెబుతూ షేర్ చేసిన ఫోటోలు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి.

Recommended Video

#kajalaggarwal : Kajal Aggarwal Reveals How Gautam Kitchlu Proposed To Her For Marriage
కాజల్ పెళ్లి..

కాజల్ పెళ్లి..

కాజల్ అగర్వాల్ గుజరాతీ కావడం, ప్రియుడు గౌతమ్ కిచ్లూ కశ్మీరి అవ్వడం వల్ల ఆ రెండు ప్రాంతాలకు అనుగుణంగా సంప్రదాయ పద్దతిలో వివాహం జరిపించారు. అక్టోబర్ 30న సాయంత్ర అంగరంగ వైభవంగా ఇరు కుటుంబాల సంప్రదాయాల మేరకు వివాహాతంతును కానిచ్చారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను ఊపేశాయి.

పెళ్లికి ముందు అనూహ్య పోస్ట్..

పెళ్లికి ముందు అనూహ్య పోస్ట్..

పెళ్లికి ఇంకొన్ని గంటలు ఉందనే ముందర కాజల్ ఓ వింత పోస్ట్ చేసింది. ఎంతో గంభీరంగా నిబ్బరంగా కోపంగా చూస్తున్నట్టు పోజు ఇచ్చింది. ఆ పోజు కంటే ఆమె పెట్టిన కామెంట్ మరింతగా వైరల్ అయింది. తుపాను వచ్చే కంటే ముందుండే ప్రశాంతత నిశ్శబ్దం అంటూ ఏదో పరోక్షంగా చెప్పేసింది. పెళ్లి తరువాత కాజల్ పూజలో కూర్చున్న ఫోటోలు, ఇంట్లో అడుగుపెట్టిన సందర్భంలో దిగిన ఫోటోలు కార్వా చౌత్ ఫోటోలు ఎంతగానో వైరల్ అయ్యాయి.

హనీమూన్ గురించి..

హనీమూన్ గురించి..

ఇక తామిద్దరం హనీమూన్‌కు వెళ్తున్నామని చెబుతూ ఓ పోస్ట్ చేసింది. అయితే ఆ పోస్ట్‌లో హనీమూన్ వెకేషన్ ఎక్కడన్నది మాత్రం చెప్పలేదు. కానీ తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలతో ఆ లొకేషన్ ఎక్కడన్నది అర్థమైపోయింది. కాజల్ తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ హనీమూన్ ట్రిప్ గురించి హింట్ ఇచ్చింది.

హాట్ ఫోటోలు..

హాట్ ఫోటోలు..

కాజల్ తన బ్యాక్‌ను ఎక్స్ పోజ్ చేస్తూ చేసిన ఫోటోలు నెట్టింట్లో కుంపటి పెడుతున్నాయి. అలా వీపును మొత్తం ఫ్రీగా వదిలేసి.. చుట్టూ సముద్రాన్ని ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలను షేర్ చేసింది. భర్త్ కౌగిలో కాజల్ బంధీ అయి ఎంతో సంతోషంగా హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మళ్లీ బిజీగా..

మళ్లీ బిజీగా..

హనీమూన్ పూర్తయ్యాక కాజల్ మళ్లీ సినిమాలతో బిజీ కానుంది. అసలే ఆమె కోసం ఆచార్య ఎదురుచూస్తున్నాడు. ఆమె వచ్చాక ఆచార్య షూటింగ్‌లో పాల్గొంటుంది. ఇదే కాకుండా కాజల్ చేతిలో ఇంకా తమిళ ప్రాజెక్ట్‌లు కూడా ఉన్నాయి. మొత్తానికి పెళ్లి తరువాత కూడా సినిమాలను వదలనంటూ ముందే చెప్పేసింది. ఇక మున్ముందు ఎలా ప్రాజెక్ట్‌లకు ఓకే చెబుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X