సమంతను కూడా వెనక్కి నెట్టేసింది.. అందుకే కాజల్ సౌత్ క్వీన్!
అందాల చందమామ, ఆల్చిప్పల్లాంటి కళ్లతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది కాజల్ అగర్వాల్. దశాబ్దంపైగా టాప్ హీరోయిన్ కొనసాగుతూ తన సత్తాను చాటుతోంది. హీరోయిన్ అంటే మహా అయితే రెండు మూడేళ్లు మాత్రమే లైమ్ లైట్‌లో ఉంటున్నారు. కానీ ముద్దుగుమ్మ కాజల్ మాత్రం దశాబ్దం దాటిని ఇంకా ఫుల్ స్పీడ్ మీదుంది. ఈ ఫీట్ సాధించిన అతి కొద్ది స్టార్ హీరోయిన్‌లలో కాజల్ ఒకరు. నేడు కాజల్ బర్త్ డే (జూన్ 19). ఈ సందర్భంగా సోషల్ మీడియాలో కాజల్ హవా నడుస్తోంది.

ఫ్లాపులతో ప్రయాణం..
ఇండస్ట్రీకి లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది కాజల్. అయితే ఆ సినిమా బోల్తా కొట్టింది. అలా రెండు మూడు సినిమాలు చేశాక చందమామతో మొదటి హిట్ అందుకుంది. ఆ తరువాత కాజల్ జీవితంలో ఓ పెద్ద మలుపు సంభవించింది.

మగధీరతో స్టార్ హీరోయిన్..
మగధీర సినిమాలోని మిత్రవిందా పాత్రతో కాజల్ అగ్ర కథనాయికగా మారిపోయింది. కాజల్ జీవితాన్ని పూలబాటగా మార్చిన చిత్రం మగధీర. ఆపై కాజల్ వరుసగా బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటిస్తూ తిరుగు లేకి కథానాయికగా స్టార్డమ్ అనుభవించింది. బాలీవుడ్‌లో అడుగుపెట్టినా.. అక్కడ నిరాశే ఎదురైంది.

నేటికీ అవకాశాల వెల్లువ..
నేటికి కాజల్‌కు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య చిత్రంలో కాజల్ ఎంపికైంది. ఇవన్నీ కాసేపు పక్కన బెడితే కాజల్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా మొత్తం హోరెత్తుతోంది. ఆమె ఫ్యాన్స్ బర్త్ డేను ఓ రేంజ్‌లో సెలెబ్రేట్ చేస్తున్నారు.
Recommended Video

సమంతను వెనక్కి నెట్టి..
బర్త్ డే ట్రెండ్‌లో కాజల్ అగర్వాల్ అగ్రస్థానంలో ఉంది. ఇప్పటికే సమంత, అనుష్క, కీర్తి సురేష్‌లను దాటి మొదటి స్థానంలో ఉంది. ఇప్పటి వరకు సమంత(254k), అనుష్క (156k), కీర్తి సురేష్‌లు (91.5k) మొదటి మూడు స్థానాల్లో ఉండగా.. కాజల్ 260kలతో టాప్ ప్లేస్‌లోకి వచ్చింది. అందుకే కాజల్ అగర్వాల్ సౌత్ క్వీన్ అని అంటారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











